E-Paper
Advertisement

Big TV Exclusive: చర్చలు ఫెయిల్.. ‘అఖండ 2’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్‌ ఇదే!

Big TV Exclusive: చర్చలు ఫెయిల్.. ‘అఖండ 2’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్‌ ఇదే!
Advertisement

Akhanda 2 New Release: అఖండ 2ని పైనాన్స్‌ సమస్యలు వదలడం లేదు. ఈ రోజు జరిగిన చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. దీంతో అఖండ 2 వాయిదా పడక తప్పనిపరిస్థితులు నెలకొన్నాయి. కాగా నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన అఖండ 2 మూవీని 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి అచంట పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఈ రోజు విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరికొన్ని గంటల్లో రిలీజ్ అనగా మూవీ వాయిదా పడటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. బాలయ్య లాంటి స్టార్‌ హీరో సినిమా అనుహ్యాంగా వాయిదా పడటం అంటే ఏదో పెద్ద కారణమే అయ్యింటుందని, సినిమా వాయిదా వేయాల్సినంత పరిస్థితులు ఏమొచ్చాయా అని ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

పాన్ ఇండియా మూవీకి ఆర్థిక సమస్యలు

భారీ బజ్‌ ఉన్న సినిమాకు ఇలాంటి పరిస్థితులేంటని ఇండస్ట్రీ వర్గాలంత మాట్లాడుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియా, మీడియా ఎక్కడ చూసి అఖండ 2 వాయిదా గురించే. దీనికి ఆర్థిక లావాదేవీలే కారణమంటూ రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ 2 నిర్మాత గతంలో పెట్టిన పెండింగ్‌ బిల్లులే మూవీ రిలీజ్‌కి అడ్డు పడ్డాయని, అవి సెటిలైయ్యే వరకు అఖండ 2 విడుదలయ్యే పరిస్థితులు లేవంటూ ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వాయిదాకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని తేలింది. ఇదే విషయాన్ని నిర్మాత సురేష్‌ బాబు కూడా స్పష్టం చేశారు. అగ్ర హీరో, దర్శకుడి సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం తీవ్ర చర్చకు దారితిసింది. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు రావడం కూడా ఇదే మొదటి సారి.

కొలిక్కి రాని చర్చలు

Advertisement

దీంతో అఖండ 2 మూవీ కోసం సినీ పెద్దలంత ఏకమయ్యారు. నిర్మాత దిల్‌ రాజు కార్యాలయంలో సినీ పెద్దలు, అగ్ర నిర్మాతలంత చర్చలు జరుపుతున్నారట. ఈ సమావేశంలో బాలీవుడ్‌ ఫైనాన్స్‌ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వెనకడుగు వేయనంటుందట. ఇప్పటికిప్పుడు డబ్బులు చెల్లించాల్సిందే అంటూ మొండివైఖరికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే నిర్మాతలంత కలిసి అఖండ 2 రిలీజ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫైనాన్సర్స్‌తో చర్చలు జరిపి సమస్యను కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో లోకల్‌ ఫైనాన్షియర్‌ సమస్యను పరిష్కరించారట. అది కూడా ఈ రోజు రిలీజ్ అంటేనే తమ వంతుగా కొంత ఆర్థిక సాయం చేస్తామని దర్శకుడు, హీరోతో పాటు పలువురు నిర్మాతలు ముందుకు వచ్చారు. దీనికి లోకల్‌ ఫైనాన్షియర్లు కూడా ఒకే అన్నాయట. చర్చలు ఫలించి మూవీని ఈ రాత్రి ప్రీమియర్స్‌ వేసి రిలీజ్ చేద్దామని అనుకున్నారు.

కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే

కానీ, ఈ చర్చలకు ఏరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అడ్డుపడుతుంది. ఈ సంస్థ ఆర్థిక లెక్కలు ఏటు తేలకపోవడంతో అఖండ 2 వాయిదా వేయని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకేవేళ ఈ రోజు రిలీజ్ అయితేనే.. రెమ్యునరేషన్‌ అయినా, నిర్మాత ఫైనాన్స్‌ సపోర్టు ఉంటుందట. ఒకవేళ వాయిదా పడితే మాత్రం అంత చేతులు ఎత్తే పరిస్థితి వస్తుందంటున్నారు. ఈ రోజు (డిసెంబర్‌ 5) ఉదయం నుంచి జరుగుతున్న చర్చలు ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం అఖండ 2 వాయిదా పడే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటికీ దిల్‌ రాజు ఆఫీసులో జరుగుతున్న ఈ చర్చలు చివరికి ఏం తేలియస్తాన్నది మరికొద్ది సేపట్లో తేలనుంది. ఇప్పటికీ అందిన సమచారం ప్రకారం.. అఖండ 2 వాయిదా వేయడం తప్పనిసరి అంటున్నారు. కొత్త రిలీజ్‌ డేట్‌ని డిసెంబర్‌ 25కి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×