BigTV English

BMW iX Flow-Colour Changing Car : బిఎమ్‌డబ్ల్యూ నుంచి రంగులు మార్చే కారు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా?

BMW iX Flow-Colour Changing Car : బిఎమ్‌డబ్ల్యూ నుంచి రంగులు మార్చే కారు.. దీని ప్రత్యేకత  ఏమిటో తెలుసా?

BMW iX Flow-Colour Changing Car : రంగు మారుతున్న కారు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? రెప్పపాటులో రంగు మార్చుకునే కారు. అవును అలాంటి కారు ఊహల్లో మాత్రమే కనిపిస్తాయి. అదే సమయంలో కార్ల తయారీ కంపెనీ BMW ఈ కారును ఊహించడమే కాకుండా తయారు చేయనుంది. ట్రిపుల్ షేడ్‌లో ఈ కారు కలర్ మార్చుతుంది. ఈ కారు కేవలం ఒక స్విచ్‌లో దాని కలర్‌ను వైట్ నుంచి బ్లాక్, బ్లాక్ నుంచి వైట్ కలర్‌లోకి మారగలదు. ఈ కారు కలర్ కూడా కూడా గ్రే కలర్‌లో ఉంటుంది. కంపెనీ ఈ కారుకు బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో‌గా వెల్లడించింది.


BMW కలర్ చేంజ్ అయే కారును తయారు చేస్తుంది. దీని కలర్ రెప్పపాటులో మారుతుంది. ఈ కారుపై ఇ ఇంక్ కోటింగ్ ఉంటుంది. ఈ E ఇంక్ అనేక మిలియన్ మైక్రో క్యాప్సూల్స్‌తో రూపొందించబడింది. ఈ క్యాప్సూల్స్ పరిమాణం చాలా చిన్నది. ఈ క్యాప్సూల్స్ మన జుట్టుకు సమానంగా ఉంటాయి. కారు కలర్ మార్చడానికి పవర్ అవసరం అవుతుంది.

ఈ బిఎమ్‌డబ్ల్యూ కారులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడిన వెంటనే కారు కలర్ మారిపోతుంది. మీరు ఎంచుకునే సెట్టింగ్‌ల ఆధారంగా కారులోని బ్లాక్ లేదా వైట్ లిక్విడ్ మైక్రో క్యాప్సూల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ను ఎంచుకుంటుంది. దీంతో కారు మీరు కోరుకున్న షేడ్‌లోకి మారుతుంది. ఈ-పేపర్ పార్టులను కారులో అమర్చడం వల్ల వాహనం బాడీలో ఎఫోక్ట్ కనిపిస్తుంది.


Also Read : మారుతి నుంచి సరికొత్త స్విఫ్ట్.. బుకింగ్స్ ఓపెన్!

ఈ BMW కారు బయట కలర్‌లో మార్పులు చేయడం వల్ల దాని లోపలి భాగం కూడా బెటర్‌గా కనిపిస్తుంది. దీనితో వాహనం సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ వాహనం సూర్యకాంతి ప్రతిబింబం కారణంగా మెరుస్తూ కనిపిస్తుంది. BMW ఈ కారు ఉత్పత్తిని ఇప్పుడే ప్రకటించింది. కంపెనీ ఇంకా ఈ కారు తయారీని ప్రారంభించలేదు.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×