E-Paper
Advertisement

Upcoming SUV Cars in India: ఈ క్రేజ్ ఏంట్రా బాబు.. ఒకేసారి 5 SUV’s లాంచ్.. ఫీచర్లు, డిజైన్ పీక్స్ అంతే..!

Upcoming SUV Cars in India: ఈ క్రేజ్ ఏంట్రా బాబు.. ఒకేసారి 5 SUV’s లాంచ్.. ఫీచర్లు, డిజైన్ పీక్స్ అంతే..!
Advertisement

Upcoming SUV Cars in India: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో SUV సెగ్మెంట్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం శంలోని మొత్తం కార్ల విక్రయాలలో SUV సెగ్మెంట్ వాటా 50 శాతానికి పైగా ఉంది. ఈ కేటగిరిలో టాటా నెక్సాన్, టాటా పంచ్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా స్కార్పియో వంటి SUVలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 5 కొత్త SUVలు 2024 చివారి నాటికి ఈ విభాగంలోకి రానున్నాయి. రాబోయే SUVలో కొత్త ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. వీటి గురించి తెలుసుకుందాం.

Tata Curvv EV
దేశీయ కార్ల కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన మోస్ట్ ఎవైటెడ్ ఎలక్ట్రిక్ కార్ కర్వ్ EVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ SUV సింగిల్ ఛార్జ్‌తో  500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని తరువాత SUV ICE వేరియంట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటాయి.

Advertisement

Hyundai Creta EV
హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటి. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ సక్సెస్ తర్వాత కంపెనీ ఇప్పుడు దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను రాబోయే నెలల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే హ్యుందాయ్ క్రెటా EV సింగిల్ ఛార్జ్‌పై 450 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిచగలదని కంపెనీ వెల్లడించింది.

Also Read: రీకాల్ అలర్ట్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లు అర్జెంట్‌గా షోరూమ్‌‌లో ఉండాలి!

Advertisement

Hyundai Alcazar Facelift
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ తర్వాత కంపెనీ ఇప్పుడు హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దేశంలో సేల్ అవుతున్న మోస్ట్ పాపులర్ SUVలలో హ్యుందాయ్ అల్కాజార్ ఒకటిగా ఉంది. రాబోయే హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌లో లెవెల్-2 ADAS టెక్నాలజీలతో రావచ్చు.

Nissan Magnite Facelift
నిస్సాన్ మాగ్నైట్ SUV కార్‌కు దేశంలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కంపెనీ నిస్సాన్ మాగ్నైట్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. అయితే అప్‌డేట్ చేయబడిన నిస్సాన్ మాగ్నైట్ పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు.

Also Read: కాస్ట్‌లీగా మారిన ఆ చీపెస్ట్ EV కార్.. ప్రజెంట్ ప్రైస్ ఎంతో తెలుసా?

KIA EV9
దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా రాబోయే నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. Kia EV9  7-సీటర్ ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది. వినియోగదారులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 541 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

Tags

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×