BigTV English

Bajaj Chetak 3201: బజాజ్ చేతక్ వేరే లెవెల్ అబ్బ.. ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్.. సింగిల్ ఛార్జింగ్‌పై 136 కి.మీ మైలేజ్..!

Bajaj Chetak 3201: బజాజ్ చేతక్ వేరే లెవెల్ అబ్బ.. ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్.. సింగిల్ ఛార్జింగ్‌పై 136 కి.మీ మైలేజ్..!

Bajaj Chetak 3201 Launched: దేశీయ మార్కెట్‌లో స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. రకరకాల ఉపయోగాల కోసం ఎక్కువ మంది స్కూటర్లనే ఉపయోగిస్తున్నారు. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త స్కూటర్లను లాంచ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో బ్రాండ్ కంపెనీ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. దేశీయ మార్కెట్‌లో ఆటో మొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల్లో బజాజ్ ఒకటి. రకరకాల మోడళ్లలో కొత్త కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.


తాజాగా బజాజ్ కంపెనీ ఓ కొత్త స్కూటర్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ‘బజాజ్ చేతక్ 3201’ స్పెషల్ ఎడిషన్ విడుదల అయింది. ఈ సరికొత్త స్పెషల్ ఎడిషన్ స్కూటర్ టాప్-స్పెసిఫికేషన్స్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా తయారుచేశారు. కంపెనీ ఈ కొత్త స్కూటర్‌ని రూ.1.30 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చేతక్ స్పెషల్ ఎడిషన్‌ను ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ కొత్త మోడల్‌ ప్రారంభ ధర గడువు పూర్తయ్యాక రూ.1.40 లక్షల ఎక్స్ షోరూమ్‌ ధరతో లభిస్తుంది.

Also Read: వదలొద్దు బిగులు.. ఎస్‌యూవీపై రూ.83 వేల డిస్కౌంట్.. దేశంలో వేగంగా అమ్ముడైన కారు ఇదే..!


ఈ స్పెషల్ ఎడిషన్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. సైడ్ ప్యానెల్స్‌పై చేతక్ డీకాల్స్‌ను పొందుతుంది. అయితే అది బ్లూక్లిన్ బ్లాక్‌లో మాత్రమే లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్కూటర్ స్కఫ్ ప్లేట్లు, డబుల్-టోన్ క్విల్టెడ్ సీట్‌ను కలిగి ఉంటుంది. దీని డిజైన్ మొత్తం ప్రీమియం కౌంటర్ పార్ట్‌ను పొందుతుంది. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్స్, మ్యాజిక్ కంట్రోల్స్, వివిధ రకాల థీమ్‌లతో కలర్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, కాల్ నోటిఫికేషన్స్‌తో సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.

అలాగే ఇందులో హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా అందించబడింది. ఈ కొత్త బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ ప్రీమియం వేరియంట్ మాదిరిగానే 3.2 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 136 కి.మీ మైలేజీని అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 73 కెఎంపీహెచ్‌గా ఉంది. ఈ స్కూటర్ సామాన్య ప్రజలతో పాటు ఇతర సెలబ్రిటీలను ఆకర్షిస్తుంది.

బాలీవుడ్ దర్శకుడు కమ్ నిర్మాత కిరణ్ రావు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. ఇందులో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, ఇండికేటర్ స్విచ్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్స్, రివర్స్ అసిస్ట్ మోడ్‌లతో సహా మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈథర్ రిజ్టా జెడ్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది. కాగా ఈ స్కూటర్‌ లుక్ 90ల కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుందని పలువురు అంటున్నారు.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×