Airtel Xstream Fiber: ఇంటర్నెట్ మన రోజువారీ జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమైందో అందరికీ తెలుసు. ఇంట్లో పని చేసే వాళ్లకైనా, బయట బిజినెస్ చేసే వాళ్లకైనా, చదువుకునే పిల్లలకైనా ఇంటర్నెట్ లేకుండా ఒక రోజు కూడా గడవడం చాలా కష్టమే. ప్రతిదీ ఇప్పుడు ఇంటర్నెట్ చుట్టూనే తిరుగుతోంది. ఒకరోజు కూడా నెట్ లేకుండా గడపడం అసాధ్యం అనిపించే పరిస్థితి. ఈ అవసరాన్ని అర్థం చేసుకొని, వినియోగదారులకోసం అత్యుత్తమ సేవ అందిస్తున్నది ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్.
1 జిబిపిఎస్ వరకు వేగం
ఈ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అనే హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్‌కి ప్రత్యేకత ఏమిటంటే, ఇది 1 జిబిపిఎస్ వరకు అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. అంటే, సినిమాలు డౌన్‌లోడ్ చేయడం, వీడియోలు చూడటం, ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ కావడం, ఆఫీసు వర్క్ చెయ్యడం అన్నీ ఒకేసారి సులభంగా జరిగిపోతాయి.
Also Read: Bigg Boss 9 Promo : కామనర్స్ మరీ ఇంత కరువులో ఉన్నారా… హౌస్‌లో అందరూ చూస్తుండగానే
4కె క్వాలిటీ వీడియోలు
మరి ఈ సేవ ఎందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారో ఒక్కసారి గమనిస్తే, మొదటగా చెప్పుకోవాల్సింది దాని స్పీడ్ గురించే. ఒకేసారి ఇంట్లో నాలుగైదు డివైసులు కనెక్ట్ అయి ఉన్నా కూడా స్పీడ్ తగ్గిపోదు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారికి, 4కె క్వాలిటీ వీడియోలు చూసేవారికి, పెద్ద ఫైళ్లు అప్‌లోడ్-డౌన్‌లోడ్ చేసేవారికి ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు.
ఎంటర్ టైన్‌మెంట్ యాప్స్ సబ్‌స్ క్రిప్షన్స్
రెండో ముఖ్యమైన విషయం కంటెంట్ సబ్‌స్ క్రిప్షన్స్. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ తీసుకుంటే కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా అనేక ఎంటర్ టైన్‌మెంట్ యాప్స్ సబ్‌స్ క్రిప్షన్స్ కూడా వస్తాయి. అంటే మీకు అవసరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ ఛానెల్స్ అన్నీ ఒకేచోట దొరుకుతాయి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఆసక్తిగా ఉండేలా ఇది డిజైన్ చేయబడింది.
24×7 కస్టమర్ సపోర్ట్
మరొక విషయం ఏమిటంటే, ఏదైనా సమస్య వచ్చిన వెంటనే 24×7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినా, చాలా వేగంగా స్పందించి సర్వీస్ అందించడం ఎయిర్‌టెల్ ప్రత్యేకత. చిన్న సమస్యకైనా రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి సౌకర్యాలు అందించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కాబట్టి, ఇంట్లో నిరంతర కనెక్షన్, వేగవంతమైన నెట్ కావాలంటే ఇది సరైన ఎంపిక. వినోదం, చదువు, పని అన్నీ ఒకేసారి సులభంగా పూర్తయ్యేలా చేసే ఈ సేవ మన మొదటి ప్రాధాన్యం అవుతుంది. ఇది కేవలం బ్రాడ్‌బ్యాండ్ సేవ మాత్రమే కాదు, మీ జీవితానికి వేగం మరియు వినోదం తీసుకువచ్చే పూర్తి పరిష్కారం.