E-Paper
Advertisement

Sreeleela: దేవర విలన్ కొడుకుతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. ?

Sreeleela: దేవర విలన్ కొడుకుతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. ?
Advertisement

Sreeleela: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమాతోనే తెలుగు అభిమానులను తన అందంతో, అభినయంతో బుట్టలో వేసేసుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కూడా కాకముందే స్టార్ హీరోల సినిమాలను లైన్లో పెట్టింది. మొదటి సినిమా హిట్ అవ్వకపోయినా.. ఆ తరువాత ధమాకా, భగవంత్ కేసరి లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. అయితే వరుస సినిమాలను అందుకుంది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.

ఒకప్పుడు చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు ఒక్కో భాషలో ఒక సినిమా చేస్తూ వస్తుంది. తెలుగులో పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్న శ్రీలీల.. తమిళ్ లో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు.. ఒక్క సినిమా హిట్ అవ్వగానే బాలీవుడ్ కు చెక్కేస్తారు. కానీ, శ్రీలీల వరుస సినిమాలు చేసి.. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

Advertisement

అవును.. అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాది ఉండనుందని తెలుస్తోంది.బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆయన కొడుకు ఇబ్రహీం ఆలీఖాన్ దిలర్ అనే సినిమా చేస్తున్నాడు. కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో ఇబ్రహీం కు జోడీగా శ్రీలీలను అనుకుంటున్నారట.

ఇప్పటికే అమ్మడితో సంప్రదింపులు కూడా జరిగాయని, ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే శ్రీలీల దశ తిరిగినట్టే. టాలీవుడ్ లో చక్రం తిప్పినట్టే..బాలీవుడ్ లో కూడా కుర్ర హీరోలు అందరూ ఈ ముద్దగుమ్మ చుట్టూనే తిరగడం మొదలుపెడతారు. మరి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×