E-Paper
Advertisement

ibomma Ravi Case: ఐ బొమ్మ రవి కేసు కథ రివర్స్.. షాక్‌లో పోలీసులు..

ibomma Ravi Case: ఐ బొమ్మ రవి కేసు కథ రివర్స్.. షాక్‌లో పోలీసులు..

ibomma Ravi Case: అతను ఠాగూర్ సినిమాలో చిరంజీవి కాదు. శివాజీ సినిమాలో రజనీకాంత్ కాదు. శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబు అంతకన్నా కాదు. అయినాసరే.. టాలీవుడ్ సినిమాలు పైరసీ చేసిన ఐబొమ్మ రవి.. ఎలివేషన్ లేకుండానే జనంలో హీరో అయిపోయాడు. అతన్ని అరెస్ట్ చేశాక ఆడియెన్స్ హ్యపీగా ఫీలవుతారనుకుంటే.. వాళ్లు మాత్రం రివర్స్‌లో రవికే మద్దతుగా నిలుస్తున్నారు. రోజురోజుకు.. ఐబొమ్మ రవిపై సానుభూతి పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. రవి తప్పు చేసినా జనంలో ఇంత సపోర్ట్ దేనికి?

ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన దగ్గర్నుంచి ఇప్పటివరకు.. అతనే ట్రెండింగ్ టాపిక్. పైరసీకి పాల్పడిన రవిని చట్టం అరెస్ట్ చేసినా.. ప్రజల నుంచి అతనికి వస్తున్న అనూహ్య మద్దతు వెనుక.. బలమైన కారణాలున్నాయ్. ఇమంది రవిని.. ఓ రాబిన్‌హుడ్‌గా ఎలివేట్ చేయడం, జనం అతనికి మద్దతుగా నిలబడటం అనేది.. కేవలం ఓ వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది.. ఫిల్మ్ ఇండస్ట్రీకి, సాధారణ ప్రేక్షకులకు మధ్య పెరిగిన గ్యాప్ గురించి తెలియజేస్తోంది. అతని అరెస్ట్ గురించి పోలీసులు ఏం చెప్పినా, ప్రజల డేటా ప్రమాదంలో ఉందని ఎంత హెచ్చరించినా సరే.. పబ్లిక్ సపోర్ట్ మాత్రం రవి వైపే కనిపిస్తోంది. అది.. రోజురోజుకు పెరుగుతోంది.

పైరసీకి చెక్ పెట్టే ప్రయత్నాల్లో.. రవిని అరెస్ట్ చేయడం, ఐబొమ్మ, బప్పం సైట్లని డౌన్ చేయడం కీలక పరిణామమే అయినప్పటికీ.. కేవలం ఇదొక్కటే పైరసీ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. ఐబొమ్మ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా తెలుగు సినిమాలు చూసేలా చేశాడు ఇమంది రవి. దీనివల్ల నష్టపోయింది టాలీవుడ్ నిర్మాతలు, ఓటీటీలే తప్ప.. జనం కాదు. పోలీసుల వెర్షన్‌లో చెప్పాలంటే.. ఈ పైరసీ వల్ల జనం డేటా ప్రమాదంలో ఉంది. బెట్టింగ్‌కి కొందరు ఆకర్షితులై డబ్బులు పోగొట్టుకున్నారు. అందుకే.. ఐబొమ్మ లాంటి సైట్లకి వెళ్లి సినిమాలు చూడొద్దంటున్నారు.

అయినా సరే.. ఐబొమ్మ రవి అరెస్ట్‌ని జనం సెలబ్రేట్ చేసుకోవడం లేదు. పైగా.. అతనిపై సానుభూతి చూపిస్తున్నారు. ఈ అరెస్ట్.. కేవలం టాలీవుడ్ వరకే బిగ్ రిలీఫ్‌గా కనిపిస్తోంది. దీనివల్ల.. కొత్త సినిమాల అక్రమ స్ట్రీమింగ్, డౌన్‌లోడ్‌లు ఆగిపోతాయ్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే.. పైరసీ అనేది ఒక్క రవి అరెస్ట్‌తోనో, ఐబొమ్మ, బప్పం లాంటి ఒకట్రెండు వెబ్‌సైట్లు డౌన్ చేయడం వల్లో తీరిపోయే ప్రాబ్లమ్ కాదు. ఇదంతా.. తాత్కాలికమే. పైరసీ భూతాన్ని అంతం చేయడం ఎవరివల్లా కాదని.. పోలీసులే చెబుతున్నారు.

హోంశాఖ కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయని ట్వీట్ చేశారు. ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని.. అతని స్థానంలో మరొకరు వస్తారన్నారు. వాళ్లు మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తారని చెప్పడం.. హాట్ టాపిక్‌గా మారింది. కేవలం.. కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో.. పైరసీ గానీ, సైబర్ నేరాలు గానీ పూర్తిగా ఆగిపోవడం అసాధ్యమన్నారు. పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాని పట్టుకున్న తర్వాత.. దొంగతనాలు, దాడులు, మోసాలు ఆగిపోయాయా? మనిషి ఉన్నంత కాలం ఈ తరహా నేరాలు జరుగుతూనే ఉంటాయని సీవీ ఆనంద్ కాస్త ప్రాక్టికల్‌గా ట్వీట్ చేశారు. వీటన్నింటినికి ఉన్న మార్గం.. నివారణ ఒక్కటేనని చెప్పారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే కోరికల్ని తగ్గించుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ పెరగడానికి అదే మూల కారణమని తెలిపారు.

ఒక్క సీవీ ఆనంద్ ట్వీటే కాదు.. మరో ఎగ్జాంపుల్ కూడా ఉంది. అవినీతి ఆరోపణలతో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టేక్మాల్ ఎస్సైని.. ఏసీబీ అరెస్ట్ చేసింది. దీనిపై.. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎస్సై ఏసీబీకి పట్టుబడటంపై ఆయనో ట్వీట్ చేశారు. అందులో.. ఈ విషయంలో ప్రజలు సంబరాలు చేసుకున్న తీరుని ప్రముఖంగా ప్రస్తావించారు. ఎస్సై అరెస్ట్‌పై జనం సంబరాలు చేసుకోవడం చూస్తుంటే.. వాళ్లు పోలీసుల నుంచి పారదర్శకత, నైతికత, సేవా ఆధారిత పోలీసింగ్‌ని కోరుకుంటున్నారనే విషయం అర్థమైందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని సూచించారు. టేక్మాల్ ఎస్సై లంచం తీసుకొని తప్పు చేశాడు. ఏసీబీకి దొరికాడు. జనం సంబరాలు చేసుకున్నారంటే.. ఓ అర్థముంది. ఐబొమ్మ రవి కూడా తప్పు చేశాడు.

చట్టప్రకారం జైల్లో ఉన్నాడు. కానీ.. ఇతని విషయంలో జనం స్పందిస్తున్న తీరు మరోలా ఉంది. అక్కడ ఎస్సై చేసింది తప్పే. ఇక్కడ ఐబొమ్మ రవి చేసింది తప్పే. కానీ.. రవి ఒక్కడే ఎందుకు ప్రజలకు హీరోగా కనిపిస్తున్నాడనేదే ప్రశ్న? బిగ్ టీవీలో ఐబొమ్మ రవినేమి వెనకేసుకు రావట్లేదు. అతను చేసింది కరెక్ట్ అని చెప్పట్లేదు. రవి చేసింది ముమ్మాటికీ తప్పే. కానీ.. సమాజంలో ప్రజల ఆలోచనా ధోరణి ఏ విధంగా ఉంది? జనం ఏం కోరుకుంటున్నారు? అని చెప్పడానికి.. చేసిన ప్రయత్నమే ఇది. అందువల్ల.. పైరసీని పూర్తిగా అంతం చేయలేమనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం. కానీ.. దీనిని తగ్గించాలంటే మాత్రం మూలాల నుంచి మొదలుపెట్టాలి. లేకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పైరసీ సమస్య ఎంత పెద్దదో.. దానికి పరిష్కారం కూడా అంతే పెద్దది కావాలి గానీ.. ఒక్క అరెస్ట్‌తోనే మొత్తం సెట్ రైట్ అవుతుందనుకోవడం కరెక్ట్ కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

ఇమంది రవి లాంటోళ్లని ఎంతమందిని అరెస్ట్ చేసినా.. ఐబొమ్మ లాంటి ఎన్ని సైట్లని డౌన్ చేసినా.. వాడుపోతే వీడు.. వీడుపోతే వాడు అంటూ.. ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు. పైరసీ చేస్తూనే ఉంటాడు. జనం చూస్తునే ఉంటారు. పోలీసులు మీ డేటా డేంజర్‌లో పడుతుందని చెప్పినా.. దానివల్ల అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించినా.. జనం వినే పరిస్థితి లేదని విషయం.. ఐబొమ్మ రవి ఎపిసోడ్‌తో క్లియర్ అయిపోయింది. ముఖ్యంగా.. టాలీవుడ్ సినీ నిర్మాతల కళ్లు తెరిపించింది. అసలు.. ఈ స్థాయిలో పైరసీ జరగడానికి కారణం నిర్మాతలేనా? తప్పందా వారిదేనా? జనాన్ని పైరసీ నుంచి బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలి?

ఐబొమ్మ కేసులో ఇమంది రవి అరెస్ట్ అయ్యాక.. రెండే రెండు అంశాల చుట్టూ ఈ ఇష్యూ తిరుగుతోంది. అవే.. సినిమా పైరసీ, మరొకటి డేటా ప్రైవసీ. సినిమాలు పైరసీ చేయడం ఎంత నేరమో.. పైరసీ కంటెంట్ చూడటం కూడా అంతే నేరం. కానీ.. పైరసీని అరికట్టడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. పైగా.. పైరసీ వెబ్‌సైట్‌లోకి వెళితే.. మన పర్సనల్ డేటా కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా జనానికి తెలుసు. మీ డేటా ప్రమాదంలో ఉందని పోలీసులు చెబుతున్నా.. జనం అంతగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే.. డేటా ఎవరి దగ్గర లేదు? అని క్వశ్చన్ చేస్తున్నారు. మూవీ టికెటింగ్ ప్లాట్ ఫామ్స్, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, షాపింగ్, ఫిన్ టెక్, ఫుడ్ డెలివరీ యాప్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. ఎందరి దగ్గరో జనం డేటా ఉంది. డేటాకు ప్రైవసీ లేకుండా పోయి.. చాలా రోజులైంది. ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదు అనే ధోరణిలో జనం ఆలోచనలున్నాయ్. అందువల్ల.. పైరసీ సైట్ల ద్వారా మీ డేటా డేంజర్‌లో ఉందంటే.. దానిని సీరియస్‌గా తీసుకునే పరిస్థితుల్లో జనం లేరనేది రియాలిటీ. ఇక్కడ రియలైజ్ అవ్వాల్సిందల్లా.. పైరసీ గురించే.

అరెస్ట్ తర్వాత.. ఇమంది రవి ఆడియెన్స్‌లో హీరో అయిపోయాడు. ఇప్పుడు జనం అతనికి సపోర్ట్ చేస్తున్నారంటే.. పైరసీకి మద్దతు తెలిపినట్లే కదా! దీని వెనుక సామాన్య ప్రేక్షకుల ఆవేదన దాగుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇమంది రవికి సోషల్ మీడియాలో వస్తున్న సపోర్ట్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చట్టపరంగా రవి చేసింది తప్పే అయినప్పటికీ.. సామాన్య ప్రజలు మాత్రం అతని వైపు స్టాండ్ తీసుకుంటున్నారు. ఐబొమ్మ రవికి జనంలో ఇంత సపోర్ట్ రావడానికి అనేక కారణాలున్నాయ్. అందులో మొట్టమొదటిది విపరీతంగా పెరిగిన సినిమా టికెట్ ధరలే! ముఖ్యంగా.. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు, పండుగ సీజన్లలో, టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయ్.

నలుగురు సభ్యులున్న ఓ కుటుంబం థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే.. టికెట్లు, ఇంటర్వెల్ స్నాక్స్ కలుపుకొని.. తక్కువలో తక్కువ 2 వేల రూపాయలు ఖర్చవుతోంది. ఓ మధ్య తరగతి కుటుంబానికి ఇది చాలా పెద్ద భారం. సినిమా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని జనం భావిస్తారు. టికెట్ రేట్లు పెంచడం వల్ల సామాన్యులకు ఆ వినోదం దూరమవుతోంది. అందువల్ల.. టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లు తగ్గించండి.. మేమే థియేటర్‌కు వచ్చి చూస్తాం అనే వాదన ప్రేక్షకుల నుంచి బలంగా వినిపిస్తోంది. రవి మీద పోలీసులకు కంప్లైంట్లు ఇవ్వడం మీద పెట్టిన శ్రద్ధ.. ముందు టికెట్ రేట్లు తగ్గించడం మీద పెట్టాలని.. ఆడియెన్స్ డిమాండ్ చేస్తున్నారు.

సినిమా థియేటర్‌లో మిస్సైతే.. ఓటీటీలో చూసేందుకు వీలుంది. కానీ.. ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అన్ని కొత్త సినిమాలు రావు. వేర్వేరు సినిమాలు చూడాలంటే.. వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లకు డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అన్ని సబ్‌స్క్రిప్షన్‌లు కొనేందుకు.. ఎంతోమంది సామాన్యుల ఆర్థిక స్థోమత సరిపోకవోవచ్చు. సో… ఇంట్లోనో, మొబైల్‌లోనో.. ఫ్రీగా హైక్వాలిటీతో కొత్త సినిమాలు చూసే ఫెసిలిటీ కల్పించిన ఇమంది రవి.. జనానికి ఎంతో మేలు చేసిన వాడిలా కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో.. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి, హీరోలకు భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి.. ఆ ఖర్చు మొత్తాన్ని టికెట్ రేట్ల రూపంలో తమ దగ్గరి నుంచే లాగేస్తున్నారనే ఫీలింగ్ ఇప్పటికే జనంలో ఉంది. అందువల్ల.. సినిమాలో ఖర్చుకు బదులు కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు. వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోల కోసం.. మా జేబులకు ఎందుకు చిల్లు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా.. ఐబొమ్మ రవి చేసిన పని చట్టవిరుద్ధమే. పైరసీ వల్ల సినీ పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందనేది వాస్తవం. కానీ.. రవికి సామాన్య ప్రేక్షకుల నుంచి వస్తున్న మద్దతు.. వారి ఆవేదనకు అద్దం పడుతోంది.

ఐబొమ్మ ఎపిసోడ్‌తో అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే. పైరసీ అనేది.. ఓ వ్యక్తికో, వెబ్‌సైట్‌కో సంబంధించింది కాదు. అదో నెట్‌వర్క్. ఒకట్రెండు బ్లాక్ అయితే.. మరో పేరుతో పదుల సంఖ్యలో మిర్రర్ సైట్లు పుట్టుకొస్తాయ్. ఐబొమ్మ కాకపోతే.. దాన్ని మించిన బామ్మ సైట్‌లు పుట్టుకొస్తాయ్. ఇప్పటికీ.. ఐబొమ్మ లాంటి సైట్లు.. ఒక్క క్లిక్ దూరంలోనే ఉన్నాయ్. సినిమాలు పైరసీ చేయాలని డిసైడ్ అయినోడు.. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో అదే పనిలో ఉంటాడు. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు వారిని పట్టుకునేలోపే.. ఎస్కేప్ అయ్యేందుకు ఓ మార్గం రెడీగా ఉంటుంది. జనం పైరసీ సినిమాలు చూసినంత కాలం.. దానికి ఏదో ఒక సైట్ అందుబాటులో ఉంటూనే ఉంటుంది.

Also Read: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా!

థియేటర్లలో వేల రూపాయలు ఖర్చు చేసి పెట్టి సినిమాలు చూడటం కన్నా.. ఫ్రీగా మూవీ కంటెంట్ చూడాలనుకునే ఆడియెన్స్ సంఖ్యే ఎక్కువ. అందువల్ల.. ఎవరో ఒకరు, ఏదో ఒక పేరుతో.. పైరసీ వెబ్‌సైట్లు క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఒక్క ఐబొమ్మని బ్లాక్ చేసినంత మాత్రాన పైరసీ ఆగదు. ఇమంది రవి అరెస్ట్‌తోనే.. పైరసీ నెట్‌వర్క్ చైన్ తెగిపోదు. కేవలం.. టికెట్ ధరలు తగ్గించడం, సామాన్యులకు వినోదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు మళ్లే అలవాటుని పెంచడం ద్వారానే.. పైరసీ సమస్యకు దీర్ఘకాలంలో పరిష్కారం లభిస్తుంది. ఐబొమ్మ రవి అరెస్ట్.. పైరసీపై తాత్కాలిక విజయమే కావొచ్చు. కానీ.. ప్రేక్షకుల మనసులో నుంచి పైరసీ ఆలోచనలని పూర్తిగా తుడిచేయాలంటే.. ముందు సినీ పరిశ్రమ తమ తీరుని, విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.

Story By Anup, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×