BigTV English

Bajaj All Bikes On Flipkart: బజాజ్ సంచలన నిర్ణయం.. ఫ్లిప్‌కార్ట్ నుంచి బైకులను ఆర్డర్ చేయవచ్చు!

Bajaj All Bikes On Flipkart: బజాజ్ సంచలన నిర్ణయం.. ఫ్లిప్‌కార్ట్ నుంచి బైకులను ఆర్డర్ చేయవచ్చు!

Bajaj All Bikes On Flipkart: దేశీయ టూవీలర్ దిగ్గజ కంపెనీ బజాజ్ మోటర్స్ పరిచయం అక్కర్లేని పేరు. కంపెనీ ఏ బైక్ విడుదల చేసిన అది మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో బజాజ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన అమ్మకాలను భారీగా పెంచేందుకు పెద్ద ప్లాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు కస్టమర్లు ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి బజాజ్ అన్ని బైకులు, స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఎప్పుడూ డిమాండ్ ఉండే బజాజ్ పల్సర్, బజాజ్ ప్లాటినా, బజాజ్ డొమినార్ వంటి మోడళ్లు కూడా ఉన్నాయి. 100 సిసి నుంచి 400 సిసి బైకులు ఉన్నాయి.


అయితే ఇప్పుడు మీరు బైక్ కొనాలంటే ఎంచక్కా ఇంట్లో నుంచి ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. కొంత వరకు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. దీని ద్వారా బయటకు వెళ్లి షోరూమ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అయితే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ సేవలు ప్రస్తుతానికి 25 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాలక్రమేణా కంపెనీ ఈ సేవలను ఇతర నగరాలకు విస్తిరించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సేల్స్ భారీగా పెరగుతాయని బజాజ్ అంచనా వేస్తోంది.

ఈ సందర్భంగా బజాజ్ ఆటోకు చెందిన సారంగ్ కనాడే మాట్లాడుతూ.. ఫ్లిప్‌కార్ట్‌లో విస్తృత శ్రేణి మోటార్‌సైకిళ్లను అందుబాటులో ఉంచడం ద్వారా, మేము మా పరిధిని విస్తరించడమే కాకుండా మా కస్టమర్‌లకు సౌకర్యవంతమైన, తక్షణ షాపింగ్ అనుభవాన్ని అందిస్తున్నాము. మా కస్టమర్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మా ఉత్పత్తులకు ప్రాప్యతను కలిగి ఉండేలా, మెరుగైనఅనుభవాన్ని కలిగి ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ కొత్త  రీతిలో మా కస్టమర్‌లకు సేవలందించేందుకు మేము ఎదురుచూస్తున్నాము. కస్టమర్లు ఇంట్లో కూర్చొని కంపెనీ మోటార్‌సైకిళ్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు.


Also Read: Flipkart GOAT Sale: ఆఫర్ల జాతర.. ఐఫోన్ 15పై రూ.35 వేల డిస్కౌంట్!

బజాజ్ ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటి Freedom 125 CNG బైక్‌ను భారత్ దేశంలో విడుదల చేసింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో బజాజ్ ఫ్రీడమ్ 125ను సేల్‌కు తీసుకొస్తారో లేదో కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కస్టమర్‌లకు బజాజ్ ఫ్రీడమ్ 125 డెలివరీ ఇప్పటికే ప్రారంభమైంది. బజాజ్ ఫ్రీడమ్ 125 పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్‌లతో 330 కి.మీ రేంజ్ అందజేస్తుందని పేర్కొంది. బజాజ్ ఫ్రీడమ్ 125 ప్రస్తుతం 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. బజాజ్ ఫ్రీడమ్ 125 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 95,000గా ఉంది.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×