E-Paper
Advertisement

రైతన్నలకు పిడుగులాంటి వార్త.. మళ్లీ పెరిగిన ధరలు..?

రైతన్నలకు పిడుగులాంటి వార్త.. మళ్లీ పెరిగిన ధరలు..?
Advertisement

Fertilizer Prices: స్వేచ్చ బ్యూరో: ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నపై ఎరువుల ధరల పెరుగుదల ఏటా ఉంటోంది.ఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగు సార్లు పెంచడంతో రానున్న వర్షాకాలంలో పంటల సాగు మరింత భారం కానుంది. గత వాహన కాలం సీజన్ లో బస్తాకు 50 ఈ యాసంగి సీజన్ లో రూ. 50 చొప్పున రెండుసార్లు కలిపి 100 పెంచారు. తాజాగా నాలుగోసారి బస్తాకు రూ 225 నుంచి 300 పెంచడంతో రానున్న సీజన్ లో రైతులపై ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. కాంప్లెక్స్ ఎరువులు వినియోగం జిల్లాలో వివిధ పంటలకు అధికంగా ఉంటుంది.

రైతులపై భారం

గ్రామాలలో పశుసంపద తగ్గిపోవడం, సేంద్రియ ఎరువులు లేకపోవడంతో పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతోంది.జిల్లాలో వానకాలం సాధారణ సాగు 3.92 లక్షల ఎకరాలు వివిధ పంటల్లో రూపంలో ఉంటుంది.జిల్లాలో ప్రధానంగా వరి,పత్తి,మిర్చి,మొక్కజొన్న, పొగాకు ఇతర ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. రెండు సీజన్లకు కలిపి ఎరువుల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో రైతులకు కోట్లలో భారం పడనుంది.

Advertisement

Also read: రాత్రిపూట మామిడి పండు తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి!

పెరిగిన ధరలతో రైతులకు కష్టం

పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానకాలం సాగు జిల్లాల్లో ప్రధానంగా వరి,ప్రతి, మిర్చి,జొన్న, పొగాకు,మొక్కజొన్న ఇతర కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత రబీలో మొక్కజొన్న అలసంద, పెసర,వేరుశనగ, కూరగాయలు సాగు చేసి రైతులు కాంప్లెక్స్ ఎరువుల కోసం వెళితే పెరిగిన ఎరువుల ధరల బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు అన్ని రకాల కాంప్లెక్స్ పెంచడంతో ఈసారి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు సమాచారం ఉందని ఫర్టిలైజర్ షాప్ యజమానులు చెబుతున్నారు.

Advertisement

Also Read: ఆస్తికోసం చిత్రహింసలు.. రెండుసార్లు అబార్షన్.. కార్తీకదీపం సుమిత్ర కన్నీటి కష్టాలు!

ఎరువుల ధరలు ఇలా

ఎరువు. పాత కొత్త పెంపు

191919 2075 2300 225
20:20:13 1500 1800 300
1435 14 2175. 2250. 75
12:32:15. 2025 2250. 225
పొటాస్. 1850 1975 125
16:16:16 1675 2050 375
24:24:0 2000 2300 300
10:23:26 1950:2025 75
14:35:14 2150 2350 200
16:20:13 1400 1750 350

 

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×