BigTV English
Advertisement

Arvind Kejriwal: జైలు నుంచే సీఎంగా కేజ్రీవాల్ పాలన.. తొలి ఆదేశాలు జారీ!

Arvind Kejriwal: జైలు నుంచే సీఎంగా కేజ్రీవాల్ పాలన.. తొలి ఆదేశాలు జారీ!
Arvind Kejriwal
Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆ రాష్ట్ర సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జైలు నుంచి సీఎం హోదాలో తొలిసారి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జైలు నుంచే ఆయన పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపాయి. ఈ మేరకు నేడు ఈడీ లాకప్ నుంచే తన మొదటి ఆర్డర్ ను రిలీజ్ చేశారు. రాజధానిలో నీటి సరఫరా గురించి ఆ రాష్ట్ర జలమంత్రిత్వ శాఖ మంత్రి అతిశీకి ఆయన నోట్ ద్వారా ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


ఈ మేరకు ఈ నోట్ గురించి అతిశీ మీడియాకు వెల్లడించనున్నారు. కాగా, ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న సీఎం కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా గురువారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కేజ్రీవాల్ కు కోర్టు వారం రోజుల పాటు కస్టడీ విధించింది. ఈ క్రమంలో సీఎంను అరెస్టు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సీఎంను అరెస్టు చేయాలని బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ కక్ష్యతోనే ఈడీ పేరుతో గేమ్స్ ఆడుతుందని మండిపడుతున్నారు.

తమ సీఎంను అరెస్టు చేసినా ఆయన జైలు నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆప్ నేతలు స్ఫష్టం చేస్తున్నారు. కానీ జైలు నుంచి పాలన సాధ్యం కాదని ఢిల్లీ సీనియర్ లాయర్ సునీల్ గుప్తా అన్నారు. జైలు నుంచి పాలన చేయడం సులువు కాదని అన్నారు. జైలు నిబంధనల ప్రకారం ఏ వ్యక్తికి అయిన వారంలో రెండు సార్లు మాత్రమే తన స్నేహితులుచ బంధువులు, కుటుంబసభ్యులను కలిసే అవకాశం ఉంటుందని… ఈ నేపథ్యంలో జైలు నుంచి పాలన చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు.


ఒకవేళ కేజ్రీవాల్ హౌస్ అరెస్ట్ అయితేనే పాలన సాధ్యం అయ్యేదని అన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అరెస్టు చేసింది. కస్టడీ ముగియడంతో మరోసారి కోర్టులో హాజరుపరించింది. ఈ క్రమంలో మరో మూడు రోజుల పాటు కస్టడీని పొడిగించింది న్యాయస్థానం.

Tags

Related News

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?

Dog Bite Victims: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక మలుపు.. బాధితుల జోక్యానికి గ్రీన్ సిగ్నల్!

Big Stories

×