BigTV English

West Indies Jersey : ప్రపంచంలోనే ఖరీదైన జెర్సీ.. ఏకంగా 30 గ్రాముల బంగారంతో చేశారు… ధర ఎంత అంటే

West Indies Jersey : ప్రపంచంలోనే ఖరీదైన జెర్సీ.. ఏకంగా 30 గ్రాముల బంగారంతో చేశారు… ధర ఎంత అంటే

West Indies Jersey :  ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్ జరుగుతోంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు ఆడనున్నాయి. ఇంగ్లాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇండియా జట్లు తలపడుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ టోర్నీ కోసం వెస్టిండీస్ జట్టు ఓ జెర్సీ ని విడుదల చేసింది. జెర్సీ దుబాయ్ లగ్జరీ బ్రాండ్ లోరెంజ్.. ఛానల్ 2 గ్రూపుల సహకారంతో రూపొందించబడింది. వరుసగా 30 గ్రాములు, 20 గ్రాములు, 10 గ్రాముల బంగారంతో కూడిన మూడు ప్రీమియం ఎడిషన్లలో అందుబాటులో ఉంటుంది. వెస్టిండీస్ ఛాంపియన్స్ తమ ప్రచారాన్ని దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో జూలై 19న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభించనున్నారు.


Also Read :  BCCI Record : ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన BCCI…ఎన్ని కోట్లంటే

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెర్సీ.. 


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ జెర్సీగా వెస్టిండీస్ జెర్సీ నిలిచింది. వెస్టిండీస్ క్రికెటర్లను పరిశీలించినట్టయితే.. క్రిస్ గేల్, పోలార్డ్, డ్వేన్ బ్రావో, లెండిల్ సిమన్స్, డ్వేన్ స్మిత్, షెల్డన్ కాట్రెల్, శివ నారాయణ్ చందర్ పాల్, చాడ్విక్ వాల్టన్, షానన్ గాబ్రియేల్, యాష్లే నర్స్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, విలియం పెర్కిన్స్, సులీమాన్ బెన్, నికిటా మొహమ్మద్, నికీటా మొహమ్మద్ వంటీ క్రీడాకారులు వెస్టిండీస్ జట్టులో ఉన్నారు. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెటర్లు.. జెర్సీ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇవాళ వెస్టిండీస్ జట్టు సౌతాఫ్రికాతో తలపడనుంది. నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. టీమిండియా జట్టు కి యువరాజ్ సింగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే అన్ని జట్ల కంటే ఇండియా జట్టు ఈ సారి కాస్త యావరేజ్ గానే కనిపిస్తోంది. మిగతా జట్లలో ఆటగాళ్లు చాలా బలంగా కనిపిస్తున్నారు. ఇండియా జట్టులో శిఖర్ ధవన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, యూసూఫ్ పఠాన్, ఇర్పాన్ పఠాన్ మినహా చెప్పుకోదగిన ఆటగాళ్లు.. విధ్వంసకరంగా ఆడేవాళ్లు ఎవ్వరూ లేరు. 

WCL టైటిల్ ఈ సారి ఎవరిదో..

వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లలో డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. ఒంటి చేతితో మ్యాచ్ గెలిపించే విన్నర్లు ఉన్నారు. గత సీజన్ లో టీమిండియా తొలి టైటిల్ ని సాధించింది. పాకిస్తాన్ జట్టు పై ఫైనల్ లో ఘన విజయం సాధించింది. మరీ ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది పాకిస్తాన్ జట్టు. టీమిండియా రేపు పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. భారత జట్టు పాకిస్తాన్ తో మినహా 22న దక్షిణాఫ్రికాతో, 26న ఆస్ట్రేలియాతో, 27న ఇంగ్లాండ్ తో, 29న వెస్టిండీస్ జట్లతో తలపడనుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ జెర్సీ పైనే అందరూ చర్చించుకోవడం విశేషం. మరోవైపు సౌతాఫ్రికా జట్టుకి ఈ సారి ఏబీ డివిలియర్స్ రావడం.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో ఆ జట్టు కూడా చాలా బలంగా కనిపిస్తోంది. ఈ సారి WCL టైటిల్ ఏ జట్టు సాధిస్తుందో వేచి చూడాలి మరీ.

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×