E-Paper
Advertisement

Black Friday 2025: బ్లాక్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనకున్న చరిత్ర ఏమిటి?

Black Friday 2025: బ్లాక్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనకున్న చరిత్ర ఏమిటి?
Advertisement

Black Friday 2025: ప్రతి ఏటా నవంబరు చివరి వారంలో వచ్చే శుక్రవారాన్నే ‘బ్లాక్ ఫ్రైడే’ అంటారు. అమెరికాలో అయితే.. బ్లాక్ ‌ఫ్రైడే ముందు రోజును ‘థాంక్స్ గివింగ్ డే’ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఏడాదిలో అతిపెద్ద షాపింగ్ డేగా ఈ బ్లాక్ ఫ్రైడేను చెబుతుంటారు. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆఫర్స్ కోసం ఎదురు చూస్తారు. అయితే, ఒకప్పుడు కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ రాన్రాను భారతదేశంలోనూ అమలు చేయడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌ ఫ్రైడే అనే పదం ఎలా పుట్టింది? అమెరికాలో పురుడుపోసుకున్న ఈ బ్లాక్ ఫ్రైడే అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాప్తి చెందింది? నిజంగానే అనుకున్నంత డిస్కౌంట్స్ ఈ సేల్‌లో లభిస్తాయా.. వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలా పుట్టిందంటే..?

1960లో అమెరికాలోని ఫిలడెల్ఫియా అనే సిటీలో ఈ ‘బ్లాక్ ఫ్రైడే’ అనే పదం పుట్టింది. అక్కడ Thanksgiving Day తర్వాత మరుసటి రోజును Black Friday అని పిలుస్తారు. ఈ రోజున చాలామంది కార్మికులకు సెలవు దినంగా మారింది. దీంతో షాపింగ్ చేయడానికి వారికి సమయం లభించేది. ఈ అవకాశాన్ని అక్కడి ప్రధాన రిటైల్‌దారులు వినియోగించుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రజలకు ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లను ఇవ్వడం ప్రారంభించారు. అలా ప్రతి ఏటా థ్యాంక్స్ గివింగ్ తర్వాత ఈ భారీ సేల్‌ మొదలైంది. ఇక అప్పటి నుండి థ్యాంక్స్ గివింగ్ తర్వాత వచ్చే శుక్రవారం రోజున భారీ ఆఫర్లు, డిస్కౌంట్‌లతో సంప్రదాయంగా దీనిని పాటించడం మొదలుపెట్టారు. క్రమంగా ఇది యూకే, కెనడా, భారతదేశం వంటి ఇతర దేశాల్లోనూ ప్రారంభమైంది.

భారీగా క్షీణించిన గోల్డ్ రేట్స్:

Advertisement

ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ ఫ్రైడేను పలుచోట్ల ప్రత్యేక సందర్భాల్లో ఈ సంప్రదాయన్ని వ్యాపారులు వాడుతుంటారు. ఎక్కువ వినియోగాన్ని ప్రోత్సహించే ఈ సేల్‌ ప్రమోషన్‌ను ఇప్పటికీ పలువురు నిందిస్తుంటారు. 1869 నాటి శుక్రవారం రోజు అమెరికా బంగారం మార్కెట్‌ భారీగా పతనమైందట. ఇలా న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో బంగారం మార్కెట్‌ను కార్నర్‌ చేయడానికి ప్రయత్నించడంతో బంగారం ధరలు భారీగా క్షీణించాయి. ఆ ప్రభావం అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థపై కొన్నేళ్లు ప్రభావం చూపింది. అలా మార్కెట్‌ క్రాష్‌ అయిన రోజును ‘బ్లాక్‌ ఫ్రైడే’ లేదా చీకటి రోజుగా ఆర్థిక విశ్లేషకులు పేర్కొన్నారు.

పోలీసులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్:

బ్లాక్‌ ఫ్రైడే విషయంలో మరో వాదన కూడా ఉంది. అదేంటంటే.. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో 1960లో థ్యాంక్స్‌ గివింగ్‌ డే తర్వాతి రోజు రోడ్లన్నీ రద్దీగా మారాయట. ఆ భారీ ట్రాఫిక్‌ జామ్‌ అక్కడి పోలీసులకు చుక్కలు చూపించడంతో ఆ రోజునూ వారు బ్లాక్ ఫ్రైడేగా అభివర్ణించారు. అలాగే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ బ్లాక్‌ ప్రకారం.. 1610లోనే ఈ పదం పరిశోధకుల కంట పడిందట. దీని ప్రకారం చూసుకుంటే.. బ్లాక్‌ ఫ్రైడేకు అమ్మకాలకు సంబంధం లేదు. నెలలో ఏ శుక్రవారం రోజైనా కాలం పరీక్ష పెడితే.. ఆ రోజును బ్లాక్ ఫ్రైడేగా వాడతారని పేర్కొంది. అలా అమెరికాలో పుట్టిన బ్లాక్‌ ఫ్రైడే పదాన్ని మన స్టాక్‌ మార్కెట్‌లు భారీ నష్టాలు చవిచూసినప్పుడు వాడుతుంటాయి.

నిజంగానే ఆఫర్స్ ఉంటాయా?

Advertisement

బ్లాక్ ఫ్రైడే రోజున నిజంగానే ఆఫర్ ఉంటాయా అనే విషయాన్ని పరిశీలిస్తే.. బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రకటించే ఏడు ఆఫర్లతో ఒకటి మాత్రమే నిజమైందని బ్రెటర్ వినియోగదారుల బృందం 2022లో తెలిపింది. ఈ నేపథ్యంలో బ్లాక్‌ఫ్రైడే ఆఫర్స్ కంటే క్రిస్మస్ షాపింగ్ ఉత్తమం అని తెలిపారు. కొన్ని దేశాల్లో అయితే.. బ్లాక్‌ఫ్రైడే వస్తోందని ముందుగానే ధరలను పెంచేసి.. ఆ రోజు తగ్గించినట్లు ప్రకటిస్తాయి. దీనిని కొందరు ‘బ్లాక్‌ ఫ్రాడ్’ అని విమర్శిస్తుంటారు. అందుకే బ్లాక్‌ఫ్రైడే సమయంలో ఆఫర్స్ ఉపయోగించే ఉత్పత్తులను కొనాలని చూసేవారు తప్పకుండా ఆఫర్ల గురించి నిజనిజాలు పరిశీలించాలి. అలాగే ఇదే అదనుగా చాలామంది స్కామర్లు మోసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి బ్లాక్ ఫ్రైడే రోజున షాపింగ్ చేసే వినియోగదారులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×