E-Paper
Advertisement

MLC Nagababu: పార్టీకి దూరంగా నాగబాబు.. ప‌వ‌న్‌పై అలిగారా?

MLC Nagababu: పార్టీకి దూరంగా నాగబాబు..  ప‌వ‌న్‌పై అలిగారా?

MLC Nagababu:  జనసేనలో కీలక నేత నాగబాబు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు .. ఒకప్పుడు పార్టీలో యాక్టివ్ గా ఉన్న ఆ లీడర్ ఎమ్మెల్సీ పదవి పొంది సైలెంట్ అవ్వడం చర్చనీయాశంగా మారింది. పొలిటికల్ స్క్రీన్ మీద కంటే… బుల్లితెర మీద ఎక్కువగా కనిపిస్తున్నారాయన.. ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకుని కొన్ని రోజులపాటు హడావిడి చేసిన ఆ లీడర్ మంత్రి పదవి ఇంకా రాలేదని అలిగారా? ఎమ్మెల్సీ వచ్చిందని సైలెంట్ అయిపోయారా?

అనకాపల్లి ఎంపీ సీటు వదులుకున్న నాగబాబు..

జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి, ఎన్నికల ముందు, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన మెగా బ్రదర్ నాగబాబు ఈమధ్య పెద్దగా కనిపించడం లేదు అనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుందట. జనసేన పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో చాలా యాక్టివ్‌గా పనిచేసిన నాగబాబు.. ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకుని అక్కడ పార్టీని యాక్టివేట్ చేయడంలోనూ ఎంతగానో కృషి చేశారని టాక్ ఉంది.. అంతేకాదు కూటమి కోసం తాను పోటీ చేయాలనుకున్న అనకాపల్లి ఎంపీ సీటుని తమ్ముడు నిర్ణయం మేరకు వదులుకున్నారు.

ఎమ్మెల్సీ అయిన తర్వాత సైలెంట్ అయిపోయిన నాగబాబు

ఎన్నికల తరువాత కూటమిలో ఒక ఎమ్మెల్సీ స్థానం జనసేనకు వచ్చిన నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని నాగబాబు ఇస్తారని ప్రచారం నడిచింది… అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుని కాదని … పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న హరిప్రసాద్ కి ఎమ్మెల్సీని ఇచ్చారు.. ఆ సమయంలో కూడా నాగబాబు పెద్దగా అసంతృప్తి చెందలేదు. ఆ తర్వాత కూటమి ఈక్వేషన్స్‌లో భాగంగా నాగబాబు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. అయితే తాజాగా ఎమ్మెల్సీ పదవీ వచ్చిన దగ్గర నుండి నాగబాబు పార్టీ పరంగా అంతగా యాక్టివ్‌గా లేరు అని ప్రచారం నడుస్తుందట. ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకుని.. మండలికి హాజరైన నాగబాబు… ఆ సమావేశాలు తరువాత.. పొలిటికల్ గా ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు అనే ప్రచారం నడుస్తుందట.

జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థానంలో, నెంబర్ 2 గా నాదెండ్ల మనోహర్ ని పిలుచుకుంటూ ఉంటారు… ఇక ఆ తర్వాతి మూడవ స్థానంలో నాగబాబుని చూస్తారనేది పార్టీ నేతలు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. అలా పార్టీలో మూడో స్థానంలో ఉన్న నాగబాబు ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత… ఎందుకు సైలెంట్ అయిపోయారు అనేది చర్చినీయంశంగా మారిందట. నాగబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనే చర్చ అటు జనసేనలోను..రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలోను చర్చించుకుంటున్నారట.

టీవీ షోలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్న నాగబాబు

నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాక ఉత్తరాంధ్ర, పిఠాపురం పర్యటనలు సమావేశాలు, పార్టీ బలోపేతం కోసం కమిటీలు అంటూ చాలా కార్యక్రమాలను నిర్వహించాలనే ప్రణాళికలు రూపొందించుకున్నారట. పార్టీ కూడా ఆ దిశగా నాగబాబుకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు ఆ మధ్య ప్రచారం నడిచింది.. కానీ అనూహ్యంగా నాగబాబు మాత్రం రాజకీయాలకు మీద కంటే, టీవీ షో ల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుందని జనసేన పార్టీలో కొంతమంది మాట్లాడుకుంటున్నారట.

ఎన్నికల అయిన తర్వాత … గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారిక లెటర్ హెడ్ మీద నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు చంద్రబాబు.. అయితే ఇది జరిగి ఏడాది దాటినా నాగబాబుకి మంత్రి పదవిపై ఇప్పటికి కూడా ఎవరు మాట్లాడటం లేదు. నాగబాబుకి మంత్రి పదవి విషయంలో రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు మారిపోయాయని, అందుకే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం ఆలస్యమవుతుందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుందట. గతంలో ఎన్నడు లేని విధంగా మంత్రి పదవి ఇస్తున్నామంటూ అధికారిక లెటర్ హెడ్ విడుదల చేసినప్పుటికీ… ఇప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడంతో నాగబాబు అలిగారా? అందుకే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నాడా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుందట..

నాగబాబుపై సొంత పార్టీ నేతలు చర్చ

కారణాలు ఏమైనా గాని.. నాగబాబు మాత్రం పార్టీలో యాక్టివ్ గా లేరు అనే విషయాన్ని సొంత పార్టీ నేతలు కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారట. పార్టీని మరింత బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు…. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కి అండగా ఉండాల్సిన సమయంలో .. నాగబాబు ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారో తెలియట్లేదన్న భావన కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారట. మరి నాగబాబు మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అవుతారు.. పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు పాల్గొంటారో అని నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారట.

Story by Apparao, Big Tv

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×