E-Paper
Advertisement

బూతులు, బట్టలు విప్పడాలు.. ఇదేం దారుణం..కూనంనేని ఫైర్

బూతులు, బట్టలు విప్పడాలు..  ఇదేం దారుణం..కూనంనేని ఫైర్
Advertisement

Kunamneni Sambasiva Rao on BRS:ఏ ముహూర్తాన తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ పై నోరు జారారో కాని ఆ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి బీ ఆర్ యస్ మెడకే చుట్టుకున్నట్టే కనిపిస్తుంది.ఇక ఇప్పటికే ఎర్రవల్లికి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు అలాగే మిగతా mla లని శాంతి భద్రతల దృష్ట్యా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన సంగతి తెల్సిందే.

ఇదిలా ఉండగా తాజాగా నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై సీపీఐ mla ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన సంఘటన తనని ఎంతో బాధించిందని,ముఖ్యంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కన్నీళ్లు పెట్టుకోవడం అత్యంత బాధాకరమని వాపోయారు.

Advertisement

అమ్మని తిట్టే హక్కు ఎవరు ఇచ్చారు 

అసెంబ్లీ ఉన్నది ప్రజల సమస్యలని తీర్చడానికి ఉన్న ఒక పవిత్ర దేవాలయం అని, అంతే కాని ఒకరిపై ఒకరు తిట్టుకోవడానికి కాదని మండిపడ్డారు.అసెంబ్లీలో మాట్లాడే ప్రజాప్రతినిధులు సభలో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు.అయినా అసెంబ్లీలో అమ్మని తిట్టే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.అయినా ఎవరైనా బూతులు మాట్లాడితే ప్రజల్లో చరిష్మా పెరుగుతుంది అనుకుంటే అది తప్పే అవుతుందని తెలిపారు.

Advertisement

చొక్కా విప్పడం మంచి పద్దతి కాదు 

ఇంట్లో ఉండే వారికి రాజకీయాలు తెలియవని అనుకోవద్దని ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో వారికి సులభంగా అర్థమవుతుందని చెప్పారు.ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరుపై కూడా కూనంనేని మండిపడ్డారు.సీనియర్ శాసన సభ్యుడు అయిన హరీశ్ రావు వంటి సీనియర్ నేతలు చొక్కా విప్పడం మంచి పద్దతి కాదని,ఎవరు ఇలా చేసినా అది సభ యెక్క గౌరవాన్ని తగ్గించడమే అని చెప్పుకొచ్చారు.ఇక పొడవు, పొట్టి అంటూ వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం ఈ మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

శాసనసభ అంటే ప్రజల విశ్వాసానికి ఒక గుర్తు

అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఉద్యోగాలు వంటి ఎన్నో అంశాలు మాట్లాడవలసిన ఈ అసెంబ్లీ ఇలా వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడానికి వేదికలుగా మారడం దురదృష్టకరమని ఆవేధన వ్యక్తం చేశారు కూనంనేని . ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే సభలో ఒకరినొకరు తిట్టుకోవడం ఏమాత్రం మంచి సంప్రదాయం కాదని శాసనసభ అంటే ప్రజల విశ్వాసానికి ఒక గుర్తు అని దాని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉందన్నారు.

క్షమాపణ చెప్పి ఉంటే బాగుండు 

బీఆర్ఎస్ నేత తాతా మధు మాట్లాడిన భాషపైనా కూనంనేని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అసభ్యంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. మాట్లాడిన తర్వాత ‘మీరు భావిస్తే’ అంటూ సమర్థించుకోవడం సరికాదని తెలిపారు. తప్పు జరిగిందని భావిస్తే వెంటనే క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ప్రజాప్రతినిధులు తమ మాటలకు బాధ్యత వహించాలని సూచించారు.

Tags

Related News

ప్రజలే మీ బట్టలు విప్పేశారు.. ఇంకా ఎందుకు ఈ డ్రామా?

“చిల్లర నా కొ..” అంటూ రెచ్చిపోయిన KTR.. పోలీసులతో రచ్చ!

అదో దెబ్బ, దానికో పరామర్శ.. టీవీలు చూస్తూ నవ్వుకుంటున్నారు.. బండి సెటైర్లు!

తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో విషాదం.. సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ పీఏ రాజు మృతి!

ఎర్రవల్లికి బయల్దేరిన కేటీఆర్, హరీశ్‌రావు.. మధ్యలోనే అరెస్ట్

మీడియా ముందు భావోద్వేగానికి గురైన స్పీకర్.. హరీష్ రావుపై ఫైర్!

ఎర్రవెల్లి వైపు కాంగ్రెస్ శ్రేణులు.. కేసీఆర్ ఇంటి దగ్గర హైటెన్షన్

Big Stories

Advertisement
×