E-Paper
Advertisement

5 బడ్జెట్ ఫ్రెండ్లీ బిజినెస్ ఐడియాస్

5 బడ్జెట్ ఫ్రెండ్లీ బిజినెస్ ఐడియాస్
Advertisement

Business Ideas: ఉద్యోగంతో విసిగిపోయారా? తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీ ప్రాంతం, ప్లానింగ్ ను బట్టి ఐదు ఫ్రెండ్లీ బిజినెస్ ఐడియాస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆర్వో వాటర్ ప్లాంట్

ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఏరియాను బట్టి 35-50 శాతం వరకు మార్జిన్ ఉంటుంది. కార్పొరేట్ ఆఫీసులు, లోకల్ మార్కెట్లు, మిడిల్ క్లాస్ ఏరియాల్లో లాభదాయకంగా ఉంటుంది.

2. స్క్రాప్ కలెక్షన్, రీసైక్లింగ్

Advertisement

స్క్రాప్ ను సేకరించి, రీసైక్లింగ్ చేసే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఈ స్టార్టప్ ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఏరియాను బట్టి 25- 50 శాతం మార్జిన్ ఉండే అవకాశం ఉంది. ఈ బిజినెస్ వర్కవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనదేశంలో ఏటా 60 మిలియన్ టన్నుల స్క్రాప్ జనరేట్ అవుతుంది.

3. ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ యూనిట్

ప్రస్తుతం ఆన్ లైన్ యుగం నడుస్తోంది. ఆన్ లైన్ లో కొనుగోలు చేసే ప్రతీ వస్తువుకు ప్యాకింగ్ అవసరం అవుతుంది. ఫుడ్ నుంచి దుస్తుల వరకు ప్రతి వస్తువును ప్యాకింగ్ లో ఇస్తున్నారు. కాబట్టి ప్రింటింగ్ ప్యాకింగ్ బిజినెస్ కు మంచి గిరాకీ ఉంది. ఈ స్టార్టప్ కు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఏరియాను బట్టి 20 నుంచి 35 శాతం ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది.

4. డీలర్ షిప్

Advertisement

కంపెనీల ప్రొడెక్ట్స్ ను షాపులకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి డీలర్ షిప్ బాగా ఉపయోగపడుతుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు. ఇందులో 10 నుంచి 15 శాతం ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది.

5. ఏటీఎం ఫ్రాంఛైజీ/ కియోస్క్ బ్యాంకింగ్

ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం ఉంటుంది. డబ్బులు కోసం బ్యాంకులు లేదా ఏటీఎం కోసం వెతుకుతుంటారు. మీ ఏరియాలో అవసరాలను బట్టి ఏటీఎం ఫ్రాంఛైజీ లేదా కియోస్క్ బ్యాంకింగ్ ను స్టార్ట్ చేయవచ్చు. బ్యాంకులు లావాదేవీలపై కమిషన్ ఇస్తాయి. ఈ స్టార్టప్ కు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రాఫిట్ మార్జిన్ రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది.

Also Read:  వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండటానికి ఈ రెమెడీస్ పాటించాలట – అవేంటో తెలుసా..?

ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి.

  • లోకల్ మార్కెట్ లో పరిస్థితులపై రీసెర్చ్ చేయాలి.
  • నిర్వహణ ఖర్చులను అర్థం చేసుకోవాలి.
  • దీర్ఘకాలికంగా వ్యాపారం కొనసాగించేలా ప్లానింగ్ ఉండాలి.

Disclaimer: ఈ కంటెంట్ కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న వివరాలు అంచనాలు మాత్రమే. ఏదైనా బిజినెస్ ఏర్పాటుకు ముందు నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది. ఈ ప్రాంతం, మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడి, కార్యకలాపాల ఆధారంగా పెట్టుబడి మారవచ్చు. ఈ కంటెంట్ ఆదాయం, లాభాలు లేదా బిజినెస్ సక్సెస్ కు ఎలాంటి హామీ ఇవ్వదు.

Related News

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

కస్టమర్లకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, మార్కెట్లో ఇప్పుడు ఎంతంటే..

ఇంజినీరింగ్‌లో 11 బ్యాక్‌లాగ్స్.. కట్ చేస్తే రూ.50 లక్షల ప్యాకేజీ జాబ్.. సక్సెస్ స్టోరీ

హైదరాబాద్ నుంచి Zomato అవుట్? 250 మంది ఉద్యోగుల తొలగింపు?

డబ్బు సంపాదించడానికి డిగ్రీలు అవసరం లేదు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే ఈ కెరీర్లు బెటర్

బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×