BigTV English

Soniya AKula: గుడ్ న్యూస్ చెప్పిన సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రీవిల్..

Soniya AKula: గుడ్ న్యూస్ చెప్పిన సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రీవిల్..

Soniya AKula: బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల గురించి పరిచయాలు అవసరం లేదు.. బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొని మంచి క్రేజ్ నేను సంపాదించుకుంది. గతంలో ఈమె కొన్ని సినిమాలు చేసినా కూడా ఆమె పేరు చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత ఆమె అందరి నోట్లో నానుతుంది. సోలో ఆమె ఫైర్ ని చూసి విన్నర్ అవుతుందని అందరూ అనుకున్నారు. చివరికి జనాలు ఆమె టార్చర్ ని భరించలేక ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్లో ఉన్నప్పుడు తన ప్రేమ సంగతి బయటపెట్టిన విషయం తెలిసిందే.. బయటికి వచ్చిన తర్వాత వెంటనే తను ప్రేమించిన బిజినెస్ మాన్ యస్ తో ఏడు అడుగులు వేసింది. ఈమె పెళ్లికి బిగ్ బాస్ షో నుంచి పాల్గొన్న ప్రతి ఒక్కరూ హాజరయ్యారు.. ఆ ఫోటోలో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈమె ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది..


గుడ్ న్యూస్ చెప్పిన సోనియా..

బిగ్ బాస్ ఫేమ్ సోనియా, యశ్‌వీర్‌ తో నవంబర్లో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత వెంటనే డిసెంబర్లో ఇద్దరూ పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేశారు. అంతేకాదు వెకేషన్ లకు వెళుతూ అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తన సోషల్ మీడియా ద్వారా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది.. ది లిటిల్ మిరాకిల్ ఆన్ ది వే.. వి ఆర్ ఓవర్ జాయిడ్ అంటూ ఆమె పోస్ట్ చేసింది. తాను తల్లైన విషయాన్ని తెలియజేస్తూ వీడియో వదిలింది సోనియా ఆకుల.. ఒక ప్రాజెక్టు రూపంలో ఆమె ఇదంతా తెలియజేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాన్ఫిడెన్సియల్ అనే ఫైల్‌తో తన భర్త యష్ దగ్గరకు వెళ్లింది సోనియా. ఆ ఫైల్‌లో తన బేబీకి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరిచింది. అది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.


Also Read:ఫిష్ వెంకట్ మృతికి కారణాలు ఇవే..!

యష్ టాలెంట్ చూపించేసాడు.. 

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఆమె తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. తాను ప్రేమించాను కానీ పెళ్లి చేసుకోవాలంటే ఆలోచిస్తున్నాను అని చెప్పింది. కానీ యష్ మాత్రం తన నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాడు అంటూ ఆమె చెప్పడం అందరిని ఆలోచనలో పడేసింది. అయితే హౌస్ లో ఉన్నప్పుడు చిన్నోడు పెద్దోడు అంటూ నిఖిల్, అఖిల్ తో క్లోజ్ గా ఉండడంతో బయట ఆమెపై రూమర్స్ వినిపించాయి. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్ధమైంది. అమెరికాలో దావత్ పేరుతో యష్‌కి పలు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇతను మంచి క్రికెటర్ కూడా.. అండర్ 16, అండర్ 19 ప్లేయర్. చాలామంది క్రికెటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన స్థాపించిన సంస్థల్లో ఆమె ఎంప్లాయిగా జాయిన్ అయింది ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కాస్త పెళ్లికి దారితీసింది. డిసెంబర్ 21 మధ్యాహ్నం 3.40 గంటలకు యష్‌తో కలిసి ఏడడుగులు నడిచింది సోనియా ఆకుల. అంటే పెళ్లైన ఆర్నెళ్లలోనే గుడ్ న్యూస్ చెప్పింది సోనియా… మొత్తానికి ఈ వార్త విన్న ఆమె సన్నిహితులు, స్నేహితులు, అలాగే కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Big Stories

×