BigTV English

KCR Secret Strategy: పార్టీ నుంచి కవిత అవుట్.? బిడ్డను అడ్డుపెట్టుకొని కేసీఆర్ కొత్త స్కెచ్..

KCR Secret Strategy: పార్టీ నుంచి కవిత అవుట్.? బిడ్డను అడ్డుపెట్టుకొని కేసీఆర్ కొత్త స్కెచ్..

KCR Secret Strategy: ఎంచుకున్న తాళమేంటి? తీస్తున్న రాగమేంటి? అన్నట్టుగా కవిత పరిస్థితి మారిపోయిందా? ఇన్నాళ్లూ కారు పార్టీలో ఉండి.. ఇవాళ హస్తం పార్టీ బీసీ ఆర్డినెన్స్ బాగుందని అనడంలో అర్ధమేంటి? నిన్న చూస్తే సింగరేణి కార్మిక సంఘం నుంచి తొలగింపు. ఇవాళ చూస్తే.. ఈ తరహా కామెంట్లు. బీఆర్ఎస్ లీడర్లు తన దారికి రావాల్సిందేనంటూ కవిత అనడంలో మీనింగేంటి? ఎంత బీసీల కోసం పోరాటమైనా.. ఇంతగా ప్రత్యర్ధి పార్టీకి జై కొడతారా ఎక్కడైనా? బీసీలకు మద్దతివ్వడానికి మీకున్న అర్హతలేంటని మల్లన్న లాంటి వాళ్లు తీవ్ర పదజాలం వాడుతున్నా సరే.. ఈ పొగడ్తల వెనక దాగిన అగడ్తలు ఎలాంటివి? కవిత అసలు ఉద్దేశమేంటి? ఆమెనెలా అర్ధం చేసుకోవాలి?


ఈమె పింక్ బుక్ రాస్తామన్న కవితేనా?

ఇదీ కవిత ఒక మీడియా చిట్ చాట్ లో చేసిన కామెంట్ల సారం. అసలు పార్టీలంటే.. ఉప్పు- నిప్పు. ఉత్తర- దక్షిణాలు, ఎడ మొహం- పెడమొహం, ఎడ్డమంటే- తెడ్డం. ఇలా భిన్నంగా ఉంటాయి. ఎవరైనా రాజకీయాల్లో ఉంటే.. ప్రత్యర్ధి పార్టీల విషయంలో.. అదెంత గొప్ప పథకమైనా, విధానమైనా తమదైన విమర్శ జోడించడం సహజంగా చూస్తూనే ఉంటాం. ఇప్పటి వరకూ జరిగిందదే. ఇకపై జరగబోయేది కూడా అదే. ఇదే కేటీఆర్ ని తీసుకుంటే.. బీసీ విధానం పట్ల ఖచ్చితంగా భిన్న వైఖరి కనబరుస్తారు. కేసీఆర్ కూడా అలాగే స్పందించే అవకాశముంది. హరీష్ రావు సంగతి సరే సరే. ఇక్కడే కాదు స్టేటైనా, సెంట్రల్ అయినా.. ఎక్కడైనా సరే, ఇదే పొలిటికల్ పాలసీ నడుస్తుంది. కానీ కవిత చూస్తుంటే ఇందుకు రివర్స్ లో వస్తున్నారు. ఈమె పింక్ బుక్ రాస్తామన్న కవితేనా? అంటూ ఒక్కొక్కరూ అవాక్కవుతున్నారు.


కేసీఆర్ దేవుడు, చుట్టూ దెయ్యాలంటూ కామెంట్లు

కవిత అమెరికాకు వెళ్లివచ్చినప్పటి నుంచీ మొత్తం స్టోరీ మారిపోయినట్టు కనిపిస్తోంది. తండ్రికి తాను రాసిన లేఖ బయట పడ్డప్పటి నుంచీ టోటల్ అట్మాస్ఫియర్ లో తేడా కొట్టినట్టు తెలుస్తోంది. కేసీఆర్ దేవుడేగానీ ఆయన చుట్టూ దెయ్యాలు మూగి ఉన్నాయంటూ కామెంట్లు చేయడం.. తర్వాత కాలంలో తన తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేయడం వరకూ సాగింది వ్యవహారం. ఆ తర్వాత కూడా ఆమె బీఆర్ఎస్ ప్రో వాయిస్ వినిపించినట్టే కనిపించారు. ఒక సమయంలో కేసీఆర్ ని టచ్ చేస్తే.. ఖబడ్దార్ అంటూ చేసిన హెచ్చరికలు కూడా అందరూ వినే ఉంటారు. కేసీఆర్ ని టచ్ చేయడం అంటే తెలంగాణ జాతి మొత్తాన్ని టచ్ చేయడంతో సమానమంటూ చేసిన కామెంట్ల వరకూ కూడా.. ఆమె ఉండాల్సిన రిథం లోనే ఉన్నట్టు కనిపించారు. ఎప్పుడైతే.. బీసీల వ్యవహారం తెరపైకి వచ్చిందో.. వెంటనే ఆమె తన స్టాండ్ మార్చినట్టు చెబుతారు. అప్పటి వరకూ బీఆర్ఎస్ టోన్ లోనే మాట్లాడిన కవిత.. బీసీల విషయంలో మాత్రం కాంగ్రెస్ కి జై అంటున్నారు.

మల్లన్నపై వైల్డ్‌గా రియాక్టయిన జాగృతి టీం

కవిత బాధేంటో అర్ధం చేసుకోవల్సి వస్తే.. అది బీసీ యాంగిల్ గా చెప్పాలి. బీసీల పోరాటం.. మల్లన్నలాంటి వాళ్లెవరో క్రెడిట్ తన్నుకు పోకుండా.. ముందుకెళ్లడం ఒక రాజకీయ వ్యూహమే కాదనడం లేదు. కానీ, ఇక్కడ కూడా ఆమె రెండు డైమన్షన్లను తీసుకున్నట్టు కనిపించింది. అందులో మొదటిది.. బీసీలకూ మీకూ సంబంధమేంటని మల్లన్న అంటే అందుకు ఆమె జాగృతి టీం వైల్డ్ గా రియాక్ట్ కావడం.బేసిగ్గా మల్లన్న బీసీ. బీసీలకు సపోర్ట్ చేస్తానంటూ…. ఒక బీసీపై ఈ దాడి చేయడంతో పాటు ఎవరండీ ఈయన అంటూ తీసికట్టినట్టు మాట్లాడ్డమేంటన్న విమర్శలు వినిపించాయి. ఇక్కడ ఆమె రాజకీయ వ్యవహారశైలి లెర్నర్ స్టైల్ తలపించిందని అంటారు. బిగినర్స్ మిస్టేక్ లా కనిపించిందనీ చెబుతారు.

కాంగ్రెస్ బీసీ ఆర్డినెన్స్‌కి బాజాప్తుగా జై

దీన్ని కవర్ చేయడానికో లేక, మరొకటో తెలీదు కానీ తర్వాత ఆమె ఓపెనప్ అయిపోయారు. కాంగ్రెస్ బీసీ ఆర్డినెన్స్ కి బాజాప్తుగా జై కొట్టేశారు. నిజానికైతే ఏ పొలిటికల్ లీడర్ కూడా ఇలా కామెంట్ చేయరు. వారికంటూ ప్రతి అంశంలో కొన్ని విమర్శనాత్మక విధానాలుంటాయి. వాటిని పరిగణలోకి తీసుకుని.. లోలోపల ఎంత నచ్చినా సరే, పైకి మాత్రం బాగాలేదనే అంటారు. ఇది మనం ప్రస్తుత రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడే కవిత ఒక చిన్న ఫీలర్ వదిలారు. బీఆర్ఎస్ లీడర్లు కూడా తన దారికి రావాలని అంటున్నారు. ఇదెక్కడైనా ఉందా? ఇలా జరిగే అవకాశముందా? కాంగ్రెస్- బీఆర్ఎస్.. రాజకీయంగా పీకలోతు పోరాటం చేసుకుంటున్నాయ్. ఇరు పక్షాలు కలసి అసెంబ్లీ లోపటా- బయట చేస్తున్న టగ్ ఆఫ్ వార్.. ఏ రేంజ్ లో జరుగుతోందో మొన్న ప్రెస్ క్లబ్ వ్యవహారంలో చూసే ఉంటాం. ఇందుకు రేవంత్ సైతం ఎలా రియాక్టయ్యారో గమనించే ఉంటాం.

కాంగ్రెస్ అంటేనే భగ్గుమనే పరిస్థితిలో బీఆర్ఎస్

కాంగ్రెస్ సర్కార్ వచ్చాక కాళేశ్వరం కతలు ఒక్కొక్కటిగా బయట పడ్డం. ఫోన్ ట్యాపింగ్ బాగోతాలు వరుస వెంబడి వెలికి రావడం. ఆపై కేటీఆర్ మెడకు ఈ ఫార్ములా కేసు చుట్టుకోవడం. వీటన్నిటి కారణంగా.. కాంగ్రెస్ అంటేనే భగ్గుమనే పరిస్థితిలో ఉంది ప్రస్తుత బీఆర్ఎస్. ఇదే టెలిఫోన్ టాపింగ్ కేసులో మీడియా చానెళ్లు పెట్టే థంబ్ నైల్స్ కే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భగ్గుమంటున్నాయ్. కాంగ్రెస్ అంటేనే అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.. సమస్త బీఆర్ఎస్ పరివారం. అలాంటిది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్ బాగుందని బీఆర్ఎస్ ఎప్పుడనాలని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

చెల్లి జైలుకెళ్లినపుడు వెనకేసుకొచ్చిన అన్న కేటీఆర్

కవితపై మల్లన్న చేసిన కామెంట్లపై కేటీఆర్ స్పందించక పోవడం మరో ముచ్చట. గతంలో కేటీఆర్ తన చెల్లెలు లిక్కర్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్తే ఆ ఎపిసోడ్లన్నిటినీ చూసే ఉంటారు. తన చెల్లెలికి సపోర్టుగా ఆ నాడు కేటీఆర్ తెరపైకి తెచ్చిన వాదన విన్న వారెవరైనా సరే.. కరెక్టే కదా? అనిపించక మానదు. కేటీఆర్ మాత్రమే కాదు కేసీఆర్ సైతం బిడ్డ జైలుకు వెళ్లిన విషయంలో తీవ్రంగా కలత చెందినట్టు వార్తలొచ్చాయి. గతంలో కవితను నడిచే బతుకమ్మగా పొగిడిన ఈ ఎమ్మెల్సీ ఇన్నేసి మాటలంటుంటే.. కేటీఆర్ లో కనీస స్పందన లేక పోవడం ఆశ్చర్య పరుస్తోందని అంటారు. సీఎం రేవంత్ విషయంలోనే స్పందించని కేసీఆర్- ఈ మధ్యే ఎమ్మెల్సీ అయిన మల్లన్న విషయంలో రియాక్టవుతారని ఊహించలేం. కానీ ఇలాంటి విషయాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ తన చెల్లెలి విషయంలో స్విచ్డ్ ఆఫ్ కావడమేంటన్న ప్రశ్న వినిపిస్తోంది.

కల్వకుంట్ల కుటుంబంలో అసలేం జరుగుతోందన్న ప్రశ్న

ఇన్నాళ్ల పాటు అన్నయ్య కేటీఆర్ తన గారాల చెల్లెలు కవిత చేత కట్టించుకున్న రాఖీలు ఏమయ్యాయో అంతు చిక్కడం లేదని అంటారు కొందరు. కవిత ఒకపక్క ఈ ఆవేదనలో ఉంటే.. పుండు మీద కారం చల్లినట్టు.. సింగరేణి కార్మిక సంఘం నుంచి ఆమెను తప్పించి ఇతరులకు ఆ బాధ్యతను అప్పగించడం చూస్తుంటే.. కల్వకుంట్ల కుటుంబంలో అసలేం జరుగుతోంది అన్న ప్రశ్నతలెత్తుతోంది. రాజకీయాలను అటుంచితే.. వ్యక్తిగతంగా చెల్లెలిపై కనీస ప్రేమాభిమానాలు లేవా? అని నోళ్లు నొక్కుకుంటున్నారు ఒక్కొక్కరూ. ఈ ఇద్దరి మధ్య రక్త సంబంధం ఇంతేనా ? క్వశ్చిన్ మార్కులు రైజ్ అవుతున్నాయ్. అందుకే కవిత వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ.. ఇన్ డైరెక్ట్ గా తన అన్నను సైతం కవర్ చేసినట్టు భావిస్తున్నారు కొందరు విశ్లేషకులు. ఇప్పుడందరి ప్రశ్నల్లా ఏంటంటే.. ఇది ప్రీప్లాన్డ్ స్కెచ్చా? లేక అనుకోకుండా ఇలా జరుగుతోందా? అంతగా కల్వకుంట్ల ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది? అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్నట్టుండి అంతటి పొరపచ్చాలు ఎలా వచ్చాయి? ఆ వివరాలేంటి? ఇదంతా అన్నెసస్సరీ డ్రామానా? లేక మరేదైనా నెస్సిసిటీ ఆశించి ఇలా చేస్తున్నారా? ఏపీలో బ్రదర్ అండ్ సిస్టర్ ఇష్యూకీ ఈ అన్నాచెల్లెళ్ల రాజకీయాలకూ ఉన్న పోలికేంటి?

జగన్ -షర్మిళ విషయంలోనూ ఇలాంటి గొడవలే

జగన్- షర్మిళ విషయంలోనూ సరిగ్గా ఇలాంటి గొడవలే వచ్చాయి. అయితే అదంతా తండ్రి మరణానంతరం సంభవించిన పరిణామ క్రమాలు. ఇంటికి పెద్ద దిక్కుగా తల్లి ఉన్నా కూడా.. వ్యవహారం చేతులు దాటిపోవడంతో వచ్చిన వివాదాలే వీరు వేరు కావడానికి కారణంగా భావిస్తారు. అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికే పెద్ద దిక్కుగా వ్యవహరించిన కేసీఆర్ కంటి ముందే ఇలా జరగటంతో అందరిలోనూ ఒక అనుమానం. ఒక రకంగా చెబితే కేసీఆర్ కే అవమానకరం కూడా. కుటుంబ గొడవలే తీర్చలేని సారు.. ఇక సామాన్యుల వెతలేం తీర్చుతారనే ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. అప్పట్లో జగన్- షర్మిళ ఆస్తి పంచాయితీలు కేసీఆర్ కాంపౌండ్ కి వచ్చాయని అంటారు. అలాంటి కేసీఆర్ సొంత కొడుకు- కూతురు వ్యవహారంలో ఇలా హ్యాండ్సప్ అనడమేంటన్న మాట వినిపిస్తోంది.

కేసీఆర్‌కి తెలిసే జరుగుతున్నట్టు చేప్పే కొందరు

కొందరు చెప్పేదాన్ని బట్టీ చూస్తే ఇదంతా కేసీఆర్ కి తెలిసే జరుగుతోందని అంటారు. కావాలనే ఆయన తన కొడుకు కూతురు రెండు వేర్వేరు పార్టీలుగా చీలి.. తద్వారా చెరొక సారి రాజకీయ లబ్ధి పొందాలన్న కోణంలో ఇదంతా చేస్తున్నట్టు కొందరి వాదన. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొన్ని ఈక్వేషన్లను అనుసరించి చెబితే.. హరీష్ రావుతో మొదట ఈ ప్రయోగం చేయాలని చూశారనీ. అయితే హరీష్‌ ఇందుకు సమ్మతించలేదనీ.. అందుకే ఆయనకు గత కేబినేట్లోకి ఆలస్యంగా తీస్కున్నారనీ ఒక వార్త హల్ చల్ చేసిందప్పట్లో. అల్లుడి ద్వారా సాధ్యం కానిది కూతురి ద్వారా నెరవేర్చుతున్నారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరికొందరికి వస్తున్న డౌట్ ఏంటంటే.. ఇప్పటికే బీఆర్ఎస్ పై కేసులతో ఠారెత్తిస్తున్న కాంగ్రెస్ ని చల్లబరిచేందుకు కవిత ద్వారా నరుక్కొస్తున్నారనీ.. అందుకు బీసీ యాంగిల్ ఒక రూట్ మ్యాప్ గా తీసుకుంటున్నారనీ ఇంకో టాక్. అందుకే మల్లన్న గట్టిగా రివర్స్ లో వచ్చినట్టు ఇంకో సమాచారం.

సింగరేణి కూడా ముందస్తు స్ర్కీన్-ప్లేలో భాగం?

తాజాగా జరిగిన పరిణామ క్రమాలను అనుసరించి చెబితే.. సింగరేణి కార్మిక సంఘం నుంచి తప్పించగానే కవిత పెద్దగా షాక్ కి గురైనట్టు కనిపించలేదు. సరికదా? ఇదంతా ముందే అనుకున్న స్క్రీన్- ప్లే అన్న కోణంలో ఆమె నిమ్మళంగా ఉన్నట్టు కనిపించారు. ఒక వేళ ఇదంతా అనుకోకుండా జరిగి ఉంటే.. ఆమె రియాక్షన్ వేరుగా ఉండేదని చెబుతారు. కవిత ఉన్నట్టుండి బీసీలను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పై ఆమె చూపిస్తున్న అనుకూల వైఖరి కూడా అనుమానంగానే ఉదంటారు కొందరు. ఇందులో మరేదో మతలబు దాగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఈ ధోరణి కొనసాగుతుందా? లేక మరొక టర్న్ తీసుకోనుందా? అన్నది కూడా ఒక క్లారిటీ లేదంటున్నారు. మరో చర్చనీయాంశం ఏంటంటే.. కవిత ఆమె సొంత రాజకీయాలు.. వాటి ప్రభావం పరిస్థితేంటి? గతంలో కవిత స్థానంలో వచ్చిన షర్మిళను కేసీఆర్ వదిలిన బాణం అని కూడా అభివర్ణించారు. తర్వాత కాలంలో ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో మెర్జ్ చేసి ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ గా వెళ్లిపోయారు. ఇప్పుడు కవిత ఎలాంటి రాజకీయ వ్యూహం అవలంభించనున్నారు? అన్న చర్చ నడుస్తోంది.

కవిత మార్క్ పాలిటిక్స్‌కి స్కోపు-గ్యాపు ఉందా?

కవిత నడిపే రాజకీయాలకు తెలంగాణలో అంత స్కోపు- గ్యాపు ఉందా? అన్నది కూడా మరో ముఖ్యాంశమే. ఇప్పటికే కాకలు దీరిన రాజకీయ యోధాను యోధులు కాంగ్రెస్- బీఆర్ఎస్- బీజేపీ వంటి పార్టీల్లో ఉన్నారు. వీరందరినీ దాటి కవిత తనదైన శైలిలో రాజకీయాలు చేయగలరా? ఆమె లేవనెత్తుతున్న అంశాలు ఆమె రాజకీయ ఎదుగుదలకు సోపానాలయ్యే అవకాశముందా? అన్న ప్రశ్నకూ సమాధానం తెలియాల్సి ఉంది. గతంలో టీఆర్ఎస్ లోని తెలంగాణ సెంటిమెంటు భారతీయ రాష్ట్ర సమితి అన్న పేరు మార్పు కారణంగా మాయమైందని.. ఆ సెంటిమెంటును ఎటూ చేజారకుండా.. ఆమె గతంలో ఏర్పాటు చేసిన జాగృతి ద్వారా రికవరీ చేస్తున్నారనీ అంటారు. ఒకే చూరు కింద కూర్చుని భిన్న రాజకీయాలు చేయడం సాధ్యం కాదు కాబట్టి.. ఇలా రెండుగా విడిపోవడం శ్రేయస్కరంగా భావించినట్టు చెబుతున్నారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో ఓట్ల చీలికలో తేడా తెచ్చే వ్యూహరచన సైతం దాగి ఉందని అంటారు. ఇటు తెలంగాణ అటు మహిళా యాంగిల్ తో పాటు బీసీలనూ టచ్ చేస్తూ.. ఆయా వర్గాల ఓటు బ్యాంకును కవర్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారనీ అంచనా వేస్తారు కొందరు విశ్లేషకులు.

ఇలా ఒక్క కవిత పరి పరివిధాలా రాజకీయపు ఆలోచనలకు కేంద్ర బిందువుగా మారినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ ముందే ఇదంతా జరగటం.. అది బీఆర్ఎస్ కి నష్టం, కేసీఆర్ పరువు ప్రతిష్టలకు భంగం గా భావిస్తున్న వారు లేక పోలేదు. మరి చూడాలి. ఈ అన్నా చెల్లెళ్ల రాజకీయ సవాళ్ల పర్వం.. ఏ తీరం చేరుతుందో చూడాలంటున్నారు తెలంగాణ రాజకీయ పండితులు.

Story By Adhinarayana, Bigtv

Related News

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Telangana BJP: సీక్రెట్‌గా షోకాజ్ నోటీసులు.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది?

Big Stories

×