Parakamani: తిరుమల తిరుపతి దేవస్థానం దర్మకర్తలి మండలి ఎట్టకేలకు అలస్యంగా అయిన నిద్ర లేచింది. పరకామణి ఇష్యూపై హైకోర్టు అదేశాలపై విచారణ జరగుతున్న సమయంలో ఏవీఎస్ఓ సతీష్ అనుమానాస్పద మృతి తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరో సారి పరకామణిలో చోరీపై ఫిర్యాదు చేయాలని ఏకంగా తీర్మానం చేయడంతో పాటు మరోసారి ఫిర్యాదు చేయాలని తీర్మాణం చేసింది.. టీటీడీ పాలక మండలి తీర్మాణం తర్వాత నెక్ట్ స్టేప్ ఎలా ఉండబోతోంది? … సిఐడి నివేదిక తర్వాత హైకోర్టు మరో సారి కేసు దర్యాప్తుకు అదేశాలు జారీ చేస్తుందా?
పరకామణి వెంకన్న భక్తుల నమ్మకం..స్వామి వారు తమ కష్టాలు తీర్చినందుకు అయనకు తమ పాప పరిహారంతో పాటు మొక్కలు తీర్చినందుకు వేసిన కానుకులు హుండీ సోమ్ము.అలాంటి హూండీలో ఏకంగా పదుల సంవత్సరాల పాటు చోరీకి పాల్పడి వందలకోట్ల అస్తులు సంపాదించాడు జియ్యం గారి మఠానికి చెందిన గుమస్తా రవి కూమార్..పాపం పండినట్లు దేవుడికి కోసం వచ్చిందేమో..2023 ఏప్రిల్ 29 న పరకామణి సిబ్బందికి పట్టుబడ్డాడు.
తిరుమల వన్ టౌన్‌లో రవికుమార్‌పై కేసు నమోదు చేసారు. అయితే 900 డాలర్లు దొరికినట్లు కేసు నమోదు అయింది. 2023 సెప్టెంబర్ 9 వతేదిన తిరుపతిలోని లోక్ అదాలత్ లో రాజీ అయ్యారు. ఫిర్యాదు చేసిన ఏవీఎస్ఓ సతీష్..నిందితుడితో రాజీ అయినట్లు కేసు క్లోజ్ చేశారు..అయితే నాలుగు నెలల కాలంలో ఏం జరిగిందో కాని ..దీనిపై ఇప్పుడు హైకోర్టు అదేశాలతో సిఐడి దర్యాప్తు జోరుగా సాగుతోంది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో పరకామణి కేసుపై టీటీడీ పెద్దలు, ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోలేదు. బిజెపి రాష్ట అధికార ప్రతినిధి ప్రస్తుత పాలక మండలి సభ్యుడు అయిన భాను ప్రకాష్ రెడ్డి మొదటి నుంచి దీనిపై పోరాటం చేస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు సీఎం, డిజిని పలుమార్లు కలసి విజ్ణప్తి చేసిన పలితం శూన్యం. చివరకు ఓ జర్నలిస్టు హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో నెల రోజులగా కేసులో కదలిక వచ్చి, ప్రస్తుతం విచారణ వేగవంతంగా జరుగుతోంది..
గతంలో ఈఓ శ్యామలరావు టీటీడీలో గత పాలక మండలి హయంలో జరిగిన అక్రమాలపై చర్యలు ఏవి అని ఎవరైన ప్రశ్నిస్తే అయన ఒకే సమాధానం చెప్పేవారు. రాష్ట ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ చేయిస్తుందని .. చర్యలు సైతం ప్రభుత్వమే తీసుకోవాలని అనే వారు. పరకామణి చోరీ గురించి అడిగితే దానిపై కోర్టులో రాజీ అయ్యారు, లోక్ అదాలత్ లో రాజీ అయితే మరో సారి విచారణ కష్టమున్న రీతిలో మాట్లాడేవారు..అయన్ను ఆ విదంగా ట్యూన్ చేసారు టిటిడి లోని అధికారులు.
హైకోర్టు అదేశాలతో విచారణ జరుగుతున్న సమయంలోనే గత శుక్రవారం తెల్లవారజామున తిరుపతి సిఐడి విచారణకు వస్తూ కేసులో ఫిర్యాదుదారుడు రాజీ అయిన ఏవీఎస్‌ఓ సతీష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎట్టకేలకు టీటీడీ దర్మకర్తలి మండలి ఉన్నతాధికారులలో చలనం వచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఓ తీర్మానం చేశారు. దాని ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా జరిగిన పరకామణి కేసులో మరోసారి ఫిర్యాదు చేస్తామని తీర్మానం చేశారు. అస్తులు రాయించుకోవడం అది చోరీకి పాల్పడ్డ వ్యక్తితో తప్పు అని రాజీ వెనుక ఉన్న వ్యక్తులపై కూడా విచారణ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తీర్మానం చేశారు. ఇప్పటికే హైకోర్టు అదేశాలతో విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది..అయితే టీటీడీ పాలకమండలిని , అధికారులను తప్పుదారి పట్టించిన టిటిడి న్యాయవిభాగంపై చర్యలు ఉంటాయా.. అన్నదా వేచి చూడాలి..
రెండుపాలక మండళ్లు ఈ కేసు సమయంలో ఉన్నాయి. ఇందులో వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు అస్తులు రాయించుకున్నారు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు లోక్ అదాలత్ రాజీ అయ్యారని అంటున్నారు. అయితే అత్యవసరంగా ఓ తీర్మానం చేశారు. రవికుమార్ అస్తులు రాయించుకోవడానికి కనీసం గిఫ్ట్ డీడ్ తీసుకుంటున్నప్పుడు పత్రికలలో ప్రకటనలు సైతం ఇవ్వలేదు. అది టీటీడీ నిబంధనలకు విరుద్దం అయినా అప్పడు ఎవ్వరు కనీసం వారికి సమాచారం ఇవ్వలేదు. అప్పుడు ఇప్పుడు కూడా దర్మకర్తల మండలికి న్యాయ విభాగం సరైన సలహాలు ఇవ్వలేదని తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటికైనా దర్మకర్తలి మండలి తీర్మాణం పై సర్వత్ర హార్షం వ్యక్తం అవుతుంది భక్తులలో.
Story by Apparao, Big Tv