BigTV English

Offers on Hero Vida Bike: హీరో విడా స్కూటీపై క్రేజీ ఆఫర్‌.. రూ. 27,000 విలువైన ఫ్రీ సర్వీసెస్!

Offers on Hero Vida Bike: హీరో విడా స్కూటీపై క్రేజీ ఆఫర్‌.. రూ. 27,000 విలువైన ఫ్రీ సర్వీసెస్!
Hero Vida EV Price and Features
Hero Vida EV Price and Features

Crazy Offer on Hero Vida Electric Bike: ఆటో మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈ తరుణంలో కంపెనీలు కొనుగోలుదారులకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. బైక్‌లు, కార్లపై ఊహించని ఆఫర్లు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫేమ్ 2 సబ్సిడీ మార్చి 31వ తేదీతో ముడియనుంది. ఈ క్రమంలో మోటార్ కంపెనీలు సేల్స్ రాబట్టుకునేందుకు ఆఫర్ల జాతర నడిపిస్తున్నాయి. తాజాగా హీరో విడా కంపెనీ తన స్కూటీపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏకంగా ఐదేళ్ల వ్యాలిడిటీ ఇస్తూ సూపర్ ప్యాకెజ్ ఇస్తోంది. హీరో విడా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటీ ఉన్న వాహనదారులు కంపెనీ ప్రకటించిన అడ్వాంటేజ్ ప్యాకేజీకి అర్హులని పేర్కొంది. ఈ అడ్వాంటేజ్ ప్యాకేజీలో రూ. 27,000 విలువైన ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇందులో సర్వీస్, స్కూటీ మెయింటేనెన్స్ వంటివి వాహనదారులకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ప్యాకేజీకి లిమిట్ ను కూడా కంపెనీ ప్రకటించింది. ఏప్రిల్ 31, 2024 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.


హీరో విడా స్కూటర్లలో ఉండే రెండు బ్యాటరీలపై కంపెనీ 5 సంవత్సరాల పాటు ఎక్స్ టెండెడ్ వారంటీని ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా దాదాపు 2000 ఫాస్టెస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఫ్రీ యాక్సెస్ కింద ఈ ప్యాకేజీలో చేర్చింది. అంతేకాదు, ఈ విడా వర్క్ షాప్ లో ఫ్రీ సర్వీస్, ఫ్రీ వర్క్ అందిస్తుంది. అంతేకాదు, వారంలో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చేసింది. ముఖ్యంగా ఈ ప్యాకేజీలో వాహన భద్రత, సౌలభ్యం వంటివి అందిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను మై విడా అనే మొబైల్ యాప్ లో అందుబాటులో ఉంచింది.

ఎలక్ట్రిక్ వాహనాలపై హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ (ఈఎంబీయూ) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ స్వదేశ్ శ్రీవాస్తవ కీలక వివరణ ఇచ్చారు. పెట్రోల్ తో నడిచే వాహనాలను ఉపయోగించిన వారు ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారితే వాటి మెయింటెనెన్స్, పనితీరులో సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే హీరో విడా వాడే వినియోగదారులకు ఈ ప్యాకేజీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో కేంద్రీకృతమైన కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడమే తమ ఉద్దేశ్యం అని తెలిపారు.


Also Read: High Milage Electric Scooters: ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. ఇదిగో లిస్ట్..!

హీరో విడా ధర..

హీరో మోటో కార్ప్ విడుదల చేసిన హీరో విడా అసలు ధర రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.45 లక్షల వరకు అందుబాటులో ఉంది. దీనిని వీ1 ప్లస్, వీ1 ప్రో కింద కొనుగోలు చేయవచ్చు. హీరో విడా 11 ప్లస్ మోడల్ లో 3.44 KWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక హీరో విడా వీ1 ప్రో వెర్షన్ ను పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×