BigTV English

Ducati DesertX Rally Launch : డుకాటి నుంచి స్పోర్టీ బైక్.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు

Ducati DesertX Rally Launch : డుకాటి నుంచి స్పోర్టీ బైక్.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు

Ducati DesertX Rally Launch : భారత్‌లో డుకాటి తన రెగ్యులర్ డెసర్ట్‌ఎక్స్ ఆఫ్ రోడ్ ఫోకస్డ్ వెర్షన్ డెసర్ట్‌ఎక్స్ ర్యాలీని విడుదల చేసింది. దీని ఎక్స్‌‌షోరూమ్ ధర రూ. 23.7 లక్షలుగా ఉంది. ఈ ధరతో ఇప్పటికే దేశంలో అనేక కంపెనీలకు చెందిన స్టోర్టీ బైకులు ఉన్నాయి. సాధారణ DesertXతో పోలిస్తే Rally వెర్షన్‌లో ఎక్కువ ప్రీమియం సస్పెన్షన్ కాంపోనెంట్‌లు లభిస్తాయి. అందుకే దీని ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.


DesertX ఇప్పటికే శక్తివంతమైన బైక్‌గా ఉంది. అయితే Rally వెర్షన్‌లో మరింత అధునాతన సస్పెన్షన్ సెటప్ ఉంది. ఇది Kayaba నుండి తీసుకోబడింది. అదే కంపెనీ సాధారణ DesertX కోసం సస్పెన్షన్ కూడా చేస్తుంది. DesertX Rallyకి 48mm క్లోజ్డ్ కార్ట్రిడ్జ్ ఫోర్కులు ఉంటాయి. దీని పొడవు 250mm. అయితే సాధారణ DesertXలో ఫోర్క్ పొడవు 230mmగా ఉంటుంది.

Also Read : మారుతి నుంచి సరికొత్త స్విఫ్ట్.. బుకింగ్స్ ఓపెన్!


వెనుక షాక్ కూడా రీ మోడలింగ్ చేశారు. దీని పొడవు చాలా ఎక్కువగా ఉంటుంది. హై,లో -స్పీడ్ కంప్రెషన్ డంపింగ్‌తో ఇక్కడ పూర్తిగా అడ్జెస్ట్ చేయవచ్చు. ఈ కొత్త సస్పెన్షన్ కారణంగా DesertX Rally గ్రౌండ్ క్లియరెన్స్ 280mm కి పెరిగింది. సీట్ ఎత్తు కూడా 910mm కి పెరిగింది.

ఇది ట్యూబ్ టైర్లు, హై ఫ్రంట్ ఫెండర్, కార్బన్ ఫైబర్ సంప్ గార్డ్, అడ్జస్టబుల్ బ్రేక్, గేర్ పెడల్స్‌తో కూడిన స్పోక్ వీల్స్, పెద్ద 21-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. సాధారణ DesertX కంటే 4 లీటర్లు ఎక్కువ కెపాసిటి పొందుతుంది. దీంతో పాటు కాస్త బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. DesertX బరువు 210 కిలోలు కాగా ర్యాలీ వెర్షన్ 211 కిలోల బరువు ఉంటుంది.

Also Read : ల్యాప్‌టాప్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు.. మిస్ అవ్వకండి బ్రో!

గమనించదగ్గ విషయం ఏమిటంటే ర్యాలీ వెర్షన్‌లో అదే 937cc L-ట్విన్ ఇంజన్ ఉంది. ఇది 109bhp పవర్, 92Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మోడ్‌లు, ABS వంటి ఫీచర్లు కూడా సాధారణ DesertX‌లో ఉన్నట్లుగా ఉంటాయి.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×