E-Paper
Advertisement

Kamal Haasan: బ్రేకింగ్.. బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పిన కమల్..

Kamal Haasan: బ్రేకింగ్.. బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పిన కమల్..
Advertisement

Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిగ్ బాస్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన చేశారు. మరికొన్ని రోజుల్లో తెలుగుతో పాటు తమిళ్ లో కూడా బిగ్ బాస్ మొదలుకానుంది. మొదటి సీజన్ నుంచి తమిళ్ లో కమల్ హాసనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బిగ్ బాస్ సీజన్స్ లో ఎన్నోసార్లు నెటిజన్స్ ఆయనపై దుమ్మెత్తిపోశారు. కానీ, కమల్ వాటినేమి పట్టించుకోకుండా బిగ్ బాస్ హౌస్ ను కూడా తన సొంత హౌస్ లానే చూసుకుంటూ వస్తున్నారు.

ఇక ఈసారి కూడా కమల్ నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కమల్ స్పందించాడు. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ” ప్రియమైన వీక్షకులారా.. 7 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మా ప్రయాణం నుండి నేను చిన్న విరామం తీసుకుంటున్నానని భారమైన హృదయంతో మీకు తెలియజేయాలనుకుంటున్నాను.

Advertisement

ముందస్తు సినిమా కమిట్‌మెంట్‌ల కారణంగా, నేను బిగ్ బాస్ తమిళ్ రాబోయే సీజన్‌ని హోస్ట్ చేయలేకపోతున్నాను. మీ ఇళ్లలో మిమ్మల్ని చేరుకోవడం నాకు గొప్ప అదృష్టం. మీరు మీ ప్రేమ మరియు ఆప్యాయతతో నన్ను ఆదరించారు. దీనికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిగ్ బాస్ తమిళ్‌ను భారతదేశంలోని ఉత్తమ టెలివిజన్ రియాలిటీ షోలలో ఒకటిగా మార్చడంలో మీ పోటీదారుల యొక్క ఉత్సాహభరితమైన మరియు ఉద్వేగభరితమైన మద్దతు ప్రధానమైనది.

ఇక్కడ నేను నిజాయితీగా నా భావాలను పంచుకున్నాను. ఎన్నో నేర్చుకున్నాను. ఈ అభ్యాస అనుభవానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. ఇప్పటివరకు నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ మరియు షో లోని పోటీదారులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరగా, నేను విజయ్ టీవీలోని అద్భుతమైన బృందానికి, అలాగే ఈ సంస్థను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ప్రతి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సీజన్ మరో విజయాన్ని సాధిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి కమల్ స్థానంలో ఈసారి హోస్ట్ గా ఎవరు రానున్నారో తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×