Pawan Kalyan: తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకులు తమిళనాడు రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చారు అయితే మొదటిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి పార్టీ స్థాపించిన రెండు సంవత్సరాలకి ఎన్నికలలో విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ(TVK Party) అధినేత జోసెఫ్ విజయ్(Joseph Vijay) తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలలో ఎలాంటి పొత్తు లేకుండా విజయ్ 108 స్థానాలలో విజయం సాధించారు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరో 10 స్థానాలు అవసరం కావడంతో ఈయన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
నేడు ఉదయం చెన్నైలో విజయ్ ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా ముఖ్యమంత్రి విజయ్ కు అభినందనలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు అభినందనలు తెలియజేశారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..”తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తిరు విజయ్‌కు, అలాగే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. కొత్త ప్రభుత్వం ప్రజల ఆశయాలకు, ఆశలకు అనుగుణంగా పనిచేస్తుంది” అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పలువురు కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
Heartfelt congratulations to @TVKVijayHQ Chief Thiru @actorvijay AVL, on taking oath as the Chief Minister of Tamil Nadu, and to all those who took oath as Ministers.
I wish the new government will fullfill the aspirations of the people, ensure transparent and progressive…
— Pawan Kalyan (@PawanKalyan) May 10, 2026
తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఈయనకు తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయన ఉన్న ఫలంగా రాజకీయాలలోకి అడుగుపెట్టారు. టీవీకే పార్టీని స్థాపించి కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే అధికారం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు అది కూడా సింగిల్ గా పోటీ చేసి ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే అప్పట్లో సినీ నటులుగా కొనసాగుతూ రాజకీయాలలోకి వచ్చిన వెంటనే పదవులు అందుకున్నటువంటి ప్రముఖ నటులు ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి మహా నటుల తరువాత అలాంటి విజయం నటుడు విజయ్ కు దక్కింది. ఇక విజయ్ ముఖ్యమంత్రి కావడంతో సినిమాలకు పూర్తిగా దూరం కాబోతున్నారని తెలుస్తోంది.
Also Read: విజయ్ టీవీకే పార్టీలోకి సినీనటి ఆర్కే రోజా..ఇదిగో క్లారిటీ?