E-Paper
Advertisement

Floriculture: సొంతూరిలోనే లక్షలు సంపాదించే బిజినెస్‌ – ఇంత వరకు ఎవ్వరూ చెప్పని వ్యాపారం ఇదే

Floriculture: సొంతూరిలోనే లక్షలు సంపాదించే బిజినెస్‌ – ఇంత వరకు ఎవ్వరూ చెప్పని వ్యాపారం ఇదే
Advertisement

Floriculture: సొంతూరులోనే ఉంటూ నెలకు లక్షలకు లక్షలు సంపాదించాలని ఉందా..? ఏ ఉద్యోగం చేయకుండా.. నెల జీతం కోసం ఎదురు చూడకుండా మీ స్వయం కృషితో ఎదగాలనుందా..? అయితే మీ లాంటి వాళ్ల కోసమే ఈ బిజినెస్‌ ఐడియా ఇలాంటి వ్యాపారం ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా మీకు లాభాల సిరులను కురిపిస్తుంది. ఇంతకీ ఆ బిజినెస్‌ ఏంటో  ఈ కథనంలో తెలుసుకుందాం.

సొంత ఊరిలోనే ఉంటూ లక్షలకు లక్షలు సంపాదించాలంటే మీరు చేయాల్సిందల్లా పూల బిజినెస్‌. అవును ఈ మధ్య కాలంలో పూలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. కాబట్టి పూల బిజినెస్‌ ద్వారా మీరు మీ సొంత ఊరి నుంచి సంపాదించవచ్చు అయితే ఈ పూల బిజినెస్‌ ఎలా చేయాలి..? ఎంత పెట్టుబడి పెట్టాలి. ఎప్పుడు మొదలుపెట్టాలి..?  అనే పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎటువంటి పూల సాగు చేయాలి:

Advertisement

బంతి, చామంతి పూల సాగు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి. అయితే ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టి మరింత లాభాలు రావాలనుకుంటే విదేశాలకు కూడా ఎక్స్‌ఫోర్ట్‌ చేయాలనుకుంటే మాత్రం గులాబీ, ఆర్కిడ్‌ వంటి పూల సాగు వైపు మొగ్గు చూపొచ్చు.

సాగు పద్ధతి:

సాధారణ పద్దతిలో బంతి, చామంతి వంటి పూలను పండించవచ్చు అలాగే పాలిహౌస్‌  ద్వారా కూడా పూల సాగు ప్రారంభించ వచ్చు అయితే పాలీహౌస్‌ అన్నది ఖర్చుతో కూడుకున్న పని. అయితే పాలీ హౌస్‌లో పండించిన పూలకు మార్కెట్‌లో మంచి ధర వస్తుంది.

పెట్టుబడి మరియు రాబడి:

Advertisement

సాధారణ సాగు పద్దతిలో బంతి లేదా చామంతి సాగుకు  ఎకరాకు సుమారు ₹50,000 నుండి ₹1 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాగే పాలీహౌస్‌లో పండించాలనుకుంటే పెట్టుబడి చాలా ఎక్కువే అవుతుంది.  ఎకరాకు సుమారు 20 లక్షల  నుంచి 30 లక్షల వరకు పెట్టుబడి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని పంటలకు ప్రభుత్వ సబ్సిడీలు ఉంటాయి. అవి మీరు దగ్గరలోని ప్రభుత్వ శాఖలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పూల సాగులో సాధారణంగా 50% నుండి 80% వరకు లాభాలు ఉంటాయి.  బంతి పూల సాగు ద్వారా కనీసం ఎకరాకు ₹1 లక్ష నుండి ₹2 లక్షలు వరకు లాభం పొందవచ్చు (సీజన్‌ను బట్టి లాభాలు మారుతాయి.)

నారు, విత్తనాలు, ఎరువుల మందులు ఎక్కడ కొనాలి:

దగ్గరలోని హార్టికల్చర్‌ నర్సరీలు లేదా రాష్ట్ర వ్యవసాయ పరిశోధన కేంద్రాలు (Agricultural Research Stations) నుండి ధృవీకరించిన విత్తనాలు, మొలకలు పొందవచ్చు. స్థానిక వ్యవసాయ దుకాణాలలో ఎరువులు లభిస్తాయి. పూలకు తెగుళ్లు త్వరగా వస్తాయి కాబట్టి, వాటి నియంత్రణపై శ్రద్ధ పెట్టాలి.

శిక్షణ ఎక్కడ తీసుకోవాలి:

రాష్ట్ర ఉద్యానవన శాఖ (Horticulture Department) అధికారులను సంప్రదిస్తే పూల సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణపై ఉచిత సలహాలు, శిక్షణ ఇస్తారు. అలాగే  కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా పూల పెంపకంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అలాగే మీ ప్రాంతంలో పూలు పండిస్తున్న రైతుల దగ్గరకు వెళ్లి వాళ్ల నుంచి సలహాలు సూచనలు తీసుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులు మార్కెట్‌ సదుపాయాలు తెలుసుకున్న తర్వాతే మీరు పూల సాగు మొదలుపెట్టండి.

 ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×