E-Paper
Advertisement

Imad Wasim: ఇంకా ఎన్ని సార్లు పిచ్‌లు మార్చి గెలుస్తారు.. విషం క‌క్కిన పాక్ ప్లేయ‌ర్

Imad Wasim: ఇంకా ఎన్ని సార్లు పిచ్‌లు మార్చి గెలుస్తారు.. విషం క‌క్కిన పాక్ ప్లేయ‌ర్
Advertisement

Imad Wasim: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, Final) మధ్య ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో 96 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో ముచ్చటగా మూడవసారి టీమిండియా ఛాంపియన్ గా అవతరించింది. ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా ట్రోఫీ గెలవడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ అలాగే పిచ్ మార్చిన నేపథ్యంలోనే ఇండియా గెలిచిందని బాంబు పేల్చుతున్నారు. అయితే తాజాగా దీనిపై ఇమాద్‌ వసీం ( Imad Wasim ) కూడా స్పందించారు. పిచ్ లు మార్చి టీమిండియా గెలుస్తోంద‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

ఇంకా ఎన్ని సార్లు పిచ్‌లు మార్చి గెలుస్తారు.. విషం క‌క్కిన పాక్ ప్లేయ‌ర్

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా గెలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్ ఇమాద్‌ వసీం ( Imad Wasim ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎన్నిసార్లు పిచ్ లు మార్చి , ఇలా టైటిల్స్ గెలుస్తారు ? అంటూ సంచలన ఆరోపణలు చేశారు. బిసిసిఐ ఆధ్వర్యంలోని ఐసీసీ నడుస్తోందని, అందుకే వరుసగా టీమ్ ఇండియా టైటిల్స్ గెలుస్తోందని సంచలన ఆరోపణలు చేశాడు. ఒక ఏడాదిలోనే మూడు టైటిల్లు గెలవడం వెనుక పెద్ద కుట్ర ఉందని బాంబు పేల్చాడు. ఇండియాలోనే మ్యాచులు జరుగుతున్నాయి కాబట్టి… టీమిండియా కు అనుకూలంగా పిచ్ లు తయారు చేస్తున్నారని సీరియస్ అయ్యారు ఇమాద్‌ వసీం. లేకపోతే టీమిండి అసలు ఒక్క మ్యాచ్ కూడా గెలవదని పరువు తీసే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతమున్న టీమిండియా మాత్రం చాలా బలంగా ఉందని వ్యాఖ్యానించారు ఇమాద్‌ వసీం. విదేశాల్లో కూడా ఈ టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ జరిగితే కూడా టీమిండియా గెలుస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇమాద్‌ వసీం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ముచ్చటగా మూడవసారి టైటిల్ అందుకున్న టీమిండియా

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడు టైటిల్స్ అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది ఇండియా. ఇప్పటివరకు టి20 ప్రపంచ కప్ లో మూడు ట్రోఫీలు ఏ ఒక్క జట్టు కూడా గెలవలేదు. కానీ ఆ ఘనత టీమిండియా సొంతం చేసుకుంది. గతంలో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ లు ఎలా గెలిచేదో? ఇప్పుడు టీమిండియా కూడా t20 వరల్డ్ కప్ లు అలా గెలుస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×