Big Stories

High Milage Electric Scooters: ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. ఇదిగో లిస్ట్..!

bajaj chetak ev
bajaj chetak ev

Best and High Milage Electric Scooters List: ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికల్సే దర్శనమిస్తున్నాయి. రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలే రయ్ రయ్ మంటున్నాయి.

- Advertisement -

పెట్రోల్, డీజిల్ అధిక ధరల కారణంగా వాహన ప్రియులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల వాహన ప్రియులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ తయారీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి.

- Advertisement -

వాహన దారుల సేఫ్టీ, ఇతర ప్రయోజనాలకు తగ్గట్టుగా కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేసి మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. అయితే వీటి ధరలు కూడా అధికంగా ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు కొందరు వెనకడుగు వేస్తున్నారు.

కాగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్కువగా స్కూటర్లు అమ్ముడుపోతున్నాయి. వీటిపైనే చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సరికొత్త డిజైన్లు, ఆకట్టుకునే పనితీరుతో కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను తీసుకువస్తున్నాయి.

Also Read: ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 120 కి.మీ మైలేజీ.. రూ.1999లతో ఇంటికి తెచ్చుకోండి..

అయితే ఇలాంటి సమయంలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇక్కడ కొన్ని కంపెనీలకు చెందిన ఈవీలు అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన ధర, ఫీచర్లు, మైలేజీతో సహా మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

బజాజ్ చేతక్ (Bajaj Chetak):

మార్కెట్‌లో బజాజ్‌ మోటార్స్‌‌కు భలే డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి ఎలాంటి వెహికల్ లాంచ్ అయిన వాహన ప్రియులు ఎగబడి కొనేస్తుంటారు. అయితే బజాజ్‌ మోటార్స్‌‌ ఇండియా నుంచి యూత్‌ ఫేవరెట్‌ స్కూటర్‌ చేతక్‌ను కంపెనీ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో తీసుకొచ్చింది.

ఇది అర్బన్, ప్రీమియం అనే 2 వేరియంట్‌లలో వచ్చింది. దీనిని రూ.1.15 లక్షల నుండి రూ.1.35 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య కొనుక్కోవచ్చు. కాగా ఈ బజాజ్‌ చేతక్‌ అర్బన్ మోడల్ ఫుల్ ఛార్జింగ్‌తో 113 కి.మీ మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా ఇది గంటకు గరిష్ఠంగా 73 కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది.

Also Read: బంపర్ ఆఫర్.. స్కూటర్‌పై ఏకంగా రూ. 41వేలు డిస్కౌంట్!

ఇక బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ పూర్తి ఛార్జింగ్‌పై 108 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ఠవేగం 63 కి.మీగా ఉంది. ఈ మోడల్స్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్‌తో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

హీరో విడా (Hero Vida):

భారత్‌లో హీరో మోటోకార్ప్ తనదైన శైలిలో దూసుకుపోతుంది. ద్విచక్ర వాహన తయారీలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ కంపెనీ విడా(Hero Vida) పేరుతో ఒక ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని V1 ప్లస్, V1 ప్రో వంటి వేరియంట్‌లలో ఉంచింది. ఈ స్కూటర్‌ ధర రూ.1.15లక్షల నుంచి రూ.1.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుక్కోవచ్చు. హీరో విడా వి1 ప్లస్ స్కూటర్ పూర్తి ఛార్జింగ్‌పై 100 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలాగే విడా వి1 ప్రో వేరియంట్ పూర్తి ఛార్జింగ్‌‌పై 110 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

Also Read: అదరగొడుతున్న హ్యుందాయ్ క్రెటా EV.. సింగిల్ ఛార్జ్‌తో 450 కిలో మీటర్లు!

టీవీఎస్‌ ఐక్యూబ్‌ (TVS iQube):

భారత మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌కు సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒకటి ఐక్యూబ్ కాగా.. మరొకటి ఐక్యూబ్ ఎస్. వీటి ధరలు వరుసగా.. రూ.1,47,968 నుండి రూ.1,53,909(ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉన్నాయి. ఈ స్కూటర్లు పూర్తి ఛార్జింగ్‌తో 100 కి.మీ మైలేజీను అందిస్తుంది. అలాగే ఈ రెండు వేరియంట్‌లు గరిష్ఠంగా 75 కి.మీ వేగంతో పరుగులు పెడతాయి.

తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేసుకునేవారికి ఈ స్కూటర్లు మంచి ఛాన్స్ అనే చెప్పాలి. కాగా ఇప్పుడు వీటిని మిస్ అయితే.. ఏప్రిల్ నుంచి వీటి ధరలు పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News