E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 94 : తనూజ – కళ్యాణ్ ల పరువు తీసిన భరణి… ఇమ్మూ – డెమోన్ బలి… పాపం సుమన్

Bigg Boss 9 Telugu Day 94 : తనూజ – కళ్యాణ్ ల పరువు తీసిన భరణి… ఇమ్మూ – డెమోన్ బలి… పాపం సుమన్
Advertisement

Bigg Boss 9 Telugu Day 94 : “ఈ వారం నామినేషన్ నుంచి బయట పడి, స్కోర్ బోర్డులో పాయింట్స్ సంపాదించుకోవడానికి ఇస్తున్న మూడవ టాస్క్ పట్టుకో పట్టుకో” అంటూ ఇమ్యూనిటీ కోసం మూడవ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఇందులో కంటెస్టెంట్స్ జంబో ప్యాంట్స్ వేసుకుని… సంచాలకులు కళ్యాణ్, సంజన వేసే బాల్స్ ను క్యాచ్ పట్టుకోవాలి. ఈ క్రమంలో తనూజా తనను తోస్తుందని ఇమ్మూ, భరణి తన ప్లేస్ లోకి వచ్చి బాల్స్ తీసుకుంటున్నాడు అని సుమన్ ఫైర్ అయ్యారు. “సుమన్ కు హైట్ తక్కువ. ఒకటి వేస్తే ఏమవుతుంది?” అని సంజన కళ్యాణ్ ను అడగడంతో… “సుమన్ కు నేను వేసిన బాల్స్ అన్నీ భరణి గారు తీసుకున్నారు” అని చెప్పాడు కళ్యాణ్. ఈ టాస్క్ లో తనూజా విన్ అయ్యింది.

ఈసారి ఒకరిని కాదు ఇద్దరినీ…

“కూర్చో అంటే కూర్చుంటున్నాడు, నిలబడు అంటే నిలబడుతున్నాడు. తనూజా ఎక్కువ కమాండ్ చేస్తున్నట్టు అన్పిస్తోంది” అంటూ తనూజ – కళ్యాణ్ గురించి సంజనా దగ్గర షాకింగ్ కామెంట్స్ చేశాడు భరణి. “ఈసారి ఒకరిని కాదు ఇద్దరిని. తరువాత జరిగే టాస్క్ లో పాల్గొనకుండా చేయాలి” అని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో “నిన్న కూడా నన్నే టార్గెట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ హయ్యెస్ట్ లో ఉన్నాను అనే అదే రీజన్ తో తీయొద్దు” అని ఇమ్మూ రిక్వెస్ట్ చేశాడు. “కానీ మీరు హయ్యెస్ట్ లో ఉన్నారు” అని తనూజా వివరణ ఇచ్చేలోగా సీరియస్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డెమోన్ మాత్రం హయ్యెస్ట్ ఒకరిని, లోయెస్ట్ గా ఉన్న ఒకరిని తీయమని రిక్వెస్ట్ చేశాడు. “నన్ను ఎందుకు ప్రతిసారీ టార్గెట్ చేస్తారు? ఇంక డైరెక్ట్ గా బిగ్ బాస్ కు చెప్పు గేట్లు ఓపెన్ చేయమని వెళ్లిపోతా” అంటూ ఫైర్ అయ్యింది సంజన. “మీ పేరు ఎవ్వరూ చెప్పలేదు ఇక్కడ. మీరే అర్థం చేసుకోవట్లేదు. మీకు పాయింట్స్ ఇచ్చిందే నేను, ఇమ్మూ అన్న” అంటూ డెమోన్ సమాధానం చెప్పాడు. ఇక ఇమ్మూ అన్నను తీయొద్దు అని డెమోన్ రిక్వెస్ట్ చేయడంతో. “అతనొక్కడే కష్టపడి వచ్చాడా?” అని ఇచ్చిపడేసింది. చివరకు అందరూ కలిసి ఇమ్ము, డెమోన్ ను తీసేశారు.

తనూజాకి ఆడియన్స్ ఓటు

Advertisement

“పోటీదారులకు ఇస్తున్న నాలుగవ యుద్ధం పట్టు వదలకు. పై నుంచి కింద పడుతున్న మీ రోప్ పూర్తిగా పడిపోకముందే ఫజిల్ ను పూర్తి చేయాలి. తరువాత ఆ రోప్ పడిపోకుండా చూడాలి” అంటూ మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భరణి విన్ అయ్యాడు. దీంతో భరణి 230, సంజన 220, ఇమ్మూ 170, డెమోన్ 150, సంజన 140, సుమన్ కి 100 పాయింట్స్ వచ్చాయి. ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్న ఇద్దరు అంటే భరణి, తనూజా ప్రేక్షకులను ఎదుర్కొన్నారు. ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాక, తనూజాకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు ఆడియన్స్ నిర్ణయం ప్రకారం.

Read Also : ఓటు అప్పీల్ లో ఇమ్మూ బట్టతలపై ఆడియన్స్ జోకులు… కప్పు గెలవగానే గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా? అమ్మ దగ్గరకా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×