OTT Movie : ఓటీటీలలో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఒక రాత్రి సమయంలో జరిగే సంఘటనలతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఆరుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఒక పార్టీ చేసుకున్న తరువాత వీళ్లంతా షాకింగ్ సంఘటనలను ఎదుర్కొంటారు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మనిధర్గల్’ (Manidhargal). 2025 లో వచ్చిన ఈ సినిమాకి రామ్ ఇంద్ర దర్శకత్వం వహించారు. దీనిని స్టూడియో మూవింగ్ టర్టల్ శ్రీ కృష్ పిక్చర్స్ ద్వారా నిర్మించారు. ఈ సినిమాలో కపిల్ వెలవన్, ధక్ష, అర్జున్ దేవ్ సరవనన్, గుణవంతన్ గుణ, సాంబసివం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 106 నిమిషాల రన్‌టైమ్‌తో, సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఒక రాత్రి సమయంలో జరిగే సంఘటనలతో తెరకెక్కింది. ఈ చిత్రం 2025 మే 30న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం aha Tamil,Sun NXT లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకి ఐఎండీబీలో 9.1 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ కథ మనో, కర్లీ, సతీష్, దీపన్, చంద్రు, ప్రేమ్ అనే ఆరుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఒక రోజు రాత్రి భారీగా మద్యం సేవించిన తర్వాత, మరుసటి రోజు ఉదయం మేల్కొని తమ స్నేహితుడు ప్రేమ్ మృతదేహం పక్కన ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అవుతారు. ఈ షాకింగ్ ట్విస్ట్ వారిని గందరగోళం, భయం, అపరాధ భావనలో పడేస్తుంది. అసలు ఏమి జరిగిందో గుర్తులేని స్థితిలో, పోలీసుల దృష్టి నుండి తప్పించుకోవడానికి, శవాన్ని రహస్యంగా ఖననం చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయం వారిని ఒక రోడ్ ట్రిప్‌లోకి నడిపిస్తుంది.
ఈ ప్రయాణం దాదాపు ప్రమాదాలు, ఇంధన కొరత, వారి మధ్య నమ్మకం కోల్పోవడం వంటి సంఘటనలతో నిండి ఉంటుంది. వీళ్లంతా వాదనలు, ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక శవాన్ని ఖననం చేసే ప్రయత్నంలో వీళ్ళు అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. ఇక కథ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. చివరికి ప్రేమ్ ఎలా చనిపోతాడు ? ఆరోజు రాత్రి ఏం జరిగింది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : క్లాస్ రూమ్ లోనే పాడు పని… టీచర్ పనిష్మెంట్ తో ఊహించని మలుపు… రక్తాన్ని మరిగించే రివేంజ్ డ్రామా