E-Paper
Advertisement

Jagtial Politics: జగిత్యాలలో జగడం.. సంజీవ్ కుమార్ Vs జీవన్‌రెడ్డి

Jagtial Politics: జగిత్యాలలో జగడం.. సంజీవ్ కుమార్ Vs జీవన్‌రెడ్డి
Advertisement

Jagtial Politics: అవకాశం దొరికితే చాలు తన అక్కసు వెళ్ళగక్కుతూనే అల్లుకుపోవాలని ఆశగా ఎదురుచూస్తుంటారు ఆ పెద్దాయన.. తన పనేదో తాను చేసుకుంటున్న ప్రత్యర్ధిని కవ్వించడానికి జగిత్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు… రాజకీయాల్లో తలపండిపోయిన సదరు లీడర్ సాబ్ అటు ప్రత్యర్ధి ఎమ్మెల్యే సజయ్‌కుమార్… ఇటు సొంత పార్టీని ఇరుకున పెడుతూ అ జిల్లాలో పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నారు… ఇంతకీ ఆ మోస్ట్ సీనియర్ లీడర్ పాచికలు పనిచేస్తున్నాయా..? లేదంటే బూమరాంగ్ అవుతున్నాయా?

ఇంటిపోరుతో సతమతమవుతున్న జగిత్యాల కాంగ్రెస్

ఇంటి పోరు ఇంతింత కాదయా అన్నట్టుగా మారిందట జగిత్యాల నియోజకవర్గం లో అధికార పార్టీ పరిస్థితి.. జగిత్యాల నియోజకవర్గంలో సొంత పార్టీని పదే పదే ఇరుకున పెడుతున్నారు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కమ్ మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి… అక్కడ వరుసగా జీవన్‌రెడ్డిని రెండుసార్లు గులాబీపార్టీ నుంచి ఓడించిన సంజయ్‌కుమార్ ఇప్పుడు హస్తం పార్టీతో కలిసి నడుస్తుండడంతో పెద్దాయన రగిలిపోతున్నారంట … దాదాపు పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో సీనియర్ గా తనకు ప్రాధాన్యత లభిస్తుందని ఆశించిన ఆయనకు నిరాశే మిగలడంతో అవకాశం వచ్చిన ప్రతిసారి అగ్గిమీద గుగ్గిలంలా మారుతున్నారు..

సీఎం రేవంత్‌రెడ్డికి దగ్గరైన ఎమ్మెల్యే సంజీవ్

Advertisement

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సీఎం రేవంత్‌కి దగ్గరవడం నుంచి స్టార్టయిన ఈ జగడం, రోజుకో అంశం చుట్టూ తిరుగునే ఉంది… నిత్యం ఏదో ఒక హాట్ టాపిక్‌ తీసుకుని, అటు ప్రభుత్వాన్ని ఇటు సంజయ్‌ని టార్గెట్ చేసేలా మాట్లాతున్నారట మాజీ మంత్రి జీవన్‌ …. తొలుత సానుభూతి అస్త్రం సరిగ్గా వర్కౌట్ కాకపోవడంతో… పార్టీని వీడుతానంటూ పదే పదే అలక పాన్పు ఎక్కి హడావుడి చేశారు .. మొదట్లో సీనియర్ అని కాస్త ప్రయారిటీ ఇస్తూ జగిత్యాలకు వచ్చి మరీ మంత్రులు బుజ్జగించే ప్రయత్నాలు చేయడంతో పెద్దాయన మరింత స్పీడ్ పెంచారు.

పదేపదే అలకపాన్పు ఎక్కుతూ హడావుడి చేసిన జీవన్

ఆ నేపథ్యంలోనే ఎంపీ గా పోటీ చేయడం, ఓడిపోవడం…. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిపోవడం… తిరిగి రెన్యూవల్ కాకపోవడం… పార్టీ పవర్‌లో ఉండటంతో క్యాబినెట్‌లో ఉండాలనే కోరిక అలాగే ఉండిపోవడంతో ఆయన ప్రస్టేషన్ పీక్స్‌కి వెళ్లిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్‌లో…. పదే పదే అదే పనిగా అలుగుతుండటంతో ఆయన్ని పార్టీ పెద్దలు.. ప్రభుత్వ ముఖ్యలు పట్టించుకోవడం మానేసారట… అయినా తన పట్టు నిరూపించుకునేందుకు ఏదో ఒక వివాదస్పద అంశంతో తెరపైకి రావడం మాత్రం ఆపడం లేదట పెద్దాయన…

మీదే రాజ్యం మీరే ఏలుకోండి.. జీవన్

Advertisement

పార్టీలో పెద్దలతో… మంత్రులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా హాట్ టాపిక్‌గా మారిందట… జగిత్యాల పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి విష్ చేయడానికి జీవన్‌రెడ్డి వద్దకు వెళితే దూరం జరిగి మీదే రాజ్యం మీరే ఏలుకోండి అంటూ వ్యాఖ్యానించడంతో పొంగులేటి షాక్ అయ్యారట… మంత్రితో ఆయన అన్న మాటలు అప్పట్లో హాట్ హాట్‌గా వైరల్ అయ్యాయి… ఆ తర్వాత మంత్రి అడ్లూరి వద్దకు వెళ్లి.. చిన్న దేవస్థానం పాలక వర్గం విషయంలో పేచీ పెట్టడం… మమ్మల్ని పార్టీలోంచి వెళ్లగొట్టండి అంటూ వ్యాఖ్యానించడం… కాంగ్రెస్‌ పట్టాదారులం మేము అంటూ వార్నింగ్ ఇవ్వడం కాంగ్రెస్‌లో ఒకింత కలకలం రేపింది.

జీవన్‌రెడ్డిపై పెరిగిన రాజకీయ దుమారం

పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా ఉన్న జీవన్‌రెడ్డిక్యాడర్ ముందు పట్టాదారులు, కౌలు దారులు అంటూ మాట్లాడటంతో హస్తం పార్టీకి ఇబ్బందికరంగానే మారిందట. కౌలుదారులు, పట్టాదారులు, ఓనర్లు అనే వ్యాఖ్యలకు ప్రత్యర్ధి శిబిరం నుంచి గట్టిగానే కౌంటర్లు పడ్డాయట. జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో పుట్టారా…? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదెండ్లతో వెళ్లి కాంగ్రెస్‌లోకి వచ్చారు.. అయన పట్టాదారు ఎలా అవుతారు…? ఎదుటివారు కౌలుదారులు ఎలా అవుతారు అంటూ చరిత్ర పాఠాలతో ట్రోల్ చేస్తున్నారు ఆయన వ్యతిరేకులు.

జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్ వర్గం

అవకాశం వచ్చిన ప్రతిసారి అధిష్టానం, ప్రత్యర్థిపై విరుచుకు పడుతున్న పెద్దాయన ఇటివల జరిగిన సర్పంచు ఎన్నికలలో తన అనుచరులని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేసారు. అక్కడ ప్రతిపక్షాలు వీక్ అవ్వడం‌తో పోటీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వర్గీయుల మధ్యే జరిగింది. గెలిచిన అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడం విశేషం.. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలకి రేపో‌మాపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో మళ్ళి తన వాయిస్ లో బేస్ పెంచారు జీవన్‌రెడ్డి.

సంజయ్‌ని ఉద్దేశించి జీవన్‌రెడ్డి ఘాటైనా‌ వ్యాఖ్యలు

గత పదేళ్లు అధికారంలో లేకపోయునా కూడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికే టికెట్‌లని పార్టీ పెద్దలు ప్రకటించారు. అయితే కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారు… కాంగ్రెస్ పార్టీ వ్యవహారం లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని, ఎప్పుడూ కాంగ్రెస్ జెండా మోయనివారు టికెట్లు వస్తే ఊరుకోబోమని వంద తలలు ఉన్న రావణసురుడే ఒక్కతల ఉన్నా రాముడు చేతిలో బలి అయ్యాడని ఒక్క తల ఉన్న నువ్వేంతనని పరోక్షంగా సంజయ్‌ని ఉద్దేశించి జీవన్‌రెడ్డి ఘాటైనా‌ వ్యాఖ్యలు చేసాడు… ఆ క్రమంలో మరోసారి మాటల యుద్ధం మొదలుపెట్టడంతో రానున్న మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో టికెట్ ల వ్యవహారాలు అధిష్టానానికి కొత్త తలనొప్పే అంటున్నారు.

అధిష్టానంతో మంచిగా ఉంటూ అభివృద్ధి జపం

కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్న సంజయ్ మాత్రం పెద్దాయన‌ మాటలని కనీసం పట్టించుకోకుండా అధిష్టానంతో మంచిగా ఉంటూ అభివృద్ధి జపం చేస్తున్నారు…ః జీవన్ రెడ్డి మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారి విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు … మరి రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో జీవన్‌రెడ్డి వ్యవహారం టికెట్ల‌ కెటాయింపులో అధిష్టానానికి‌ ఇంకెన్ని తలనొప్పులు తీసుకువస్తుందో చూడాలి.

Story By: Ajay , Big Tv 

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×