E-Paper
Advertisement

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?
Advertisement

Gold Rate Dropped: హమ్మయ్య.. గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు, నిన్నటి నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టడం వినియోగదారులకు, పెట్టుబడిదారులకు ఊరటనిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడం, ప్రపంచ ఆర్థిక పరిణామాల్లో చోటుచేసుకున్న మార్పుల వల్ల పసిడి ధరల్లో ఈ తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడం వల్ల కూడా దేశీయ మార్కెట్లలో ధరలు దిగివస్తున్నాయి. ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో, వరుసగా పెరుగుతున్న ధరల మధ్య ఈ చిన్నపాటి తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని ఇస్తోంది.

నేడు పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,250 కాగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,200 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,650 ఉండగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 3,050 తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం మంచిది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,36,200 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,200 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,850 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,200 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,850 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,350 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,25,000 వద్ద కొనసాగుతోంది.

Also Read: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. జనవరి ఫస్ట్ వీక్ తర్వాతే నిర్ణయం

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వావ్.. భారీగా పెరిగిన సిల్వర్ ధరలు.. నేడు భారీగా తగ్గాయి.. అందనంతా ఎత్తుకు వెళుతున్న వెండి ధరలను చూసి ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. కానీ, ఇప్పుడు మళ్లీ తగ్గుతుండటంతో సిల్వర్ కొనాలనుకునేవారు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్న సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,81,000 ఉండగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,58,000 వద్ద కొనసాగుతోంది. నేడు ఒక్కసారిగా కేజీ సిల్వర్ ధరపై రూ.23,000 తగ్గింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద పలుకుతోంది.

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×