BigTV English

Kethireddy peddareddy left Tadipatri: తాడిపత్రిలో పోలీసుల టెన్షన్, పెద్దారెడ్డి వచ్చి మళ్లీ వెళ్లారు

Kethireddy peddareddy left Tadipatri: తాడిపత్రిలో పోలీసుల టెన్షన్, పెద్దారెడ్డి వచ్చి మళ్లీ వెళ్లారు

Kethireddy peddareddy left Tadipatri: హై టెన్షన్ వాతావరణం మధ్య వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారు. స్టేషన్‌లో ష్యూరిటీ సమర్పించేందుకు వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అనంతపురం వెళ్లిపోయారు.


48 గంటలపాటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెలకొన్న హైటెన్షన్ వాతావరణానికి ఫుల్‌స్టాప్ పడింది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రి చేరుకున్నారు. అనంత రం ఉదయం 10 గంటల సమయంలో పోలీసు‌స్టేషన్‌కు వెళ్లి ష్యూరిటీలు సమర్పించారు. అనంతరం ఆయన్ని అక్కడ ఉంచకుండా పోలీసులు అనంతపురం తరలించారు. పెద్దారెడ్డి కూడా న్యాయస్థానం ఆదేశాలను గౌరవించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

అంతకుముందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే పంచె ఊడదీసి కొడతామని హెచ్చిరించారు. పెద్దారెడ్డి రాక నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు భారీ ఎత్తున మొహరించారు. ఇరు‌వర్గాల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఇంటి నుంచి నేరుగా పెద్దారెడ్డి పోలీసు‌స్టేషన్‌కు వెళ్లి ష్యూరిటీలు సమర్పించారు. అక్కడి నుంచి అటు అనంతరపురం వెళ్లిపోయారు.


ALSO READ: పల్నాడులో హ*త్యా రాజకీయం.. కారకులు ఎవరు..?

అసలేం జరిగిందంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలో ఘర్షణలు జరిగాయి. అరెస్టయిన పెద్దారెడ్డికి హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో శనివారం పెద్దారెడ్డి స్టేషన్‌కు వచ్చారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×