E-Paper
Advertisement

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?
Advertisement

కేటీఆర్‌ చేసిన ఓ చిన్న పొరపాటు మొత్తం యాక్షన్‌ డ్రామాను అట్టర్‌ ఫ్లాప్‌ చేసి పెట్టింది. ఆయన చేసిన తప్పేమిటో తెలుసా? విగ్గు పెట్టుకోవడం. అదేందీ కేటీఆర్‌ విగ్గు పెట్టుకోడు కదా…? ఆ బట్టతల నున్నగా కనిపిస్తూనే ఉందిగా… అని అంటారా? నేనన్నది కేటీఆర్‌ విగ్గు కాదు.. మరి..? ఆ తాతా మధు విగ్గు గురించి.

ఆ విగ్గుకు, అసెంబ్లీ హంగామా డ్రామా ఫెయిల్‌కు ఏమన్నా సంబంధం ఉందా? అంటే అన్నారంటారు గానీ, మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్టు ఈ ప్రేలాపనలేలా? వార్తలేమీ దొరకలేదా? అబ్బ అంత ఫ్రష్ట్రేషన్‌ ఎందుకు కేటీఆర్‌ లెక్క. జర్ర ఓపిక పడితే నేనే విపులంగా వివరిస్తాగా.

Advertisement

బ్లాక్‌ టీషర్టులు ఓకే. దానిపై రాతలు డబుల్ ఓకే. పోలీసులు అడ్డుకుంటే ఎడాపెడా బాదేయాలని డిసైడ్‌ అవ్వడం పక్కా ప్లానే. అంగీ తీసేసి బనీను ప్రదర్శనకూ రిహార్సల్‌ డబుల్ డబుల్ ఓకే.. కానీ.. ఒక్కటే మిస్‌. అదీ తాతా మధుకున్నది విగ్గు అని కేటీఆర్‌ గుర్తించకపోవడమే.

ఇతంటి తోపులాట జరుగుతుందని తెలుసు. పిడిగుద్దుల ఫైటింగు ఉంటుందనీ తెలుసు. మరి ఇంతటి బాహాబాహీ యుద్దంలో ఆ విగ్గు ఉంటుందా? ఊడుతుందా? అనే ఆలోచన చేయలేకపోయారు. వాళ్లకు తెలియకపోవచ్చు గానీ, మరి రోజూ దాన్ని తీసి పెట్టుకునే తాతాకైనా కొంచెమైనా సోయి ఉండాల్నా? చెప్పలేకపోయాడో.. చెబితే నామోషీ అనుకున్నాడో గానీ.. అట్లనే విగ్గుమీద పోలీసుల మీద బాహాబాహాకి దిగాడు.

Advertisement

ఆ విగ్గు మీద ఎవరిదో చేతి పడినట్టుంది. ఎంత గమ్ము పెట్టుకుని గట్టిగా అతికించుకున్నా.. గట్టిగా పీకుడు పీకితే అది మొత్తం కోడి బూరు లెక్క ఊడి రాదా? అదే అనుకున్నాడు మధు.. ప్రమాదాన్ని పసిగట్టాడు. యుద్దంతో శత్రు శిబిరం నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేసినట్టుగా తన విగ్గును కాపాడుకునే క్రమంలో విశ్వప్రయత్నాలు చేసి ఉంటాడు తాతా.

కానీ అది సాధ్యం కాలేదు. చేతులు పడుతున్నాయి. విగ్గును పట్టుకుంటున్నాయి. ఏ క్షణానైనా అది ఊడి రావొచ్చు. ఉన్న ఇజ్జత్‌ పోవచ్చు. బోడి గుండు బయటపడొచ్చు. బట్టతల ప్రపంచానికి కనిపించవచ్చు.. ఇంతకన్నా అవమానం మరొకటి ఉంటుందా?

ఇప్పటి దాకా .. అంటే బీఆరెస్‌లో చేరిన నాటి నుంచి మెయింటేన్‌ చేస్తూ వస్తున్న విగ్గు రహస్యం.. ఇలా అసెంబ్లీ సాక్షిగా రోడ్డున పడనుందా? ఈ తలంపే అతన్ని నిలకడగా  ఉండనీయలేదు. సర్రున బీపీ పెరిగింది. ఈ హడావుడిలో పొద్దున బీపీ గోళీ కూడా వేసుకున్నట్టు లేడు. ఈ ఉపద్రవాన్ని ఆపేదెలా? అని క్షణకాలం ఆలోచించి వెంటనే.. దీనికి కారకులెవరూ అని ప్రశ్నించుకుని ఆ వెనువెంటనే అచేతనంగా స్పీకర్‌ను తిట్టేందుకు రెడీ అయిపోయాడు.

తనకు తెలియకుండానే ఓ చేతి తో విగ్గును గట్టిగా పట్టుకుని మరో చేతితో పోలీసులను తోస్తూ.. నోటితో లోపలున్న బూతులన్నింటినీ  దారాళంగా వదల సాగాడు. ఆ తరువాత పరిణామాలు ఏమన్నా జరగని కానీ, విగ్గైతే ఊడలేదు. అబ్బ కేటీఆర్‌. సీఎం కుర్చీపైన కుర్చుంటే ఎలా ఫీలవుతాడో.. అంతకన్నా ఎక్కువ ఆనందం పొందాడు తాతా మధు ఆ  సమయానికి.

ఇప్పట్నుంచి ఇలాంటి తోపులాట కుస్తీ డ్రామాలకు అస్సలే రావొద్దురా బై అని గట్టిగా తీర్మానించుకునేలోపు.. అసెంబ్లీలో ఇతగాన్ని గెంటేసేందుకు అంతా కలిసి తీర్మానం చేసేశారట. ఇదీ తాతా గారి విగ్గు కథ.

Tags

Related News

అసెంబ్లీ వద్ద రచ్చకెక్కిన 22ఏ భూ దందా వివాదం..!

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

కేసీఆర్ డైరెక్షన్‌లోనే స్పీకర్‌పై బూతుల పర్వం.. అసలు మ్యాటర్ అదేనా..?

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

గ్రాండ్ సక్సెస్ సాధించిన టీపీసీసీ చీఫ్.. మహేష్ కుమార్ గౌడ్ ప్రయాణంలో నిలిచిన టాప్ ప్రోగ్రామ్స్ ఇవే!

Big Stories

Advertisement
×