E-Paper
Advertisement

అర్ధరాత్రి ప్రకటన.. అంతా సరే, రాజీనామా సంగతేంటి?

అర్ధరాత్రి ప్రకటన.. అంతా సరే, రాజీనామా సంగతేంటి?
Advertisement

Paper Leak: పేపర్ లీక్ అనేది సామాన్యమైన విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతారని తెలుసని ప్రధాని అర్ధరాత్రి రిలీజ్ చేసిన వీడియోలో చెప్పారు. నిందితులను ఇప్పటికే పట్టుకున్నామని, వారు ప్రస్తుతం జైలులోనే ఉన్నారని తెలిపారు.

కేవలం అరెస్టులతో శాంతించకుండా, అధికారులతో చర్చించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠినమైన శిక్షలు విధించేలా డ్రాఫ్ట్ బిల్లు సిద్ధం చేయించినట్లు వెల్లడించారు. ఈ డ్రాఫ్ట్‌ను శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించి, పార్లమెంట్ సమావేశాల తదుపరి వారంలో వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రయత్నిస్తామని మోదీ చెప్పారు.

Advertisement

అంతా బాగానే ఉంది.. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటి?
విద్యార్థుల భవిష్యత్తును త్రిశంకు స్వర్గంలో పడేసిన పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర తుఫాను రేపింది. లక్షలాది మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి కన్నీరు మున్నీరవుతుంటే ప్రారంభంలో స్పందించని కేంద్ర ప్రభుత్వం.. చివరకు ప్రతిపక్షాల భారీ నిరసనలు, ప్రజాందోళనల తర్వాత అర్ధరాత్రి వేళ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ విమర్శలకు కారణం లేకపోలేదు. పేపర్ లీక్ ప్రకంపనలు మొదలైన తొలి రోజుల్లోనే ప్రధాని స్పందించి, విద్యార్థులకు ధైర్యం చెప్పి ఉన్నట్లయితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. కానీ, ప్రతిపక్షాలైన కాక్రోచ్ పార్టీ (CJP) పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చి, జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేపట్టి, రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని నివాసం ముందే నిరసన గళం విప్పే వరకు కేంద్రంలో ఎలాంటి చలనమూ కనిపించలేదు.

Advertisement

రాజకీయంగా పరిస్థితి చేతులు దాటిపోతోందని, యువతలో అసంతృప్తి వెల్లువెత్తుతోందని గ్రహించాకే ప్రధాని కార్యాలయం నుంచి అర్ధరాత్రి వేళ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కొత్త బిల్లులంటూ వీడియో సందేశం వెలువడింది. “మేము చర్యలు తీసుకుంటున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నాం” అని ప్రధాని చెబుతున్నప్పటికీ.. “ఈ నిర్ణయాన్ని ప్రారంభంలోనే ఎందుకు తీసుకోలేకపోయారు?” అనే ప్రశ్న ప్రతీ ఒక్కరి నుంచీ వ్యక్తమవుతోంది.

జరగాల్సిన నష్టం జరిగాకేనా?

ఈ లోగా జరగాల్సిన తీవ్ర నష్టం జరిగిపోయింది. లక్షలాది మంది విద్యార్థుల విలువైన సమయం, శ్రమ వృథా అయ్యాయి. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ వ్యవస్థపై నమ్మకం సడలిపోయింది. రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై లాఠీఛార్జీలు, అరెస్టులతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా.. పరిస్థితి ముదిరి పాకాన పడ్డాక, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి అర్ధరాత్రి వీడియోలు విడుదల చేయడం వలన పోయిన నమ్మకం తిరిగి వస్తుందా? చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల మాటలు బాగున్నా.. ఆచరణలో విద్యార్థులకు తక్షణ న్యాయం జరగనంత వరకు ఈ ఆగ్రహ జ్వాలలు చల్లారవు.

అసలైన డిమాండ్ సంగతేంటి?
ఇంత ప్రకటన ఇచ్చారు ఓకే.. కానీ అసలైన డిమాండ్ అయిన కేంద్ర విద్యారంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సంగతి ఏంటి? దాని గురించి క్లారిటీ ఇస్తే బాగుండేది. పైగా ఇవాళ కేబినెట్ మీటింగ్‌లో అదే ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్ గురించి ప్రస్తావిస్తారు.. అవసరమైతే ఆయనతోనే ప్రకటన కూడా చేయిస్తారు.. అంతేగానీ రాజీనామా మాత్రం చేయించరు. ఎందుకు? ఒక్క రాజీనామాతో కేంద్ర ప్రభుత్వానికి పోయేదేమీ లేదు కదా!

అక్కడ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నది మన దేశ బిడ్డలే కదా.. వారందరి ఆవేదనను గౌరవిస్తూ, బాధ్యత వహిస్తూ ఒక కేంద్ర మంత్రితో రాజీనామా చేయిస్తే తప్పేంటి? దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ఏమీ కూలిపోదు కదా? గతంలో చాలా సందర్భాల్లో చాలామంది కేంద్రమంత్రులు బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారు.. ఇప్పుడు చేస్తే పోయేదేముంది?

పైగా ఒకవైపు ప్రధాని అర్ధరాత్రి వీడియోలు రిలీజ్ చేస్తుంటారు.. ఇంకోవైపు ధర్నా చేసిన విద్యార్థుల పాస్‌పోర్ట్ రద్దు చేస్తామని, వారిపై జాతీయ భద్రతా చట్టం NSA కింద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇదెక్కడి రాజకీయం? ఈ పొలిటీషియన్స్ తెలివిగలవాళ్లు అనుకుంటాం గానీ.. అదృష్టవంతులు అంతే!

Story Credit By: Ashok Vemulapalli

Also Read: ఢిల్లీ విద్యార్థుల ఉద్యమానికి సల్మాన్ ఖాన్ మద్దతు.. దయచేసి ఆ ఒక్క పని చేయొద్దు!

Related News

కాక్రోచ్ పోస్ట్ రగడ.. చిక్కుల్లో RAF ఆఫీసర్ సోనియా సెహ్రావత్!

‘బిర్యానీ’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

చర్చ‌ల్లేవ్ గిర్చ‌ల్లేవ్‌.. బిగిస్తున్న ఉచ్చు… ప్ర‌ధాన్ రాజీనామాకే ప‌ట్టు!

హోమ్, గోల్డ్ లోన్ వడ్డీ తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ సీక్రెట్స్ తెలుసుకోండి!

కేటీఆర్ లీకు వీరుడు.. ఢిల్లీ పోరుతో తెలంగాణ‌లో మారిన సీన్‌.. తెర‌పైకి ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు..

చమురు నిలిపివేత.. రాబోయే ఆర్థిక భూతం.. మన జేబులకు ఎంత చిల్లు పడనుంది?

ప‌రివ‌ర్త‌న.. యాభ‌య్యో వ‌డిలో.. నిర‌స‌న రూపంతో మొద‌లు! వేడుక‌ల‌కు దూరం..

Big Stories

Advertisement
×