E-Paper
Advertisement

Punarvik: చావు అంచుల్లోంచి గెలిచింది.. 16 కోట్ల పోరాటంలో నిలిచిన చిన్నారి పునర్విక!

Punarvik: చావు అంచుల్లోంచి గెలిచింది.. 16 కోట్ల పోరాటంలో నిలిచిన చిన్నారి పునర్విక!
Advertisement

Punarvik: సేవ్ పునర్విక.. తెలుగు రాష్ట్రాల్లో నిన్నమొన్నటిదాకా మార్మోగిన స్లోగన్ ఇది.  11 నెలల చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుకొచ్చారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఓ రేంజ్‌లో సాగిన క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ సూపర్ సక్సెస్ అయింది. వెల్లువలా వచ్చిన డొనేషన్లతో.. అసాధ్యమనుకున్నది సుసాధ్యమైంది. చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు వెల్లివిరిసిన మానవత్వం.. పాప ట్రీట్‌మెంట్‌కు అవసరమైన డబ్బులను కూడగట్టింది. ఈరోజుల్లో కూడా మానవత్వం ఇంకా మసకబారలేదని ఈ ఎపిసోడ్ నిరూపించింది.

ఇది కదా అసలైన మానవత్వం అంటే

చిన్నారి పునర్విక వ్యాధి, దాని చికిత్స కోసం అయ్యే ఖర్చు గురించి తెలిసి.. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా చలించిపోయారు. అయ్యో పాపం అని వదిలేయలేదు. ఎవరి ఇంటి బిడ్డనో.. మనకెందుకులే అని లైట్ తీసుకోలేదు. సోషల్ మీడియాలో ఈ మధ్య ఇలాంటివి ఎక్కువైపోయాయని.. పైకి స్క్రోల్ చేసి వదిలేయలేదు. అయినా, మేం సాయం చేసినంత మాత్రాన వారి కష్టం తీరుతుందా? 16 కోట్ల విరాళాలు రావడం కష్టమని సింపుల్‌గా కొట్టిపారేయలేదు. ఏదైతే అదవని అనీ.. పునర్వికని తమ ఇంటి బిడ్డే అనుకున్నారు. తమ ఇంట్లో తిరిగే చిన్నారికి కష్టం వచ్చినట్లే ఫీలయ్యారు. తమవంతుగా, తోచినంత సాయం చేశారు. అలా.. 10 కోట్ల రూపాయలు వచ్చాయ్. పునర్విక తండ్రి సురేష్ కూడా ట్రీట్‌మెంట్‌కు అవసరమైన డబ్బులు సమకూరాయని ప్రకటించారు. తన బిడ్డ చికిత్స కోసం సాయం చేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక, ఎవరూ డబ్బులు కలెక్ట్ చేయొద్దని కోరారు. ట్రీట్‌మెంట్‌కు అవసరమైన డబ్బుల కంటే ఎక్కువగానే సేకరించారని, మిగతా డబ్బుని ఎవరైనా పిల్లలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుంటే, వారికి సాయం చేస్తానని, తాను రూపాయి కూడా తీసుకోనని సురేష్ ప్రకటించారు.

రూ. 6 కోట్లు సమకూర్చిన నారా లోకేష్

Advertisement

కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతోంది. దీనివల్ల.. శరీరంలో కండరాలు క్రమంగా బలహీనపడతాయ్. ఈ వ్యాధి చికిత్సకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందుగా పేరొందిన జోల్జెన్‌స్మా ఇంజెక్షన్ అవసరం. దీని ధర సుమారు 16 కోట్ల రూపాయలు. పునర్విక బతకాలంటే.. ఈ ఇంజెక్షన్ అవసరం అవుతుందని డాక్టర్లు కూడా చెప్పారు. ఓ మధ్యతరగతి కుటుంబానికి ఇంత మొత్తం ఊహకు కూడా అందదు. పునర్విక కుటుంబానిది కూడా అదే పరిస్థితి. ఈ సమయంలోనే.. సోషల్ మీడియా ఓ ఆశాకిరణంగా మారింది. ఆర్థిక స్థోమత సరిపోక.. క్రౌడ్ ఫండింగ్ కోసం సోషల్ మీడియాని వేదిక చేసుకున్నారు. అలా.. సమాజం మొత్తం ఒక్కటైంది. ఆ చిన్నారి చిరునవ్వులు మాయం కాకుండా ఉండేందుకు.. మేము సైతం అన్నారు. ఏకంగా 10 కోట్ల రూపాయల విరాళాలిచ్చారు. మిగిలిన 6 కోట్ల రూపాయల్ని.. తానే స్వయంగా సమకూరుస్తానని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించి.. పునర్విక కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. చిన్నారికి త్వరితగతిన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించారు. పునర్విక పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.

తెలుగు యూత్ విరాళాల వర్షం

పునర్విక కోసం సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు.. క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల దగ్గరకు వెళ్లి.. పాప పరిస్థితిని వివరించి డబ్బులు సేకరించారు. ట్రావెల్ విత్ జగదీశ్ అనే యూట్యూబర్ ఒక్కరే చిన్నారి కోసం కోటిన్నరకు పైగా సేకరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 50 లక్షల ఆర్థికసాయం అందింది. అలా మొత్తం.. 10 కోట్లు సేకరించారు. మిగతా 6 కోట్లు మంత్రి నారా లోకేశ్ సమకూరుస్తానని హామీ ఇచ్చారు. చిన్నారి ప్రాణం కాపాడటం కోసం ప్రతి తెలుగువాడు ముందుకొచ్చాడు. ముఖ్యంగా.. యూత్ రెస్పాండ్ అవడంతో డొనేషన్స్ వెల్లువలా వచ్చాయి. ముఖ్యంగా.. సేవ్ పునర్విక పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన హ్యాష్ ట్యాగ్స్ బాగా వైరల్ అయ్యాయి. చిన్నారి పరిస్థితి వివరిస్తూ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయ్. చాలా మంది యూత్.. రోడ్లపై తిరిగి చిన్నారి కోసం ఫండ్స్ కలెక్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా విరాళాలు ఇవ్వాలని కోరడంతో.. కోట్ల మందికి ఈ న్యూస్ చేరింది. చిన్నారి ఆరోగ్యం గురించి, సేకరించిన విరాళాల మొత్తం గురించి.. ఎప్పటికప్పుడు, ఏ రోజుకు ఆ రోజు అప్‌డేట్స్ ఇవ్వడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. తమ బాధ్యత కూడా గుర్తొచ్చింది. అలా.. కోట్ల రూపాయల విరాళాలు వెల్లువలా వచ్చి పాప బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయ్.

ఒక వీడియోతో 10 కోట్ల విరాళాలు

Advertisement

చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడేందుకు సాగిన ఈ మహా సోషల్ మీడియా యజ్ఞం.. కేవలం ఓ ఆర్థిక సాయం మాత్రమే కాదు. మానవత్వం, టెక్నాలజీకి మధ్య కుదిరిన అద్భుతమైన కలయిక అనే చెప్పాలి. ఒక్క వీడియోతో మొదలై.. పది కోట్ల రూపాయల భారీ లక్ష్యాన్ని చేరుకోవడం వెనకున్న అసలు రహస్యం.. సోషల్ మీడియా పవర్. సోషల్ మీడియాని టైంపాస్ కోసం కాకుండా.. ఓ ఆయుధంగా ఎలా మలచుకోవాలన్నది.. ఈ పునర్విక ఎపిసోడ్ అర్థమయ్యేలా చెప్పింది.

సామాన్యుడు నుంచి సెలబ్రిటీల వరకు

సోషల్ మీడియా అంటే చాలా మంది రీల్స్ చూడటానికో, ఫోటోలు అప్‌లోడ్ చేసి క్యాప్షన్లు రాసుకోవడానికో, లైకులు, షేర్ల కోసమో వాడేస్తుంటారు. కానీ.. పునర్విక కోసం సాగిన క్రౌడ్ ఫండింగ్ కొత్త కోణాన్ని చూపింది. ఎక్కడో కర్నూలు జిల్లాలో మారుమూల గ్రామంలో ఉన్న సమస్యని.. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారి దృష్టికి తీసుకెళ్లడంలో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కీలకపాత్ర పోషించాయ్. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చి, ఒకే లక్ష్యం కోసం పోరాడేలా చేసింది. లేకపోతే.. పది కోట్ల రూపాయల ఫండింగ్ వసూలు చేయడమంటే మామూలు విషయం కానే కాదు. దీని వెనుక కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయ్. అందులో.. మొట్టమొదటిది పారదర్శకత. ఆ పాపకు ఉన్న సమస్యేంటి? ఆ ఇంజక్షన్ ఖరీదేంటి? ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? అనే విషయాలను.. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం వల్ల.. ప్రజల్లో నమ్మకం కలిగింది. మన ఇంటి బిడ్డ అనే భావన కలిగించడంలో.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సక్సెస్ అయ్యారు. ఇది.. ఎవరో ఒకరిద్దరు సాయం చేస్తే తీరే కష్టం కాదు. తలో ఓ చేయి వేసి.. లక్షలాది మంది తమకు తోచినంత సాయం చేయడం వల్లే.. పది కోట్ల రూపాయల నిధి తయారైంది. ఇందులో.. ఒకరు 10 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు. ఇంకొకరు వంద రూపాయలు ఇచ్చి ఉండొచ్చు. మరొకరు.. అంతకంటే ఎక్కువే ఇచ్చి ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ.. తమకు తోచినంత సాయం చేయడం వల్లే.. పునర్విక మళ్లీ పునర్జన్మ ఎత్తబోతోంది.

మన చేతుల్లోనే ఉంది

మనకున్న క్రియేటివిటీని సామాజిక మార్పు కోసం వాడితే.. సొసైటీలో ఎంతో కొంత మార్పు తెచ్చినవాళ్లమవుతాం. సోషల్ మీడియా అంటే సెల్ఫ్-ప్రమోషన్ ఒక్కటే కాదు. పది మందికి ఉపయోగపడాలి. ఒక్క నిమిషం వీడియో.. ఒక ప్రాణాన్ని కాపాడుతుందని.. పునర్విక విషయంలో ప్రూవ్ అయింది కదా. అలాగనీ.. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీది నిజం కాదు. వాస్తవాలను గుర్తించి, వాటిని ప్రోత్సహించాలి. ఫేక్ న్యూస్‌ని వదిలేసి, నిజమైన అవసరాలను అర్థం చేసుకొని అండగా నిలవాలి. మరో పది మంది నిలబడేలా చేయాలి. మనం ఒక్కరమే ఈ ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు. కానీ.. మార్పు కోసం అదే సోషల్ మీడియా ద్వారా లక్షలాది మందిని కదిలించొచ్చు. నా ఒక్కడి వల్ల ఏమవుతుందనే ఆలోచన పక్కనపెట్టి, సామూహిక శక్తిని నమ్మాలి. అద్భుతాలు చేయాలన్నా, అందనంత ఎత్తుకు ఎదగాలన్నా.. అంతా మన చేతుల్లోనే ఉంది.

ఒక చిన్నారి కోసం సాగిన యాత్ర

సోషల్ మీడియా అనేది ఒక రెండంచుల కత్తి. దాన్ని.. విద్వేషం నింపడానికి వాడతామా? కోట్ల రూపాయలు సేకరించి.. పునర్విక లాంటి పసి ప్రాణాలను కాపడతామా? మరొకరికి సాయం చేసేందుకు ఆసరాగా నిలుస్తామా? అన్నది మన చేతుల్లోనే ఉంది. పునర్విక ఎపిసోడ్ ఒక పాఠం మాత్రమే కాదు. ఒక ఆశ. టెక్నాలజీకి.. మానవత్వం తోడైతే.. అసాధ్యమైనదేదీ లేదని నిరూపించిన అద్భుత ఘట్టం ఇది. సోషల్ మీడియాలో మన టైమ్ వేస్ట్ చేసే వీడియోలుంటాయ్. టైమ్ పాస్ కోసం వినోదాన్ని పంచే వీడియోలుంటాయ్. కానీ.. అప్పుడప్పుడు కనిపించే పునర్విక లాంటి ఎపిసోడ్‌లు.. ఓ ప్రాణాన్ని నిలబెడతాయ్. సోషల్ మీడియాకు ఉన్న పవరేంటో, దానిని సరిగ్గా వాడగలిగితే.. ఎలాంటి అద్భుతాలు సృష్టించగలమో తెలియజేస్తాయ్. చిన్నారి పునర్విక కోలుకోవాలని, అరుదైన వ్యాధి బారి నుంచి బయటపడాలని సాగిన ఈ సోషల్ మీడియా జర్నీ.. భవిష్యత్తులో మరెన్నో ప్రాణాలను కాపాడేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

Story by: Anup, Big Tv

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×