Health Insurance Riders: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు తట్టుకోవడానికి, మెరుగైన వైద్యం పొందేందుకు.. ఆరోగ్య బీమా ఉండాలని ఎక్స్ ఫర్ట్స్ సూచిస్తున్నారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని యాడ్ ఆన్స్ జోడిస్తే హాస్పిటల్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చు. మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు.
1. నాన్-మెడికల్ ఐటమ్స్
సాధారణంగా హెల్త్ పాలసీల్లో గ్లౌవ్స్, మాస్కులు, సిరంజీలు, బ్యాండేజ్ ల వంటి నాన్-మెడికల్ ఐటమ్స్ ఖర్చును కవర్ చేయరు. ఈ ఖర్చును పాలసీ హోల్డర్ చెల్లించాల్సి ఉంటుంది. ఇవి బిల్లు మొత్తంలో 10-15 శాతం వరకు ఉంటాయి. అందుకే పాలసీ తీసుకున్న సమయంలో నాన్-మెడికల్ కవరేజీ ఇచ్చే యాడ్ ఆన్ తీసుకుంటే.. వీటి ఖర్చునూ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది.
2. రూము రెంట్ మినహాయింపు
చాలా పాలసీల్లో రూము రెంట్ లిమిట్ ఉంటుంది. పాలసీ మొత్తంలో 1 శాతం మాత్రమే రూము రెంట్ గా కంపెనీలు చెల్లిస్తాయి. ఈ లిమిట్ కంటే ఎక్కువ బిల్లు అయితే.. పాలసీ హోల్డర్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ‘ఏనీ రూమ్’, ‘రూమ్ రెంట్ వేవర్’ రైడర్ తీసుకోవాలి.
3. ఓపీడీ కవర్
హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీలో ఆసుపత్రిలో అడ్మిట్ అయి 24 గంటల పాటు వైద్యం చేయించుకోవాలి. కానీ ఏదైనా ఆరోగ్య సమస్యతో డాక్టర్ ను సంప్రదించినప్పుడు, మెడిసిన్, బ్లేడ్ టెస్టులు, స్కానింగ్ ఖర్చులకు హెల్త్ పాలసీలో కవర్ అవ్వదు. కానీ ఓపీడీ కవర్ రైడర్ తీసుకుంటే డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, మెడికల్ టెస్టులు, మెడిసిన్ బిల్లులు కవర్ అవుతాయి. చిన్న చిన్న ఖర్చులు తగ్గి డబ్బు ఆదా చేసుకోవచ్చు.
4. క్రిటికల్ ఇల్నెస్ కవర్
క్యాన్సర్, హార్ట్ ఎటాక్, కిడ్నా ఫెల్యూర్ వంటి వ్యాధులు వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటల్ బిల్లు మాత్రమే చెల్లిస్తాయి. కానీ క్రిటికల్ ఇల్నెస్ కవర్ రైడర్ తీసుకుంటే.. ఇలాంటి పెద్ద వ్యాధులకు వైద్యం చేయించుకున్న తర్వాత ఫైనాన్సియల్ సపోర్ట్ గా భారీ మొత్తంలో అమౌంట్ ఇస్తారు. ఈ డబ్బును మీరు కుటుంబ ఖర్చులు, ట్రీట్మెంట్, లోన్ వంటి ఇతర ఖర్చులకు చెల్లించవచ్చు.
5. మెటర్నిటీ కవర్
చాలా పాలసీల్లో మెటర్నిటీ, డెలివరీ ఖర్చులు కవర్ చేయరు. మెటర్నిటీ కవర్ రైడర్ తీసుకుంటే.. డెలివరీ ఖర్చులు, పిల్లల ఆసుపత్రుల ఖర్చులు, వ్యాక్సినేషన్ బిల్లులు కూడా కవర్ అవుతాయి. కాస్త ప్రీమియం ఎక్కువైనా.. పెళ్లైన జంటలు ఈ రైడర్ తీసుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు.
Also Read:హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు చెక్ చేయండి
6. రిస్టోరేషన్ ప్రయోజనాలు
ఈ రైడర్ తీసుకుంటే.. పాలసీ సంవత్సరంలో ఏదైనా వ్యాధి వల్ల మొత్తం సమ్ అస్యూర్డ్ పూర్తిగా ఖర్చయితే, ఈ రైడర్ మీ కవరేజీని మళ్లీ 100 శాతం ఆటోమేటిక్ గా రీస్టోర్ చేస్తుంది. అంటే రూ.5 లక్షల పాలసీ తీసుకున్నారు, ఏదైనా చికిత్సకు రూ.5 లక్షల బిల్లు వచ్చింది. మళ్లీ మీకు రూ.5 లక్షలు రిస్టోర్ అవ్వడానికి ఈ రైడర్ ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ఫ్యామిలీ ప్లోటర్ పాలసీలు, తరచూ వైద్య చికిత్స అవసరమైన వారికి ఉపయోగపడుతుంది.
7. గ్లోబల్ కవర్
క్యాన్సర్ లేదా హార్ట్ సర్జరీ లేదా ఏదైనా పెద్ద వ్యాధికి మంచి ట్రీట్మెంట్ వేరే దేశాల్లో అందుబాటులో ఉండవచ్చు. మీరు హెల్త్ పాలసీలో గ్లోబల్ కవరేజీ రైడర్ తీసుకుంటే అంతర్జాతీయ ఆసుపత్రుల్లో కూడా చికిత్స చేయించుకోవచ్చు. ఈ ఖర్చును హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి.
హెల్త్ పాలసీ తీసుకున్నప్పుడు ఈ రైడర్ లను తీసుకుంటే.. మీ జేబుపై భారం పడకుండా బెస్ట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందవచ్చు.