E-Paper
Advertisement

Postal Savings Schemes: ఈ పోస్టాఫీస్ పథకాలతో అధిక రాబడి.. బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ

Postal Savings Schemes: ఈ పోస్టాఫీస్ పథకాలతో అధిక రాబడి.. బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ
Advertisement

Postal Savings Schemes: ఈ ఏడాది చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో కొత్త ఎఫ్డీ రేట్లతో రాబడి కూడా తగ్గనుంది. ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న వారికి పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ మంచి ఆదాయాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. పోస్టాఫీస్ పథకాలు అనేక ప్రముఖ బ్యాంకుల ఎఫ్డీ రేట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు అనేక ప్రముఖ బ్యాంకులలో ఎఫ్డీ రేట్లు 6%-7% పరిధిలో ఉంటాయి. అయితే 7% కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్న పోస్టాఫీస్ పొదుపు పథకాలు ఉన్నాయి. ఈ పథకాలలో చాలా వరకు పాత పన్ను విధానంలో ఉండడంతో డిపాజిట్లపై ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

బ్యాంకుల ఎఫ్డీల కంటే అధిక వడ్డీ రేట్లు

పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అనేక ప్రముఖ బ్యాంకుల ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడిని అందిస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది. ప్రస్తుతం 7%, అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న పథకాల గురించి తెలుసుకుందాం.

  • 2 సంవత్సరాల డిపాజిట్- 7.0%(రూ.10,000లకు వార్షిక వడ్డీ రూ.719)
  • 3 సంవత్సరాల డిపాజిట్ – 7.1%(రూ.10,000 కు వార్షిక వడ్డీ రూ.729)
  • 5 సంవత్సరాల డిపాజిట్- 7.5%(రూ.10,000 కు వార్షిక వడ్డీ రూ.771)
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2%(రూ.10,000 కు త్రైమాసిక వడ్డీ రూ.205)
  • నెలవారీ ఆదాయ ఖాతా -7.4%(రూ.10,000 కు నెలవారీ వడ్డీ రూ.62)
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ -7.7%(మెచ్యూరిటీ విలువ రూ.10,000లకు రూ.14,490)
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం- 7.10% వడ్డీ
  • కిసాన్ వికాస్ పత్రం- 7.5% (115 నెలల్లో మెచ్యూరిటీ)
  • మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికెట్- 7.5% (మెచ్యూరిటీ విలువ రూ.10,000కి రూ.11,602)
  • సుకన్య సమృద్ధి ఖాతా పథకం- 8.20 శాతం వడ్డీ
Advertisement

అయితే చాలా తక్కువ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు పోస్టాఫీస్ కు తగిన వడ్డీ పథకాలను అమలు చేస్తున్నాయి.

Also Read: SBI mCash: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఇలా డబ్బు పంపలేరు

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×