BigTV English

Bajaj Pulsar NS400Z: డ్యూక్‌కు పోటీగా పల్సర్ NS400Z లాంచ్.. ధర ఎంతంటే?

Bajaj Pulsar NS400Z: డ్యూక్‌కు పోటీగా పల్సర్ NS400Z లాంచ్.. ధర ఎంతంటే?

Buy Bajaj Pulsar NS400Z 2024 at Rs 1 Lakh 85 Thousand: బజాజ్ ఆటో భారత మార్కెట్‌లో అతిపెద్ద పల్సర్‌ను విడుదల చేసింది. కంపెనీ 2024 బజాజ్ పల్సర్ NS400Z ధరను రూ. 1.85 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించింది. ఇది ప్రస్తుతం ప్రారంభ ధర. ఈ టూవీలర్ NS200 నెక్స్ట్ వెర్షన్‌లా కనిపిస్తుంది. అయితే ఇందులో భిన్నమైన స్టైలిష్ లుక్‌ను చూడొచ్చు. స్ట్రీట్‌ఫైటర్ రెండు కొత్త  బోల్ట్ LED DRLలతో పాటు మధ్యలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో బోల్డ్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ ఉంటుంది.


కొత్త బజాజ్ పల్సర్ NS400Z డిజైన్ గురించి మాట్లాడితే బైక్ ఫస్ట్‌లుక్‌లోనే NS200 మాదిరిగానే కనిపిస్తుంది. అయితే  ఈ బైక్‌లో అనేక కొత్త లైన్లు ఉన్నాయి. స్ట్రీట్‌ఫైటర్ రెండు బోల్ట్ LED DRLలు ఉంటాయి. అలానే మధ్యలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో బోల్డ్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ చూడొచ్చు. రియర్‌వ్యూ మిర్రర్‌లు చాలా కొత్తగా కనిపిస్తాయి. అంతే కాకుండా ఇవి డిజైన్‌లో స్పోర్టీగా ఉన్నాయి. ఇవి చూడటానికి కొత్త KTM 250 డ్యూక్ నుండి తీసుకున్నట్లుగా కనిపిస్తాయి.

Also Read: డుకాటి నుంచి స్పోర్టీ బైక్.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు


ఫ్యూయల్ ట్యాంక్ నుండి సైడ్ ప్యానెల్స్, స్ప్లిట్ సీట్, రీస్టైల్ టెయిల్ సెక్షన్ వరకు చాలా షార్ప్ లైన్లు ఉన్నాయి. పల్సర్‌లో అదనంగా అప్‌డేట్ చేయబడిన NS400Z బాక్స్ సెక్షన్ స్వింగ్‌ఆర్మ్‌తో వస్తుంది. అయితే NS200 బాడీ పెరిమీటర్ ఫ్రేమ్ అప్‌డేట్ వెర్షన్‌గా కనిపిస్తుంది.

పల్సర్ NS400Z ఫీచర్లు, స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే బైక్ గోల్డ్-ఫినిష్ USD ఫ్రంట్ ఫోర్క్‌లను, వెనుకవైపు మోనోషాక్‌‌లు కూడా పొందుతుంది. బ్రేకింగ్ పనితీరు డ్యూయల్-ఛానల్ ABSతో పాటు రెండు డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. ఇంకా NS400Z‌లో ఒక LCD డిస్‌ప్లేని కూడా చూడొచ్చు. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంది.

Also Read: బిఎమ్‌డబ్ల్యూ నుంచి రంగులు మార్చే కారు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా?

ఇక ఇంజన్ విషయానికి వస్తే కొత్త పల్సర్ NS400Z‌లో పవర్ కోసం KTM 390 డ్యూక్, బజాజ్ డొమినార్ 400లో కనిపించే సుపరిచితమైన 373 cc ఇంజన్ ఉపయోగించారు. ఇది 39 bhp పవర్, 35 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది. NS400 గరిష్ట వేగం గంటకు 154 కి.మీ.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×