బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Advertisement

Khammam District: ఖమ్మం బాలిక ఘటనలో సంచలనాలు.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..!

Khammam District: ఖమ్మం బాలిక ఘటనలో సంచలనాలు.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..!

Khammam District: పన్నెండేళ్ల పాప వేసవి సెలవులొచ్చాయని ఎంతో ఆనందంగా తాతయ్య దగ్గరకు వచ్చింది. ఆమె దృష్టిలో అది ఆటల ప్రయాణం. నవ్వుల ప్రపంచం. కొత్త జ్ఞాపకాలను దాచుకునే సమయం. కానీ తన జీవితాన్ని చీకట్లోకి నెట్టేసే ఓ రాక్షస మృగం అక్కడే పొంచి ఉందని ఆ చిన్నారికి తెలియదు. ఆమెకు తెలిసేలోపే ఆ బాలిక బాల్యం ముక్కలైపోయింది. ఆడుకోవాల్సిన ఆ చేతులను కట్టేశారు. స్కూల్ బ్యాగ్ మోయాల్సిన ఆ భుజాలపై అమానుషత్వం నృత్యం చేసింది.

అమానుషం..

లోకం తెలియని వయసులో మనుషుల్లోని రాక్షసత్వాన్ని చూడాల్సి వచ్చింది. తనపై జరుగుతున్న లైంగికదాడి నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి కేకలేసింది. భయంతో నొప్పితో బతకాలనే ఆరాటంతో ఎంతో అరిచింది. కానీ, ఆ అరుపు వినే నాథుడే లేడు. విన్నా స్పందించే హృదయమే లేదు. పైగా తన పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ రాక్షసుడు చేసిన పని మరీ అమానుషం. తాను చేసిన అఘాయిత్యం ఎక్కడ బయటకు తెలుస్తుందోనని ఆ చిన్నారిని మూడో అంతస్తు నుంచి కిందకి తోసేశాడు. ఆ అమ్మాయి ప్రాణాన్ని బలితీసుకోవాలని చూశాడు.

రాక్షసానందం..

ఖమ్మం రాపర్తినగర్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. కన్నబిడ్డలా చూడాల్సిన ఆ బాలిక పై కసాయివాడిలా ప్రవర్తించి సమాజం తలదించుకునేలా చేశాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆ చిన్నారి ఎన్ని కేకలేసినా వినకుండా తన పశువాంఛని తీర్చుకునేందుకు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఎంత ప్రతిఘటించినా, రక్షించమని వేడుకున్నా ఆ కామాంధుడి మనసు కరగలేదు. మృగంలా ప్రవర్తించి రాక్షసానందం పొందాడు. ఈ అఘాయిత్యంతో ఆ చిన్నారి శారీరకంగానూ, మానసికంగానూ తీవ్రమైన నరకాన్ని అనుభవించింది.

Also read: YouTube వాడుతున్నారా? ఇలా చేస్తే డేటా అయిపోదు.. రోజంతా హ్యాపీగా చూడొచ్చు!

నమ్మించే ప్రయత్నం..

లైంగిక దాడి జరిగిన తర్వాత సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆ బాలికనే అంతమొందించాలనుకున్నాడు. సమీపంలోని భవనంపైకి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా కిందకు తోసేశాడు. పైనుంచి కిందపడితే ఆ అమ్మాయి చనిపోతుందనుకున్నాడు. దాంతో ప్రమాదవశాత్తూ పడిపోయిందని నమ్మించొచ్చని అనుకున్నాడు. కానీ ఆ చిన్నారి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం లేకుండా బయటపడింది. అంత పైనుంచి పడటంతో బాలిక వెన్నుముక విరిగింది. చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి.

ఆస్పత్రిలో చికిత్స..

ఆ చిన్నారి కిందపడినప్పుడు విరిగింది కేవలం ఎముకలు మాత్రమే కాదు. ఆ అమ్మాయిపై కుటుంబం పెట్టుకున్న ఆశలు, ఆ తల్లి గుండె, తండ్రి నమ్మకం, తాతయ్య విశ్వాసం అన్నీ విరిగిపోయాయ్. ఇప్పుడు ఆ పాప తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనకేం జరిగిందో కూడా అర్థం కాని స్థితిలో ఆస్పత్రి బెడ్ మీద పడి ఉంది. కానీ, బయట కూర్చున్న తల్లిదండ్రులకు ప్రతి క్షణం నరకం కనిపిస్తోంది. ఫోన్ మోగినా భయమేస్తోంది. డాక్టర్ పిలిచినప్పుడల్లా గుండె ఆగినంత పనవుతోంది. తమ కూతురు మళ్లీ నవ్వుతూ తిరుగుతుందా? ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలతో ప్రతి రాత్రి నిశ్శబ్దంగా చనిపోతున్నారు. కానీ, ఆ నిందితుడు కొద్ది నిమిషాల తన సుఖం కోసం వికృత క్రీడతో తన వాంఛ తీర్చుకున్నాడు. ఆ కొద్ది నిమిషాల క్రూరత్వం ఆ చిన్నారికి, ఆమె కుటుంబానికి జీవితకాల శిక్షగా మారింది.

కన్నీటికి విలువ లేదా?

ఖమ్మంలో జరిగిన ఈ అఘాయిత్యంపై ఓ పదునైన ప్రశ్న వెంటాడుతోంది. ఒక పసి ప్రాణాన్ని నాశనం చేసేందుకు కొన్ని నిమిషాలు చాలు! కానీ, ఆ బిడ్డకు న్యాయం చేసేందుకు.. ఎందుకు సంవత్సరాలు పడుతోంది? తప్పు చేసిన వాడికి చట్టాలు తెలిసి ఉండొచ్చు. తప్పించుకునే లొసుగులు తెలిసి ఉండొచ్చు. ఎవరి కాళ్లు పట్టుకోవాలో ఇంకా బాగా తెలిసి ఉండొచ్చు. కానీ, బాధిత కుటుంబానికి తెలిసింది ఒక్కటే. తమ బిడ్డ ఏ తప్పూ చేయలేదని! అయినా సరే, శిక్ష మాత్రం వాళ్లే అనుభవిస్తారు. ఈ దేశంలో ఓ చిన్నారి కన్నీటికి విలువ లేదా? గుండె ముక్కలైన తల్లిదండ్రుల బాధకు, ఆక్రందనకు అర్థం లేదా? ఆ చిన్నారికి ఇది ఒకరోజుతో అయిపోయేది కాదు. ప్రతి పుట్టినరోజున గుర్తొచ్చే గాయమిది. ప్రతి రాత్రి నిద్రని మింగేసే చీకటి ఇది. ఆ పన్నెండేళ్ల చిన్నారి.. జీవితాంతం మోయాల్సిన బాధ ఇది! మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన రాక్షసులకు.. ఈ లోకంలో బతికే హక్కు ఉందా? ఈ ప్రశ్నలే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయ్.

Storey By: Appa Rao Big Tv

Also read: బీజేపీకి నోరున్న ప్రెసిడెంట్ కావాలట‌.. అర్వింద్‌కు రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వ‌ట‌!

Related News

Vizag Tragedy: ఏపీని వణికిస్తున్న స్టీల్‌ప్లాంట్ వివాదం.. వైఎస్ జగన్ ఓట్ల రాజకీయంపై టీడీపీ ఫైర్!

Sangareddy Murder: కూరగాయల సంచితో కిల్లర్ భర్త బండారం బట్టబయలు.. బొల్లారం హత్యకేసులో సంచలనం!

Bharathiraja Legacy: తెలుగు ఇండస్ట్రీపై భారతీరాజా మార్క్.. కమర్షియల్ హిట్స్‌తో రియలిస్టిక్ పిక్చర్స్ ఇచ్చిన మేధావి..!

Amaravati Projects: ఏపీ రాజధానిలో ఢిల్లీ లెవెల్ రాజకీయం.. 22 ఎకరాల్లో కేంద్రం వేస్తున్న భారీ స్కెచ్ ఇదే..?

Mohan Naik: ఏసీబీ చరిత్రలోనే మోస్ట్ కాస్ట్‌లీ తిమింగలం..కాంట్రాక్టర్ల రక్తం తాగడం ఆయన నైజం..?

Hyderabad Rains: హైటెక్ సిటీ పరువు తీసిన మొదటి వాన.. మన గ్లోబల్ సిటీ ట్రాఫిక్‌తో దిమాక్ ఖరాబ్..!

Spy Satellites: అంతరిక్షం నుంచి భారత్‌ పై దొంగ చూపులు.. స్పేస్‌లో మొదలైన ఇండియా- పాక్ వార్..!

×