BigTV English

Rana Naidu: బెస్ట్ యాక్టర్‌గా రానా ద‌గ్గుబాటి.. ఆ వెబ్ సిరీస్‌కు స్పెష‌ల్ అవార్డు

Rana Naidu: బెస్ట్ యాక్టర్‌గా రానా ద‌గ్గుబాటి.. ఆ వెబ్ సిరీస్‌కు స్పెష‌ల్ అవార్డు

Rana Naidu: రానా నాయుడు.. ఈ వెబ్ సిరీస్‌ సినీ ప్రియుల్ని ఎంతగానో అలరించింది. అదే విధంగా ఎన్నో విమర్శలను సైతం అందుకుంది. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో కమ్ నిర్మాత రానా కలిసి ఈ వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా దీనిని రూపొందించింది. ఈ సిరీస్ తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అయింది. అయితే ఈ సిరీస్ చూసిన ఎంతో మంది తీవ్ర విమర్శలు చేశారు.


ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సిరీస్‌లను ఎందుకు రిలీజ్ చేయనిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా ఇలాంటి అసభ్యకర సన్నివేశాలు గల కంటెంట్‌లను ఇకపై రిలీజ్ చేయరాదని కూడా అప్పట్లో కొందరు ఫైర్ అయ్యారు. ఇలాంటి కంటెంట్ ఉన్న సిరీస్‌లు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయని కూడా ఫైర్ అయ్యారు. అయితే ఈ సిరీస్‌పై ఎంత వరకు విమర్శలు, ట్రోల్స్ వచ్చాయో.. ఇందులో నటించిన వెంకటేష్‌పై కూడా అలాంటి విమర్శలే వచ్చాయి.

ఎందుకంటే తెలుగులో వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి పేరు ఉంది. అతడి సినిమాలు వస్తున్నాయంటే అందులో మంచి కాన్సెప్ట్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ వంటివి ఊహించుకుంటారు ఆడియన్స్. కానీ ‘రానా నాయుడు’ సిరీస్‌ చూసి వారు ఒక్కసారికి ఆశ్చర్యపోయారు. ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న ఈ సిరీస్‌లో వెంకటేష్ నటించడంతో చాలామంది అతడిని రకరకాలుగా ట్రోల్ చేశారు. ఇక మరికొందరు మాత్రం ఈ సిరీస్‌లో వెంకటేష్ అండ్ రానా యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు.


Also Read: చివరి దశకు ‘రానా నాయుడు 2’ షూటింగ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దీంతో ఆ మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ అదిరిపోయే రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ వ్యూస్ అందుకుని దుమ్ము దులిపేసింది. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సీజన్ 2 ప్రకటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సీజన్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఈ సీజన్ 2 గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేసింది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి, అలాగే ఈ సినిమాలో నటించిన నటుడు రానాకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ బుల్లితెర‌ న‌టులు ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఇండియన్‌ టెలీ అవార్డ్స్ 2024’ వేడుక ఇవాళ అంటే శనివారం అట్టహాసంగా జ‌రిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ యంగ్ హీరో రానా ద‌గ్గుబాటి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, రానా నటించిన బ్లాక్ బ‌స్ట‌ర్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’కి గాను రానా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఈ వేడుకకు రానా హాజరుకాకపోవడంతో ఆయన తరపున దర్శకుడు కరన్ హన్షుమాన్ ఈ అవార్డును అందుకున్నాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×