jaya Bachchan: గతంలో ఐదు రోజుల పెళ్లి ఉండేది.. అది రాను రాను రెండు రోజుల తంతు మారింది. ఇప్పుడు ఒకే రోజులో అన్ని చేసేస్తున్నారు. కానీ ఇకపై పెళ్లి అనే కాన్సేప్టే ఉండదా? ఐదు రోజుల పెళ్లి ఓల్డ్ స్టైల్ అయితే.. అసలు పెళ్లేందుకనేది కొత్త స్టైల్‌గా మారబోతుందా? ఇప్పటి జనరేషన్ వారికి పెళ్లి ఔట్ డేటెడ్ అయిపోయిందా..? కొందరు కోట్లు కుమ్మరించి పెళ్లి చేసుకుంటుంటే ఎందుకీ ప్రశ్నలు అంటారా? ఉంది… దానికో రీజన్ ఉంది. కోట్లు కుమ్మరించే సత్తా ఉన్నవారే ఇప్పుడీ డౌట్‌ను రెయిజ్ చేశారు. మరి నిజంగానే లెటెస్ట్ జనరేషన్ నో స్ట్రింగ్స్ అటాచ్‌డ్ అంటోందా?
పెళ్లి అనేది ఒక బలమైన సాంస్కృతిక బంధం
జయ బచ్చన్ ఓ సీనియర్ యాక్టర్ మాత్రమే కాదు.. ఓ ఎంపీ కూడా. మరి ఆమె వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి? నిజానికి యువతరంలో పెళ్లి పట్ల మారుతున్న వైఖరికి ఈ వ్యాఖ్యలు ఓ పెద్ద ఎగ్జాంపుల్ అనే చర్చ ఉంది. ఇండియాలో ఇప్పటికీ పెళ్లి అనేది ఒక బలమైన సాంస్కృతిక బంధం. ఇది ఎవరు కాదనలేని నిజం. వ్యక్తిగత స్వేచ్ఛ, రిలేషన్ షిప్స్‌లో కొత్త అప్‌డేట్స్ కారణంగా.. ఇప్పుడీ పెళ్లి అనే దానిపై కొత్త అనుమానాలు, చర్చ అయితే మొదలైందన్నది కూడా అంతే వాస్తవం.
జయ అమితాబ్ బచ్చన్ అని పిలవడ పై ఆగ్రహం..
నిజానికి జయ బచ్చన్ ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో రాజ్యసభలో జయ అమితాబ్ బచ్చన్ అని పిలివడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను భర్త పేరుతో మాత్రమే గుర్తిస్తారా? వారికి సొంత ఉనికి లేదా? సొంతంగా విజయాలు సాధించట్లేదా? అని అసహనం వ్యక్తం చేశారు. జయా బచ్చన్ వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్.. తన వద్ద పూర్తి పేరు రాసి ఉన్నందునే తాను జయా అమితాబ్ బచ్చన్ అని పిలవాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చుకున్నారు. సో.. ఇండిపెండెంట్‌గా ఉండాలనే ఆలోచనలు ఆమెకు చాలా మొదటి నుంచి ఉన్నాయనే చెప్పాలి. అదే సమయంలో బిగ్‌బీతో ఉన్న అన్యోన్యతను కూడా ఆమె ఎక్కడా దాచుకోలేదు. బిగ్‌బీపై వచ్చిన రూమర్స్‌ను తాను పట్టించుకోలేదని.. తమ మధ్య ఉన్న బంధం కారణంగానే చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేశామని చెప్పుకొచ్చారు ఆమె.
పెళ్లి తంతు కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు..
సో.. ఆమెకు పెళ్లిపై పెద్ద నెగటివ్ ఇంప్రెషన్ అయితే ఏం లేదు. కానీ అప్‌కమింట్ జనరేషన్ ఆలోచనలు, విధానాలను చూసే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. కానీ ప్రస్తుతం ఇండియాలో గ్రాండ్ వెడ్డింగ్స్ పెరుగుతున్నాయి. పెళ్లి తంతు కోసం కొందరు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఆడంభరంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ సంస్కృతి ఎలాగైతే పెరుగుతుందో.. మరోవైపు పెళ్లిళ్లు తగ్గిపోవడం కూడా స్పీడ్‌లో జరుగుతున్నాయి.
నిజంగానే యువత పెళ్లిళ్లు చేసుకోవడం లేదా?
మరి నిజంగానే యువత పెళ్లిళ్లు చేసుకోడం లేదా? అంటే ఔననే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, బంధాల చట్రంలో ఇరుక్కోవడానికి ఇష్టపడకపోవడం అనేక కారణాల్లో ఒకటి మాత్రమే. చాలా మంది ఫైనాన్షియల్‌గా సెట్ అయ్యాకే పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ముందు.. ఉద్యోగం రావాలి.. ఆ తర్వాత మంచి ప్యాకేజ్‌లు కావాలి.. లైఫ్‌లో సెటిల్ అవ్వాలి.. ఇదంతా జరిగే సరికి ముప్ఫైలు, నలభైలు దాటుతున్నారు. సో.. పెళ్లి లేట్ అవుతుంది.. అప్పుడు కావాలనుకున్న అవ్వడం లేదు. ఇది కూడా అనేక కారణాలల్లో ఒకటి.
ప్రస్తుతం ఉన్న జనరేషన్ చాలా అడ్వాన్స్‌డ్
జయ బచ్చన్ చెప్పినట్టు ప్రస్తుతం ఉన్న జనరేషన్ చాలా అడ్వాన్స్‌డ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. బంధాలు, బాంధవ్యాలలో ఇరుక్కోవడం కంటే.. స్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. తమ వ్యక్తిగత స్వేచ్ఛ తర్వాతే ఏదైనా అనేలా ఉంటుంది ఆలోచన. పెళ్లి అనే బంధంలో ఇరుక్కుంటే అది తమ జీవనశైలిని, కెరీర్ నిర్ణయాలను ప్రభావితం చేస్తుందనే భయం క్లియర్‌కట్‌గా కనిపిస్తోంది. కానీ యువత.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లివైపు అడుగులు వేయకపోవడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
పెళ్లి అంటే యువతకు ఎందుకు ఇంట్రెస్ట్ పోతుంది? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులేంటి? సమాజంలో వస్తున్న మార్పులకు భయపడుతున్నారా? లేక బాధ్యతలు అనే చట్రంలో ఇరుక్కునేందుకు ఇష్టపడటం లేదా? అసలేంటి నవతరం ఎదుర్కొంటున్న సమస్యలు.
తమ తల్లులు, ఇతరులు చేసిన త్యాగాలు చేస్తున్న మహిళలు
యువత పెళ్లివైపు ఆలోచనలు తగ్గిపోవడానికి.. అసలు చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు అయితే.. పెళ్లిపై ఉండే ఆలోచనే కాస్త కొత్తగా ఉందనే చర్చ చాలా రోజులుగా ఉంది. ఇంట్లో ఉన్న తమ తల్లులు, ఇతరులు చేసిన త్యాగాలను చూస్తున్నారు. అంతో ఇంతో అడ్జెస్ట్ అవ్వడం వారికి కనిపిస్తోంది. సో.. మేము కూడా పెళ్లిళ్లు చేసుకుంటే త్యాగాలు చేయడం తప్పదేమో.. ఇప్పటి వరకు ఉన్న ఇండిపెండెన్స్‌ను కోల్పోవాల్సి వస్తుందేమో అనే ఆలోచనల చాలా మంది మహిళల్లో ఉంది. తమ తల్లులు లేదా ఇతర గృహిణులు ఎదుర్కొన్నట్లుగా త్యాగాలు చేయాల్సి వస్తుందేమో లేదా తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు.
బాగా చదువుకొన ఉద్యోగాల్లో రాణిస్తున్న మహిళలు
దీనికి తోడు గతంలో లాగా కాకుండా ఇప్పుడు అమ్మాయిలు బాగా చదువుతున్నారు. ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. వారికి ఆర్థికంగా ఇప్పుడు స్వేచ్ఛ కూడా పెరిగింది. నిజం చెప్పాలంటే చాలా మంది మగవాళ్ల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. దీంతో ఇప్పుడు పెళ్లి, పిల్లలు అనే బంధంలో ఇరుక్కొని కెరీర్‌ను నాశనం చేసుకోవడం ఎందుకు అనే ఆలోచన మొదలైంది చాలా మందిలో.
రోజురోజుకు పెరుగుతున్న విడాకులతో భయం
ఇక ఇప్పటికీ గృహ హింస కేసులు నమోదవ్వడం.. రోజురోజుకు పెరుగుతున్న విడాకులు కూడా పెళ్లి అంటేనే భయం పెరిగేలా చేస్తోంది. కొందరు మహిళలు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం, గొడవలు పడటం చూసి.. మొత్తం పెళ్లిపైనే ఇంట్రెస్ట్ పోగొట్టుకునే వారు ఉన్నారు. ఇక పెళ్లైన కొన్నాళ్లకే భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు రావడం.. అయితే విడాకులు తీసుకోవడం.. లేదుగా వేరుగా జీవించడం జరుగుతోంది. ఈ పరిస్థితులను అబ్జర్వ్ చేస్తోంది యువత.
లివ్ ఇన్ రిలేషన్ షిప్స్‌కు మొగ్గు చూపుతున్న యువత
ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్. పెళ్లికి బదులుగా నేటి యువత లివ్-ఇన్ రిలేషన్షిప్స్ వైపు ఇంట్రెస్ట్ చూపుతోంది. ఈ రిలేషన్‌షిప్స్ వల్ల బంధాన్ని, భాగస్వామిని అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని.. అదే సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛ కూడా లభిస్తోందనే ఆలోచన ఉంది వారిలో. అదే సమయంలో లాంగ్ టైమ్ రిలేషన్‌షిప్‌కు కూడా భయపడుతున్నారు. క్యాజువల్ డేటింగ్‌వైపే చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఉన్న టైమ్‌లో చిల్ అవ్వాలి.. ఎక్కువ జంజాటాలు పెట్టుకోవద్దనే మైండ్‌సెట్ రోజురోజుకు పెరుగుతోంది.
Also Read: పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిమిషానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
తమ టేస్ట్, కెరీర్, థాట్స్‌కు సూటయ్యే పాట్నర్ దొరికే అవకాశం తక్కువగా ఉందనే ఆలోచనలో అటు అమ్మాయిల్లో.. ఇటు అబ్బాయిల్లో పెరుగుతోంది. అంతేకాదు తమ పార్ట్‌నర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉంటున్నాయి. ఈ రెండింటిని రీచ్ అవ్వలేకపోతున్నారు అంతా. దీంతో పర్మినెంట్ లైఫ్ పార్ట్‌నర్‌ను సెలెక్ట్ చేసుకోవడం కంటే.. క్యాజువల్ డేటింగ్‌పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది యువత. దీనికి తోడు సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్స్.. గ్లోబలైజేషన్ కూడా పెళ్లిపై చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు.. జయ బచ్చన్ చెప్పిందని కాదు కానీ.. చాలా మంది ప్రస్తుతం పెళ్లి అంటే నో అనే అంటున్నారు. అయితే దేశంలో అందరూ ఇలానే ఉన్నారా అంటే కాదు. కొందరు మాత్రం ఇలానే ఆలోచిస్తున్నారనేది మాత్రం నిజం.
Story By Vamshi Krishna, Bigtv