E-Paper
Advertisement

Fixed Deposit Vs Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ వర్సెస్ ఫిక్స్ డ్ డిపాజిట్.. ఈ పెట్టుబడి ఏది బెస్ట్?

Fixed Deposit Vs Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ వర్సెస్ ఫిక్స్ డ్ డిపాజిట్.. ఈ పెట్టుబడి ఏది బెస్ట్?
Advertisement

Fixed Deposit Vs Insurance: భవిష్యత్ ఆర్థిక అవసరాలకు సేవింగ్స్ చాలా ముఖ్యం. సేవింగ్స్ అనగానే మనకు గుర్తొచ్చే బెస్ట్ పెట్టుబడి మార్గాలు ఫిక్స్ డ్ డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్. ఈ రెండింటిలో ఏది బెస్ట్, నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే మీ పెట్టుబడిని ఫిక్స్ డ్ టైం పీరియడ్ లో ఇన్వెస్ట్ చేయండి.ఎఫ్డీలు సాధారణంగా 7 రోజుల నుంచి 10 ఏళ్ల టైం పీరియడ్ కు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎఫ్డీలపై బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇందులో మీ పెట్టుబడికి రిస్క్ తక్కువ, అలాగే అదనంగా వడ్డీ కూడా పొందుతారు. ఎఫ్డీలను కనిష్టంగా రూ.1000తో స్టార్ చేయవచ్చు. రిటర్న్స్ ను ముందుగానే ఫిక్స్ చేస్తారు. వీటిపై మార్కెట్ పరిస్థితుల ప్రభావం ఉండదు.

జీవిత బీమా ప్రయోజనాలు

లైఫ్ ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి ఆర్థికంగా భరోసాకి కల్పిస్తుంది. లాంగ్ టర్మ్ సేవింగ్స్, మెచ్యూరిటీ ప్రయోజనాలతో పాటు డెత్ బెనిఫిట్స్ ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ లో 100 సంవత్సరాల వరకు కవరేజీ ఉంటుంది. బీమా మొత్తం, కాల పరిమితి.. వివిధ అంశాలు ప్రీమియంను డిసైడ్ చేస్తాయి. కొన్ని ఎల్ఐసీ పాలసీలపై రిటర్న్స్ ఎఫ్డీల కంటే ఎక్కువగా ఉంటాయి. ఎల్ఐసీ పాలసీల్లో బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు ఉంటాయి.

పన్ను మినహాయింపులు

Advertisement

ఎఫ్డీలపై వచ్చే ఆదాయానికి పన్ను విధిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని పన్ను స్లాబ్ ల ప్రకారం ఈ పన్ను ఉంటుంది. అయితే 5 ఏళ్లకు ఎఫ్డీ తీసుకుంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C పన్ను మినహాయింపు ఉంటుంది. ఏడాది గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. నామినీలు పొందే డెత్ బెనిఫిట్స్ లేదా మెచ్యూరిటీలపై సెక్షన్ 10(10D) కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ప్రీమియం సమ్ అస్యూర్డ్ లో 10% కంటే మించకూడదు.

Also Read:  ఎఫ్‌డీపై లోను తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

ఏది బెటర్?

Advertisement

మీకు ఎమర్జెన్సీగా డబ్బు అవసరమైతే ఎఫ్డీలను బ్రేక్ చేయవచ్చు. ఎఫ్డీ బ్రేక్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ లో లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. పాలసీదారుడికి డబ్బు అవసరమైతే పాలసీని సరెండర్ చేయవచ్చు. పాలసీ సరెండర్ కు ఛార్జీలు ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్, లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏది బెటర్ అనేది.. వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. తక్కువ కాలానికి పెట్టుబడి పెట్టాలనుకుంటే FD బెస్ట్ ఛాయిస్ కావచ్చు. మీరు లేకపోయినా మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×