Brahmamudi serial today Episode: రేవతి, జగదీష్‌ను బయటకు గెంటేసిన అపర్ణ నీ తల్లిదండ్రులు ఎవరని ఎవరైనా అడిగితే చనిపోయారని చెప్పు కానీ మా గురించి మాత్రం చెప్పుక అంటూ తిడుతుంది. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. నీ నిర్ణయం కూడా ఇదేనా నాన్న అని అడుగుతుంది రేవతి. దీంతో సుభాష్ నా కూతురు చనిపోయి చాలాసేపు అయింది అంటాడు. జగదీష్ నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అంటూ రేవతిని తీసుకని వెళ్లిపోతుంటే..
అపర్ణ ఆగండి అంటూ లోపలికి వెళ్లి ఆస్థి పేపర్స్ తీసుకొచ్చి విసిరి వాళ్ల మీదకు వేసి మీ నాన్న నీ కోసం కొన్న ఆస్థి దీని కోసమే వాడు నిన్ను పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆ ముష్టి మాకెందుకు తీసుకుని పో అంటుంది. చెల్లాచెదురుగా పడిపోయిన పేపర్స్ అన్ని ఏరుకుని తీసుకుని వెళ్లి సుభాష్ కాళ్ల దగ్గర పెట్టి నేను మీ కూతురునే నాన్న నాలో ప్రవహిస్తుంది కూడా మీ రక్తమే.. ఈ ఆస్థితో నాకు పని లేదు. ఏదో ఒక రోజు నేను తప్పు చేయలేదని మీరు అర్థం చేసుకుని పిలిచే వరకు నేను ఈ ఇంటి గడప తొక్కను అంటుంది. దీంతో అపర్ణ అది నేను బతికుండగా జరగదు అంటుంది. దీంతో రేవతి.. జగదీష్‌ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఈ ప్లాష్‌బ్యాక్ చెప్పి ఇంద్రాదేవి బాధపడుతుంది. అలా దూరం అయిపోయింది కాబట్టే నా మనవరాలిని ఇలా దొంగతనంగా కలవాల్సి వస్తుంది. నేను రేవతిని కలిశానని అపర్ణకు తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది. అందుకే తనని కలిసిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంటే.. ఇదిగో నువ్వు ఇలా వచ్చి అడిగేసరికి నిజం చెప్పక తప్పలేదు అంటుంది ఇంద్రాదేవి. కానీ ఏదో ఒక రోజు అయినా నిజం తెలియాల్సిందే కదా అమ్మమ్మ అంటుంది కావ్య. తెలియాలి కానీ తెలిసే చాన్స్ వస్తుందో లేదో నాకు తెలియడం లేదు కావ్య. ఇన్ని రోజులు కూతురును ఎంతలా ప్రేమించారో ఇప్పుడు ఎందుకు ఇంత ధ్వేషిస్తున్నారో అర్థం కావడం లేదు అంటుంది ఇంద్రాదేవి.
అయితే అంత అర్జెంట్‌గా పెళ్లి ఎందుకు చేసుకున్నారు రేవతి గారు.. అని కావ్య అడగ్గానే.. దానికి అంత పరిస్థితి ఎందుకు వచ్చిందో.. అంత ఆగమేఘాల మీద పెళ్లి ఎందుకు చేసుకుందోనని ఆరా తీస్తే అందులో రేవతి తప్పేం లేదని తెలిసింది. ఆ అబ్బాయి వాళ్ల అమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. అందుకే ఆమె తన కొడుకు పెళ్లి చూడాలనుకోవడంతో అలా పెళ్లి చేసుకున్నారు పాపం అన్ని విషయాల్లో సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు ఈ విషయంలో కూడా సపోర్ట్ చేస్తారని నమ్మింది అని ఇంద్రాదేవి ఏమోషనల్ అవుతుంది. దీంతో మీరు ధైర్యంగా ఉండండి అమ్మమ్మగారు టైం చూసి రేవతి గారిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని భరోసా ఇస్తుంది.
ఇంటికి వచ్చిన అపర్ణ జూనియర్ రాజ్ ను గుర్తు చేసుకుని నవ్వుకుంటుంది. ఇంతలో సుభాష్ వచ్చి ఏంటి అపర్ణ నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి..? అని అడుగుతాడు. దీంతో అపర్ణ జూనియర్ రాజ్ గురించి చెప్తుంది. వాడి చేష్టలు గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నాను అంటుంది. తర్వాత యామిని.. కావ్యకు ఫోన్ చేస్తుంది. వెటకారంగా మాట్లాడుతుంది. శ్రీను ఆచూకి తెలియట్లేదా అంటూ అడుగుతుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను.. నా సంతోషానికి కారణం నువ్వే.. నీ చెల్లిని కాపాడుకోవడానికి వేసిన ప్లాన్ అట్టర్‌ప్లాప్ అయినట్టు ఉంది. నన్ను అంత ఈజీగా తీసుకున్నావు. ఇప్పుడు చూడు నీ చెల్లిని నువ్వు మరింత ప్రమాదంలోకి నెట్టేశావు.
నువ్వు ఆ శ్రీనును వెతుక్కుంటూ వెళ్లి నాకో బోనస్ ఐడియా ఇచ్చావు. ఇప్పటి వరకు అప్పుకు ఒకటే కేసులో శిక్ష పడేది. ఇప్పుడు రెండు కేసుల్లో శిక్ష పడనుంది. ఒకటేమో లంచం తీసుకుంటూ దొరికిన కేసు రెండేమో శ్రీనును కిడ్నాప్ చేసిన కేసు.. ఇప్పుడు ఏం చేస్తుంది మా హీరోయిన్.. తన చెల్లిని కాపాడుకుంటుందా..? లేక ఇంక తన వల్ల ఏమీ కాదని కన్నీళ్లు పెట్టుకుంటుందా..? అని అడుగుతుంది. దీంతో కావ్య కోపంగా అప్పుడే ఆట ముగిసిందని నువ్వు గెలిచావని సంబరపడిపోకు యామిని.. ఇందులో ఒక కొటేషన్ ఉంది తెలుసా..? ఏంటో అది అని యామిని అడగ్గానే.. పిక్చర్ అబీ బాకీ యై.. సముద్రం సైలెంట్‌గా ఉందంటే చేత కాక ఏమీ చేయలేక ఉందని అర్థం కాదు. నువ్వు చూస్తూ ఉండు యామిని.. నా చెల్లెల్ని నేను ఎలా కాపాడుకుంటాను అనేది అంటూ వార్నింగ్ ఇస్తుంది కావ్య.
వెంటనే యామిని, రాజ్ దగ్గరకు వెళ్తుంది. ఏంటి బావ ఇంత టైం అయినా పడుకోలేదు. ఏంటో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దీంతో రాజ్ అవును యామిని రేపు అప్పు కేసు ఉంది కదా అందుకే దాని గురించి ఆలోచిస్తున్నాను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు అని చెప్తాడు. దీంతో వాళ్ల కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అనవసరంగా ఇలా ఆలోచించడం ఎందుకు బావ ఎలా జరగాలి అని రాసి ఉంటే అలా జరగుతుంది అని చెప్పి వెళ్లిపోతుంది యామిని. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?