BigTV English

Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ..తీర్మానించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ..తీర్మానించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరుంటారనే విషయంపై ఉత్కంఠ వీడింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నియామకమయ్యారు. ఆయన పేరును ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కమిటీ ఏకగ్రీవంగా తీర్మాణించింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గతంలో 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ రెండు ఎన్నికల్లో వరుసగా 44, 52 సీట్లు మాత్రమే సాధించింది. కానీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పుంజుకుంది. దీంతో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు రాహుల్ గాంధీ తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.


మెరుగైన ప్రదర్శన

కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడింది. ఎన్నికల్లో ఈ కూటమికి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయినా గతంలో కంటే మెరుగైన ప్రదర్శన కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారు. భారత్ జోడో యాత్రతో ఎన్డీఏ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే శనివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ పేరును లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జన్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొని చర్చించారు.


Also Read: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు వస్తున్నారో తెలుసా..?

పదేళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా..

కాంగ్రెస్ పార్టీకి దాదాపు పదేళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కింది. అంతకుముందు 2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత ఎన్నికల్లోనూ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. 2014లో 44 సీట్లతో సరిపెట్టుకోగా.. 2019లో 52 స్థానాల్లోనే గెలిచింది. లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైన సంఖ్యా బలం కావాలంటే.. మొత్తం సభ్యుల్లో కనీసం 10శాతం మంది గెలుపొందాల్సి ఉంటుంది. అయితే ఈసారి 99 సీట్లు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితం అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేసిన కృషిని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. కాగా, రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్ బరేలీ, కేరళలోని వయినాడ్ నుంచి ఎంపీగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×