E-Paper
Advertisement

Vladimir Putin: రష్యా ప్రెసిడెంట్ లైఫ్ స్టైల్.. ఆస్తులెన్ని? ప్యాలెస్‌లెన్ని? తెలిస్తే షాకే..

Vladimir Putin: రష్యా ప్రెసిడెంట్ లైఫ్ స్టైల్.. ఆస్తులెన్ని? ప్యాలెస్‌లెన్ని? తెలిస్తే షాకే..

Vladimir Putin:  వ్లాదిమిర్ పుతిన్.. ఈ ప్రపంచంలో ఉన్న బిగ్ కటౌట్స్‌లో ఒకరు. అలాంటి కటౌట్.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇండియాలో అడుగుపెట్టింది. ఇప్పుడు.. భారత్ మాత్రమే కాదు.. మొత్తం వరల్డ్ అటెన్షన్ అంతా.. పుతిన్ ఇండియా టూర్ మీదే ఉంది. అమెరికా ప్రెసిడెంట్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వ్యవహారం. తినే తిండి దగ్గర్నుంచి.. ఎక్కే కారు దాకా.. వేసే అడుగుల వరకు.. ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండేలా చూస్తుంది పుతిన్ టీమ్. అసలు.. రష్యా ప్రెసిడెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అతని చుట్టూ ఎందుకింత సెక్యూరిటీ?

భారత గడ్డపై అడుగుపెట్టిన రష్యా ప్రెసిడెంట్ పుతిన్

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఒకరు. అలాంటి కటౌట్.. సుదీర్ఘ విరామం తర్వాత.. మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టడం.. దేశీయంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలోనే చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల తర్వాత పుతిన్ ఇండియాలో పర్యటించడం.. భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలకే కాక.. ప్రపంచ రాజకీయాలపైనా ప్రభావం చూపే కీలక పరిణామం ఇది. అమెరికా అధ్యక్షుడికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉండే పుతిన్ వ్యవహారశైలి, ఆయన జీవన విధానం, భద్రత ఏర్పాట్లు.. ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయ్. ప్రెసిడెంట్ పుతిన్.. ప్రధాని నరేంద్రమోడీతో కీలక చర్చలు జరుపుతారు. పుతిన్‌కు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యమిస్తారు. 2021 తర్వాత.. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఢిల్లీ రావడం.. ఇదే మొదటిసారి. పుతిన్ భారత్‌లో ఇండియాలో ఉన్నంతవరకు.. ఆయన భద్రతని.. రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ చూసుకుంటుంది. ఇది.. రష్యాలోని అత్యంత రహస్యమైన, పటిష్టమైన భద్రతా విభాగాల్లో ఒకటి. మాజీ కేజీబీ అధికారి అయిన పుతిన్‌కు.. ప్రాణహాని తప్పేలా అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తారు. పుతిన్ పర్యటించే ప్రదేశాలకు కొన్ని రోజుల ముందే.. FSO అధికారులు చేరుకుని, ప్రతి అణువూ తనిఖీ చేస్తారు. కమ్యూనికేషన్ పరికరాలను, ల్యాండ్‌లైన్స్, మొబైల్ సిగ్నల్స్‌ని మానిటర్ చేస్తారు.

పుతిన్ బాడీగార్డ్స్ కి ప్రత్యేకంగా శిక్షణ

ఇక.. పుతిన్‌ని వ్యక్తిగతంగా అనుసరించే బాడీగార్డ్స్ కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందినవారే. వీరు ఎప్పుడూ సూటులో కనిపిస్తారు. కానీ.. లోపల స్పెషల్ ఆర్మ్‌డ్ వెస్ట్స్ ధరించి, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు, ఆయుధాలు కలిగి ఉంటారు. పుతిన్‌కు బాడీగార్డులను కూడా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. ఇందుకోసం అనేక టెస్టులు పెడతారు. బాడీగార్డుల ఎత్తు 5.8 నుంచి 6.2 అడుగుల మధ్య ఉంటుంది. వారి బరువు 75 నుంచి 90 కిలోల మధ్య ఉండేలా చూసుకుంటారు. అంతేకాదు.. విదేశీ భాషలు మాట్లాడగలగాలి. ప్రెసిడెంట్ బాడీగార్డ్‌గా సెలక్ట్ అయిన వారికి.. అత్యంత పక్కాగా ట్రైనింగ్ ఇస్తారు. 35 ఏళ్ల వయసులోనే.. వారు రిటైర్‌ అయిపోతారు. పుతిన్‌కు ఎక్కువ దగ్గరగా వస్తే.. ఎంతటి ఉన్నత స్థాయి నేతలనైనాసరే వారు అడ్డుకుంటారు.

పుతిన్ ఉపయోగించే కారు ప్రత్యేకత

పుతిన్ ఉపయోగించేవి కార్లు కావు. అవి.. కదిలే కోటల్లా ఉంటాయ్. వాటిని.. శత్రుదుర్భేద్యమైన వాటిగా తయారుచేశారు. పుతిన్ విదేశీ పర్యటనల్లోనూ.. రష్యా దేశీయంగా తయారుచేసిన ఆరస్ సెనెట్ కారులోనే ప్రయాణిస్తారు. ఇది.. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. పుతిన్ వాడే కారు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. గ్రెనేడ్ దాడులు, కెమికల్ దాడులు, అగ్ని ప్రమాదాలను కూడా తట్టుకోలగదు. ఎమర్జెన్సీ టైమ్‌లో ఆక్సిజన్‌ని కూడా సప్లై చేసే సదుపాయం ఉంది. మొత్తం నాలుగు టైర్లు పంక్చరైనా.. కారు ప్రయాణించగలదు. ప్రెసిడెంట్ పుతిన్ కాన్వాయ్‌లో.. ఎప్పుడూ ఒకే రకమైన అనేక కార్లు ఉంటాయ్. ఇందులో జామర్లు, అంబులెన్స్, కమ్యూనికేషన్ వాహనాలు, స్నైపర్లతో కూడిన వాహనాలు ఉంటాయి. పుతిన్ ఏ దేశానికి వెళ్లినా.. ఆయన కారు, సెక్యూరిటీ పరికరాలను.. స్పెషల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలిస్తారు. ప్రెసిడెంట్ పుతిన్.. ఇల్యుషిన్‌ ఐఎల్‌-96-300 పీయూ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణిస్తారు. దాన్ని ఫ్లైయింగ్‌ ప్లూటాన్‌‌గా పిలుస్తారు. ఇందులో.. జిమ్, బార్, మెడికల్ సెంటర్ లాంటి సదుపాయాలు ఉంటాయి. ఈ విమానం.. 262 మందిని మోసుకెళ్లగలదు. ఆగకుండా.. 11 వేల కిలోమీటర్లు దూసుకెళ్లగలదు. అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు.. పుతిన్ వెంట ఎప్పుడూ ఓ బ్యాకప్ జెట్ కూడా ఉంటుంది.

తినే తిండి దగ్గరి నుంచి ఎక్కే కారు దాకా..

పుతిన్ ఫుడ్ తినడానికి ముందు కూడా ఓ ప్రాసెస్ ఉంటుంది. ప్రెసిడెంట్ తీసుకునే ఆహారంలో.. విషపదార్థాలేమైనా కలిశాయో,లేవో గుర్తించేందుకు.. విదేశాల్లో ఆయన వెంట పర్సనల్ ల్యాబ్ రెడీగా ఉంటుంది. పుతిన్ తీసుకునే ప్రతి ఆహారాన్ని, పానీయాన్ని ముందుగా.. పాయిజన్ టెస్ట్ చేస్తారు. విదేశీ పర్యటనల్లో.. ఆ దేశాలకు సంబంధించిన హోటల్ స్టాఫ్ సేవలను కూడా ఆయన వాడుకోరు. ప్రెసిడెంట్ పుతిన్ కోసం.. రష్యా నుంచే చెఫ్‌లు, హౌస్ కీపింగ్ సిబ్బంది వస్తారు. రష్యా నుంచి వచ్చే చెఫ్‌తోనే ప్రత్యేకంగా వండిస్తారు. దానినే.. వడ్డిస్తారు. పుతిన్ బస చేసే స్థలాన్ని.. నెల రోజుల ముందే రష్యా భద్రతా సిబ్బంది.. అత్యాధునిక సాధనాలతో తనిఖీ చేస్తారు. పుతిన్ విదేశీ టూర్లలో ఉన్నప్పుడు.. ఆయన మలాన్ని కూడా రష్యా భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్‌కేసులో సేకరిస్తారు. దాన్ని.. మళ్లీ భద్రంగా రష్యాకు తరలిస్తారు. ప్రెసిడెంట్ పుతిన్ ఆరోగ్య పరిస్థితిని విదేశీ నిఘా సంస్థలు తెలుసుకోకుండా నివారించేందుకు ఇలా చేస్తారు. పుతిన్‌ బాత్రూమ్‌కు వెళ్లినా సరే.. ఆయనకు రక్షణగా బాడీగార్డ్స్ ప్రతి పక్షణం పక్కనే ఉంటారు.

కేజీబీ ఏజెంట్ నుంచి రష్యా దేశాధినేతగా ఎదిగిన పుతిన్ లైఫ్ స్టైల్.. మిగతా ప్రపంచాధినేతల కంటే భిన్నంగా ఉంటుంది. అతను కనిపించేంత సింపుల్ పర్సనాలిటీ ఏం కాదు. అతని వ్యక్తిత్వం అత్యంత గోప్యతతో, శక్తిమంతమైన ప్రత్యేకతతో కూడి ఉంటుంది. పుతిన్ నడక, చేతలు, బాడీ లాంగ్వేజ్, కంటి చూపు, ఫిట్‌నెస్ ఇలా ప్రతీది భిన్నమే. అతని ఆస్తులు, రాజభవనాలు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తాయ్. పుతిన్ గురించి ఒక్కో విషయం తెలిసేకొద్దీ.. ఒక్కొక్కరికీ మైండ్ బ్లాంక్ అవుతుంది.

పుతిన్ వ్యవహారశైలి పై చెరగని ముద్ర

పుతిన్ జీవితంలో.. రష్యా గూఢచార సంస్థ కేజీబీ అనుభవం.. ఆయన వ్యవహారశైలిపై చెరగని ముద్ర వేసింది. ఆయనొక.. ప్రొఫెషనల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ కాబట్టే.. పుతిన్ చుట్టూ ఇంత సెక్యూరిటీ. కేవలం బాడీగార్డులు మాత్రమే కాదు.. ప్రెసిడెంట్ ప్రతి కదలిక, ప్రతి వ్యక్తి పట్ల అత్యంత కచ్చితమైన నిఘా ఉంటుంది. పుతిన్ ఇండియా టూర్‌కి రావడంతో.. రష్యా ప్రెసిడెంట్ లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. పుతిన్‌ అప్పుడప్పుడూ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు, ముప్పు ఎక్కువ ఉండే పరిస్థితుల్లో తన బాడీ డబుల్స్‌‌ని వినియోగిస్తుంటారు. ఆయన కనీసం.. ముగ్గురు బాడీ డబుల్స్‌ని వాడుతున్నారనే ప్రచారం ఉంది. అచ్చం పుతిన్‌లా కనిపించేందుకు.. వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించారనే టాక్ ఉంది. ఇక.. పుతిన్ తన ఫిట్‌నెస్ విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటారు. ఉదయాన్నే స్విమ్మింగ్ చేస్తారు. జూడో, ఐస్ హాకీ లాంటి గేమ్స్ వీలున్నప్పుడు ఆడుతుంటారు. పుతిన్ జూడోలో బ్లాక్ బెల్ట్ పొందారు. ఇది ఆయనకు శక్తిమంతమైన మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. స్పోర్ట్స్ యాక్టివిటీస్, గుర్రపు స్వారీ, ఫిష్ హంటింగ్ లాంటివి చేస్తూ కనిపించడం ద్వారా.. ప్రజల్లో ఓ బలమైన, ఫిట్ పర్సనాలిటీగా గుర్తింపు పొందారు. ప్రెసిడెంట్ పుతిన్.. లైఫ్ స్టైల్ మిగతావారి కంటే భిన్నంగా ఉంటుంది. ముఖ్యమైన పనులన్నింటిని మధ్యాహ్నం గానీ, సాయంత్రం గానీ చేస్తారు. రష్యన్ ప్రజలకు తనలోని మానవీయ కోణాన్ని చూపించడానికి తరచుగా పెంపుడు జంతువులతో కనిపిస్తుంటారు.

ఫుడ్ విషయంలో పుతిన్ కేరింగ్

పుతిన్.. సాధారణంగా ఖరీదైన, టైలర్ మేడ్ సూట్‌లని ధరించడానికి ఇష్టపడతారు. ఆయన ధరించే దుస్తులు.. ప్రెసిడెంట్‌కి అధికారిక, ప్రొఫెషనల్ ఇమేజ్‌ని ప్రతిబింబిస్తాయ్. ఫుడ్ విషయంలోనూ పుతిన్ ఎంతో కేరింగ్‌గా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటారు. తరచుగా ఆర్గానిక్ పదార్థాలు, పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తారు. తేలికగా జీర్ణమయ్యే, సంప్రదాయ వంటకాలనే ఇష్టపడతారట. బ్రేక్‌ఫాస్ట్‌లో రష్యాలో పాపులరైన టోవోరాగ్‌‌ని తింటారు. దాంతో పాటు కౌజుపిట్ట గుడ్లు, తాజా పళ్లతో చేసే జ్యూస్‌ తీసుకుంటారు. ప్రొటీన్‌ కోసం చేపలను ఎక్కువగా తింటారని తెలుస్తోంది. స్టర్‌జియన్‌ చేప, గొర్రె పిల్ల మాంసం అంటే పుతిన్‌కు చాలా ఇష్టమట. తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. వాటికి బదులుగా సలాడ్‌లను తీసుకుంటారు. అధికారిక డిన్నర్లలో ఎక్కువగా చేపలతో చేసే సూప్‌, మాంసాహారానికి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. పుతిన్.. విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు.. ఆయన తీసుకునే ఆహారంలో విష పదార్థాలేమైనా కలిశాయా? లేవా? అని గుర్తించేందుకు.. విదేశాల్లో ఆయన వెంట ఓ పర్సనల్ ల్యాబ్ ఉంటుంది.

పుతిన్‌కు ఉన్న ఆస్తులెన్ని? ప్యాలెస్‌లెన్ని?

ప్రెసిడెంట్ పుతిన్ ఆస్తులు.. ఇప్పటికీ ఓ మిస్టరీనే. అధికారికంగా పుతిన్ వార్షిక జీతం లక్షా 40 వేల డాలర్లు అయినప్పటికీ.. ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరనే ప్రచారం ఉంది. ఆయనకు.. 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్, మూడు కార్లు ఉన్నాయని చెప్పుకుంటున్నప్పటికీ.. ఆయనకు విస్తారమైన లగ్జరీ హోల్డింగ్స్ ఉన్నాయనే ప్రచారం ఉంది. 73 ఏళ్ల రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సంపద.. 200 బిలియన్ డార్లకు మించి ఉండొచ్చనే అంచనాలున్నాయ్. వీటిలో.. నల్ల సముద్రంలో లక్షా 90 వేల చదరపు అడుగుల కోట లాంటి ప్యాలెస్, 1.4 బిలియన్ డాలర్ల విలువైన 19 ఇతర రాజభవనాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. 168 ఎకరాల్లో విస్తరించి ఉన్న బ్లాక్ సీ ప్యాలెస్‌లో.. అద్భుతమైన పెయింటింగ్స్, గ్రీకు దేవతల విగ్రహాలతో కూడిన గోడలు, అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ ప్యాలెస్‌లో 40 మంది ఉద్యోగులు ఉంటారు. దీని.. మెయింటైన్ చేసేందుకే ఏడాదికి 2 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ విశాలమైన, విలాసవంతమైన ప్యాలెస్‌లో పోల్ డ్యాన్స్ చేసే హుక్కా బౌడోయిర్, క్యాసినో, ఆక్వా డిస్కో ఉన్నాయి. ఇది.. అండర్ గ్రౌండ్‌లో 16 అంతస్తులు ఉంటుందని చెబుతారు. దీనిని.. జేమ్స్ బాండ్ సినిమాల్లోని విలన్ గుహలతో పోలుస్తారు. ఇది.. చాలా సురక్షితమైనదిగా చెబుతుంటారు.

పుతిన్ దగ్గర 22 బోగీల ఘోస్ట్ ట్రైన్

పుతిన్ దగ్గర 22 బోగీల ఘోస్ట్ ట్రైన్ కూడా ఉందంటారు. ఇది.. కూడా అన్నిరకాల లగ్జరీ సదుపాయాలున్న రైలు. ఇందులో.. జిమ్, మసాజ్ పార్లర్, యాంటీ ఏజింగ్ మెషీన్లు, టర్కిష్ బాత్ స్టీమ్ రూమ్ ఉన్నాయి. లగ్జరీ బెడ్ రూమ్‌లు, డైనింగ్ కార్లు, సినిమా థియేటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్.. బుల్లెట్ ప్రూఫ్. ఇందులో.. ప్రెసిడెంట్‌ ప్రాణాలను రక్షించే అనేక వైద్య పరికరాలతో అమర్చబడి ఉంటుంది. ఈ అద్భుతమైన రైలుని తయారుచేసేందుకు 74 మిలియన్ డాలర్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. దీనిని మెయింటైన్ చేసేందుకు ఏటా దాదాపు 16 మిలియన్ డాలర్లు అవసరమవుతుంది. పుతిన్ దగ్గర 58 విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయంటారు. 100 మిలియన్ డాలర్లు విలువ చేసే భారీ యాచ్‌తో పాటు 700 కార్లు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఇవి మాత్రమే కాదు.. ది ఫ్లయింగ్ క్రెమ్లిన్ నిక్ నేమ్‌తో.. 716 మిలియన్ డాలర్ల విలువ చేసే భారీ విమానం కూడా పుతిన్ కలిగి ఉన్నారని చెబుతారు. ఇవన్నీ.. అనధికారికమే! రష్యా ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం.. పుతిన్‌కు స్వల్ప ఆదాయం, చిన్న అపార్ట్‌మెంట్, కొన్ని కార్లు మాత్రమే ఉన్నాయి. బయట జరిగే ప్రచారాల పరంగా చూస్తే.. పుతిన్‌కు రష్యాలోని అతిపెద్ద కంపెనీలలో రహస్య వాటాలు, భారీ విలాసవంతమైన భవనాలు, బ్లాక్ సీ ప్యాలెస్, యాచ్‌లు ఉన్నాయంటారు. కానీ.. పుతిన్ లైఫ్‌స్టైల్ మాత్రం అపారమైన సంపదను సూచిస్తుంది.

Story By Anup, Big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×