E-Paper
Advertisement

పెళ్లి కానుకలు, జ్యువెలరీ బహుమతులు పన్ను పరిధిలోకి వస్తాయా?.. గిఫ్ట్ ట్యాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

పెళ్లి కానుకలు, జ్యువెలరీ బహుమతులు పన్ను పరిధిలోకి వస్తాయా?.. గిఫ్ట్ ట్యాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
Advertisement

Gift Tax Rules: బంధువులు, స్నేహితులు ఇచ్చే క్యాష్ గిఫ్ట్ లు, ఆభరణాలు, పెళ్లి కానుకలపై పన్ను చెల్లించక్కర్లేదని భావిస్తుంటారు. ఐటీ నోటీసులు వచ్చే వరకు వీటిపై ట్యాక్స్ ఉంటుందని చాలా మంది తెలియదు. మీకు వచ్చి బహుమతులు రూ. 50,000 దాటి, వాటిని రిటర్న్స్ లో ప్రకటించకపోతే.. ఐటీ నోటీసులు వస్తుంటాయి. గిఫ్ట్ లపై పన్ను ఎలా విధిస్తారో అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇదే తప్పు చేస్తుంటారు.

గిఫ్ట్ లపై పన్ను ఎలా విధిస్తారు?

క్యాష్, చరాస్తి లేదా స్థిరాస్తి రూపంలో స్వీకరించిన బహుమతుల విలువ రూ. 50,000 దాటినట్లయితే, వాటిపై పన్ను చెల్లించాలి. ఉదాహరణకు, ఒక ట్యాక్స్ ఇయర్ లో మీకు రూ. 80,000 విలువైన బహుమతి లభిస్తే, మీరు ఆ పూర్తి మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, గిఫ్ట్ రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే, మీరు పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు.

మినహాయింపులు

Advertisement

ఐటీ చట్టంలో పేర్కొన్న బంధువులు (భార్య/భర్త, తల్లిదండ్రులు లేదా అత్తమామలు) నుంచి స్వీకరించే బహుమతులకు పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ పెళ్లి సమయాల్లో బంధువుల నుంచి స్వీకరించే బహుమతులకు పన్ను మినహాయింపు వర్తించదు. ఒకవేళ దగ్గరి బంధువుల నుంచి స్వీకరించే బహుమతిపై ఆదాయం వస్తే.. దానిపై పన్ను విధిస్తారు.

ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లిమిట్?

స్నేహితులు, బంధువుల నుంచి స్వీకరించిన బహుమతులపై సంవత్సరానికి రూ.50,000 వరకు పన్ను రహిత పరిమితి ఉంటుంది. ఉదాహరణకు, మీరు రూ.30,000 విలువైన రెండు బహుమతులు అందుకున్నట్లయితే, రూ.50,000 లపై పన్ను మినహాయింపు ఉంటుంది. పైన రూ. 10,000 లకు పన్ను చెల్లించాలి.

పెళ్లి కానుకలపై పన్ను ఎలా?

Advertisement

పెళ్లి కానుకలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకే రోజున రూ.2 లక్షలకు మించిన నగదును గిఫ్ట్ గా స్వీకరించకూడదు. కాబట్టి, పెళ్లి కానుకలను పెళ్లి రోజే స్వీకరించాలని ఎలాంటి రూల్స్ లేనప్పటికీ, వాటిని నిశ్చితార్థానికి, పెళ్లికి మధ్య వ్యవధిలో స్వీకరించవచ్చు. అంటే ఆరు నెలల వ్యవధిలో స్వీకరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

యజమానులు ఇచ్చే గిఫ్ట్ వోచర్లపై పన్ను

దీపావళి, దసరా పండుగలకు యజమానులు ఇచ్చే గిఫ్ట్ వోచర్లు, టోకెన్ల విలువ రూ.5,000 దాటితే, దానిని జీతంలో భాగంగా పరిగణించి పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అయితే, యజమాని క్యాష్ రూపంలో గిఫ్ట్ ఇస్తే పన్ను మినహాయింపు ఉండదు.

ఆస్తులపై పన్ను

గిఫ్ట్ రూపంలో స్థిరాస్తి ఇస్తే సాధారణంగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ లేదా సర్కిల్ రేటు రూ.50,000 దాటినట్లయితే, ఆస్తి పొందినవారు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తిపై స్టాంప్ డ్యూటీ విలువ కంటే రూ.50,000 లేదా ఆస్తి విలువలో 5% కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లయితే, ఆ అదనపు మొత్తం పొందిన ఇయర్ లో పన్ను చెల్లించాల్సి ఆదాయంగా పరిగణిస్తారు.

Also Read:  రూ.20 వేల కంటే ఎక్కువ క్యాష్ అప్పు ఇస్తున్నారా? అడ్డంగా బుక్కైపోతారు!

జ్యువెలరీ గిఫ్ట్ లపై పన్ను

జ్యువెలరీ, పురావస్తు సేకరణలు, డ్రాయింగ్‌లు, పెయింటింగ్‌లు, కళాకృతులు వంటి చరాస్తులపై కూడా పన్ను విధిస్తారు. ఈ వస్తువులను ఎలాంటి ప్రతిఫలం లేకుండా గిఫ్ట్ గా స్వీకరించినప్పుడు, వాటి మార్కెట్ విలువ రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే.. ఆ ఏడాదిలో పన్ను చెల్లించాల్సిన గిఫ్ట్ గా లెక్కిస్తారు. చరాస్తి లేదా స్థిరాస్తిని గిఫ్ట్ రూపంలో ట్రాన్స్ ఫర్ చేస్తే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×