Ramya Pasupuleti : ఈమధ్య హీరోయిన్లు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సరే హీరోయిన్ మాత్రం సోషల్ మీడియాలో బాగా బిజీగా కనిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్గా కనిపిస్తున్న హీరోయిన్లు ఏమో కానీ చిన్న సినిమాలతో ఫేమస్ అయిన హీరోయిన్లు మాత్రం సోషల్ మీడియాలో తమ అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తున్నారు. అలాంటి హీరోయిన్ల లిస్టులోకి రమ్య పసుపులేటి చేరిపోయింది. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్తే మైండ్ బ్లాక్ అవుతుంది.. ఇక నెలకు సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అని తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. మరి నెలకు ఈ అమ్మడు ఎంత సంపాదిస్తుంది? అలాగే ఈమె సినీ కెరియర్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రమ్య పసుపులేటి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించి తన నటనతో జనాలను ఆకట్టుకుంది. ఈ మధ్య రమ్య పసుపులేటి సినిమాలు పెద్దగా రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఎక్కువగా విదేశాలకు ట్రిప్పులకు వెళ్తూ.. అక్కడ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈమె రోజురోజుకీ గ్లామర్ డోర్స్ పెంచుతూ ఫోటోలకి ఫోజులిస్తూ వస్తుంది. ఒకప్పుడు కేవలం అందాలతో రెచ్చగొట్టే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బికినీలలో దర్శనమిస్తూ కుర్రాళ్లకు మతిపోగోడుతుంది.. పిల్ల పొట్టిదైనా కూడా హీటెక్కించే అందాలతో ఫోటోలు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ అమ్మడు ఫోటోలకు ఫాన్స్ ఎక్కువే. అలా సోషల్ మీడియా ద్వారా ఈమె దాదాపు 8 లక్షలకు పైగానే సంపాదిస్తుంది అని తెలుస్తుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఈ అమ్మడు అసలు నిజాన్ని బయట పెట్టే వరకు వెయిట్ చేయాల్సిందే..
తెలుగు సినిమా హీరోయిన్ రమ్య పసుపులేటి ఆంధ్రప్రదేశ్లో జన్మించింది.. తన గ్రాడ్యుయేషన్ చదువు తర్వాత ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికతో ఆమె సినిమాలలో నటించాలన్న ఆసక్తిని పెంచుకుంది. హుషారు అనే మూవీతో 2018 లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ ‘బీఎఫ్‌ఎఫ్’ అంటే ‘బెస్ట్ ఫ్లాట్‌మేట్ ఫరెవర్’, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, మాడ్ స్క్వేర్ దీంతో పాటుగా మరో రెండు చిత్రాలలో కూడా నటించి తన అందంతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఇక ఈమె ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా సరే పెద్దగా ఫలితం లేకుండా పోతున్నాయి. ఇప్పటివరకు చేసిన సినిమాలు కొన్ని హిట్ అయినా కూడా స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు. సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ ని మించిన ఫాలోయింగ్ ఉంది. ఏది ఏమైనా కూడా సోషల్ మీడియా ద్వారా ఈ రేంజ్ లో సంపాదించడం మామూలు విషయం కాదు.. ఇకముందు రమ్య ఎలాంటి సినిమాలలో నటిస్తుందో చూడాలి..