E-Paper
Advertisement

Best Bank For Home Loan:హోమ్ లోన్ తీసుకోవడానికి ఈ బ్యాంక్ బెస్ట్ ? ఈఎంఐ కూడా చాలా తక్కువ

Best Bank For Home Loan:హోమ్ లోన్ తీసుకోవడానికి ఈ బ్యాంక్  బెస్ట్ ? ఈఎంఐ కూడా చాలా తక్కువ
Advertisement

Best Bank For Home Loan: ఇల్లు కట్టుకోవడం పెద్ద కల, కానీ పెరిగిపోయిన ఖర్చుల్లో ఒక్కసారిగా అంత మొత్తం సిద్ధం కాకపోవడంతో బ్యాంక్ హోమ్ లోన్ తప్పదనే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఎక్కువ వడ్డీ ఉన్న చోట లోన్ తీసుకుంటే మాత్రం భారం పెరుగుతుంది. తక్కువ వడ్డీ ఉన్న బ్యాంక్‌లో తీసుకుంటే అదే లోన్ సులభంగా పూర్తవుతుంది. సాధారణంగా ఎస్‌బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తక్కువ వడ్డీతో ముందుంటే.. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ సేవ వేగంగా ఉన్నా వడ్డీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చివరికి మీరు పొందే వడ్డీ శాతం మీ సిబిల్ స్కోరు, ఆదాయం, రుణ పరిమాణంపై ఆధారపడి నిర్ణయిస్తారు. మరి ఏ బ్యాంక్‌లో హోమ్‌లోన్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్‌బిఐలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.50శాతం:

Advertisement

ముందుగా ఎస్‌బిఐలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.50శాతం వద్ద మొదలవుతుంది. అంటే మీ స్కోరు 800 దగ్గరగా ఉంటే లేదా మంచి ఉద్యోగ స్టెబిలిటీతో ఉంటే ఈ తక్కువ రేటు వర్తించే అవకాశం ఉంటుంది. స్కోరు తగ్గితే 8శాతం దాటే అవకాశం ఉంది. రుణం 30 లక్షలు లోపల ఉంటే సాధారణంగా రేట్లు కొంచెం తక్కువగా ఉంటాయి. పెద్ద రుణం తీసుకున్నప్పుడు బ్యాంకులు రిస్క్ ఎక్కువగా భావిస్తాయి కాబట్టి రేటు ఒక్కోసారి 0.10శాతం–0.25శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్‌బిఐలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, వాటిలో ఛార్జీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈఎంఐ మీరు చెల్లించాల్సిన భారం కొంచెం తక్కువగానే ఉంటుంది.

హెచ్‌డిఎఫ్‌సి లోన్‌ సాధారణంగా 8.20శాతం:

Advertisement

హెచ్‌డిఎఫ్‌సి లోన్‌ విషయానికి వస్తే రేటు సాధారణంగా 8.20శాతం దగ్గర ప్రారంభమవుతుంది. కానీ ఇందులో సేవలు చాలా వేగంగా ఉంటుంది. మీ రుణం మొత్తం 40–50 లక్షలు ఉంటే ఈ బ్యాంక్‌పై ప్రజల నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పేపర్‌ వర్క్ తక్కువగా ఉంటుంది, ఈఎంఐ లెక్కలు క్లియర్‌గా చెబుతారు. కానీ వడ్డీ మాత్రం ఎస్‌బిఐ కంటే ఎక్కువగానే ఉంటుంది. 50 లక్షల పైగా రుణం తీసుకునేవారికి హెచ్‌డి‌ఎఫ్‌సి కొన్ని సందర్భాల్లో ప్రత్యేక ప్లాన్లు ఇస్తుంది. ఉదాహరణకు, మొదటి కొన్ని సంవత్సరాలు తక్కువ ఈఎంఐతో వెళ్లే ఆప్షన్, తర్వాత ఈఎంఐ పెరిగే మోడల్ వంటి ప్లాన్లు ఉంటాయి. మొత్తం మీద పెద్ద రుణాల్లో సేవల పరంగా హెచ్‌డి‌ఎఫ్‌సి బెటర్ అని చెప్పొచ్చు.

ఐసిఐసిఐలో వడ్డీ సాధారణంగా 8.70శాతం:

ఐసిఐసిఐలో వడ్డీ సాధారణంగా 8.70శాతం పైగా మొదలవుతుంది. సిబిల్ స్కోరు మంచిగా ఉంటే 8.50శాతం కూడా వచ్చే అవకాశం ఉంది. ఐసిఐసిఐ ప్రధానంగా జీతం ఆధారంగా పనిచేసే వారు, ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారికి వేగంగా రుణం ఇస్తుంది. పీఎంఎవై వంటి ప్రభుత్వ పథకాలతో కలిపి తీసుకునే వారికి ఈ బ్యాంక్ ప్రయోజనం ఉంటుంది. కానీ రుణం 20–30 లక్షల మధ్యలో ఉన్నప్పుడు పెద్దగా ప్రత్యేక తగ్గింపులు ఉండదు. రుణం 50 లక్షలు దాటితే మాత్రమే కొన్నిసార్లు రేటులో చిన్న తగ్గింపు ఇస్తారు, కానీ అది ఎస్‌బిఐ లాంటి తగ్గింపు మాత్రం ఇచ్చే ఛాన్స్ ఉండదు.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కువగా 7.45శాతం:

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కువగా 7.45శాతం నుంచి రుణం ఇస్తున్నట్టు సమాచారం ఉంది. ఈ బ్యాంక్‌‌లో ప్రయోజనం ఏమిటంటే, కొన్నిసార్లు పెద్ద రుణం మొత్తానికి కూడా అదే తక్కువ రేటు వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు 25 లక్షలు తీసుకున్నా, 75 లక్షలు తీసుకున్నా, రేటు అంతగా మారకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనిపించే అరుదైన ప్రయోజనం. ఈఎంఐ లెక్కలు కూడా ఇక్కడ స్పష్టంగా చెబుతారు. ఎక్కువ నెలలు తీసుకునే రుణాలకు ఈ బ్యాంక్ మంచి ఎంపిక.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 8.10శాతం రేటు:

మీ సిబిల్ స్కోరు 800కు దగ్గరగా ఉంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి బ్యాంకులు 8.10శాతం రేటు కూడా ఇస్తాయి. కానీ ఈ ప్రయోజనం మీ క్రెడిట్ స్కోర్ల వల్లే లభిస్తుంది. రుణం 20 లక్షలకంటే తక్కువగా ఉంటే స్కోరు ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ 40 లక్షల పైగా రుణం తీసుకుంటే స్కోరు చాలా కీలకం అవుతుంది. మంచి స్కోరు ఉన్నవారికి చాలా తక్కువ రేటు ఇస్తారు.

Also Read: ఈ పోస్టాఫీస్ పథకాలతో అధిక రాబడి.. బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ

లోక్ కోసం రెండు అంశాలు ముఖ్యం:

ఎన్ని లక్షలు తీసుకుంటే బెనిఫిట్ అంటే, చిన్న రుణాల్లో, అంటే 15–25 లక్షల మధ్యలో సాధారణ రేటు పడుతుంది. చాలా బ్యాంకులు ఈ రేంజ్‌లో ప్రత్యేక తగ్గింపులు పెట్టరు. కానీ 40 లక్షలు దాటిన రుణాలకు, ముఖ్యంగా 60–80 లక్షల రుణాల వరకు వెళ్లినప్పుడు కొన్నిసార్లు రేటులో తక్కువ తగ్గింపులు ఇస్తారు. అయితే ఈ తగ్గింపులు ఎక్కువగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకులు రుణ మొత్తం ఆధారంగా తక్కువ రేటు ఇవ్వడం చాలా అరుదు. మీకు సరైన బ్యాంక్‌ ఏదో అర్థం కావాలంటే రెండు అంశాలు ముఖ్యమైనవి, అదే మీ సిబిల్ స్కోరు, మీకు కావలసిన లోన్‌ మొత్తం.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×