Ram – Bhagyashri : టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా.. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు.. మొదటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ నిన్న గ్రాండ్గా థియేటర్లలోకి రిలీజ్ అయింది. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మంచి టాక్ని సొంతం చేసుకుంది.. ఈ క్రమంలో ఈ మూవీ సక్సెస్ మీట్ ని చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ మహేష్ బాబు.పి, ప్రొడ్యూసర్ రవి శంకర్, ఉపేంద్ర వచ్చారు. కానీ, రామ్ పోతినేని, బాగ్యశ్రీ బోర్సె మాత్రం రాలేదు..వాళ్లు ఈ మీట్ కు ఎందుకు రాలేదో అన్న విషయం నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం..
గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలు లేక సతమతమవుతున్న హీరో రామ్ పోతినేనికి ఈ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. నిన్న థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో కలెక్షన్లు కూడా భారీగానే వసూల్ అవుతున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రా కింగ్ తాలూకా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ మీట్ కు కేవలం డైరెక్టర్ మహేష్, కన్నడ నటుడు ఉపేంద్ర, నిర్మాత రవి శంకర్ హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే ఆ సక్సెస్ మీట్ కి హీరో, హీరోయిన్లు తప్పకుండా వచ్చి తమ సక్సెస్ ని అభిమానులతో పంచుకుంటారు.. కానీ ఈ సినిమా సక్సెస్ మీట్ కు హీరో, హీరోయిన్లు డుమ్మా కొట్టారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. వాళ్ళిద్దరూ కూడా అమెరికా లో సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లారని నిర్మాత అన్నారు.. పొంతన లేని సమాధానం అని కామెంట్స్ వినిపిస్తున్నాయి
ఇక్కడ సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యకుండా అక్కడికి ఎందుకు వెళ్లారు..? ఇన్నిరోజులు సినిమా షూటింగ్ కోసం బిజీగా ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఎంజాయ్ చేస్తున్నారేమో? కొంచెమైన గ్యాప్ ఇవ్వాలి.. సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యాలిగా అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సక్సెస్ మీట్ కి హీరో, హీరోయిన్లు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది.. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలపై హీరో రామ్ స్పందిస్తారేమో చూడాలి..
Also Read : అయ్యప్పమాలలో హీరో వరుణ్ సందేశ్… పాట పడాడు.. గూస్ బంప్స్ అంతే
ఆరేళ్లుగా హిట్ లేకపోవడంతో ఈ సినిమాపై రామ్ పోతినేని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. అందుకు తగ్గ విధంగా బాగా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ ఫలితం దక్కిందని టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆంధ్రా కింగ్ తాలూకాకు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి పర్ఫార్మెన్స్ చేసింది. రిలీజ్‌కు రెండు రోజుల ముందే యూఎస్ఏలో 40 వేల డాలర్లు చేరుకోవడం మామూలు విషయం కాదు. అలాగే ఇండియాలో మొదటి రోజు కలెక్షన్స్ కూడా పర్వాలేదనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 7 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. మౌత్ టాక్ బాగానే రావడంతో ఈ వీక్ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది…