BigTV English

Fish Venkat Death : ఫిష్ వెంకట్ మృతికి కారణాలు ఇవే..!

Fish Venkat Death : ఫిష్ వెంకట్ మృతికి కారణాలు ఇవే..!

Fish Venkat Death : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న కమీడియన్ ఫిష్ వెంకట్.. అనారోగ్య సమస్యలతో పోరాడుతూ నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే.. ఎన్నో హిట్ సినిమాలు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ నిన్న కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలకు భారీగా సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఫిష్ వెంకట్ చనిపోవడానికి గల కారణాలు ఇవే అంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఆయన చనిపోవడానికి గల కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


కిడ్నీ సమస్యలతో బాధ పడిన ఫిష్ వెంకట్..

సినీ నటుడు ఫిష్ వెంకట్ కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధ పడ్డారు. పరిస్థితి విషమించడంతో ఇటీవల ఆయనను హైదరాబాద్ సిటీలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.. ఆయన వైద్యం సహాయం చెయ్యమని ఆయన భార్య, కుమార్తె వేడుకున్నారు. అయితే పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి సాయం చేశారు. కానీ ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి, ఇతరత్రా కారణాలు అసలు సహకరించలేదని వినికిడి. కిడ్నీ డోనర్ దొరకలేదని తెలిసింది.. డబ్బులు అందిన డోనర్ దొరకలేదు. దాంతోనే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.


Also Read : ఫైమా రివేంజ్.. షాక్ లో షకలక శంకర్ .. అందరు చూస్తుండగానే ఆ పని..

ఫిష్ వెంకట్ నటించిన సినిమాలు.. 

ఈయన అసలు పేరు మల్లంపల్లి వెంకటేష్.. చేపలు పట్టుకొని అమ్ముతూ జీవనం సాగించేవాడని గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేశారు. ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఆది’తో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. చెన్నకేశవరెడ్డి, దిల్, బన్నీ వరుసగా సినిమాలు చేశారు. ఇతర దర్శకులతోనూ ఫిష్ వెంకట్ సినిమాలో చేశారు. విష్ణు మంచు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘ఢీ’ కూడా ఆయనకు మంచి పేరు తీసుకు వచ్చింది.. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ సినిమాలో కూడా ఈయన నటించి మెప్పించాడు. ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఫిష్ వెంకట్ మొత్తంగా 50 సినిమాలకు పైగా చేశారు.. ఆ తర్వాత తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తుంది.. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరికొందరు ఆయన కుటుంబానికి అండగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కూడా ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజుల వ్యవధిలోనే నటీనటులు మరణించడం బాధాకరం..

Related News

Pawan Kalyan: అప్పట్లో ఇలాంటి టీమ్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదు!

OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!

Pawan Kalyan: సుజీత్ కు పిచ్చి పట్టుకుంది, పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడానికి అదే కారణం

OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలేసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!

OG Movie : చంపేస్తే చంపేయండి రా… ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి, ఓజి సినిమా చిక్కులు

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Big Stories

×