Car Discount Offer: దేశీయ మార్కెట్ ఆటో మొబైల్ రంగంలో రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుంది. అందులో ముఖ్యంగా ఎస్యూవీలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం ఎస్యూవీలపై ఫోకస్ పెడుతున్నాయి. ఇందులో భాగంగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఎస్యూవీలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. దేశంలో అత్యంత వేగంగా సేల్ అవుతున్న ఎస్యూవీలలో ఈ కంపెనీకి చెందినవి ముందు వరుసలో ఉంటాయి.
అయితే మారుతి సుజుకి తమ కార్ల సేల్స్ మరింత పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ నెలలో కూడా తమ ఎస్యూవీలపై ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించి సర్‌ప్రైజ్ చేసింది. కంపెనీ తన ఫ్రాంక్స్ ఎస్యూవీ పై ఆగస్టులో బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఫ్రాంక్స్ పెట్రోల్ వేరియంట్‌పై ఏకంగా రూ.83,000 తగ్గింపు అందుబాటులో ఉంచింది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ.30,000, అలాగే రూ.43,000 ఖరీదైన వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీస్ కిట్, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 లభిస్తుంది. ఇలా మొత్తంగా రూ.83,000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.
Also Read: ఇది విన్నారా.. పంచ్‌పై మామూలు డిస్కౌంట్ ఇవ్వలేదు..!
ఈ ఎస్యూవీపై మాత్రమే కాకుండా ఎస్యూవీ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై కూడా అద్భుతమైన డిస్కౌంట్లు అందిస్తుంది. వీటిపై దాదాపు రూ.32,500 తగ్గింపు, ఆటోమేటిక్ వేరియంట్లపై రూ.35,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్రాంక్స్ సీఎన్టీ వెర్షన్‌పై రూ.10,000 తగ్గింపు అందిస్తుంది. అందువల్ల ఒక మంచి ఎస్యూవీని డిస్కౌంట్ ఆఫర్లతో కొనుక్కోవాలని అనుకున్నవారికి ఇదే బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఆఫర్ల గురించి పూర్తి సమాచారం కోసం దగ్గర్లోని డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
ఇకపోతే ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్యూవీ 2023లో లాంచ్ అయింది. అలా వచ్చిన అతి తక్కువ సమయంలోనే అంటే కేవలం 10 నెలల్లోనే ఏకంగా 1 లక్ష యూనిట్ల ఎస్యూవీలు సేల్ అయిన తొలి కారుగా ఇది నిలిచింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్యూవీలో 2 ఇంజిన్లు ఉంటాయి. మొదటిది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజిన్ గరిష్టంగా 100 బిహెచ్‌పీ పవర్, 148 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. మరొకటి 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది గరిష్టంగా 90 బీఎహ్‌పీ పవర్, 113 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక వీటితో పాటు సీఎన్జీ వెర్షన్ ఉంది. ఇది 77.5 బిహెచ్‌పీ పవర్, 98 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దేశీయ మార్కెట్‌లో ఈ కారు టాప్ మోడల్లో రూ.7.51 లక్షల నుండి రూ.13.04 లక్షల వరకు ఉంటుంది.