BigTV English

Loan against Fixed Deposit (FD): ఎఫ్‌డీపై లోను తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

Loan against Fixed Deposit (FD): ఎఫ్‌డీపై లోను తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
Loan Against Fixed Deposit
 

Loan Against Fixed Deposit: జీవితంలో కొన్ని పరిస్థితుల వల్ల కలిగే డబ్బు అవసరాలను మాటల్లో చెప్పలేం. అత్యవసర సమయాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేసిన డబ్బులు చేతికందే పిరిస్థితి ఉండదు. ఇలాంటి సమయాల్లోనే మనం చేసిన ఫిక్స్ డిపాజిట్(ఎఫ్ డీ) మనల్ని ఆదుకుంటాయి. అలా అని పెట్టుబడులు మెర్చూర్ అవ్వకముందే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అదెలా అంటారా.. బ్యాంకులు ఎఫ్ డీ మీద ఇచ్చే లోన్ ల ద్వారా పరిస్థితులు చక్కదిద్దుకోవచ్చు.


దేశంలో ఎఫ్‌డీ పై ఇచ్చే లోన్ మొత్తం పెరిగిందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2023 లో ఎఫ్ డీల మీద ఇచ్చిన లోను రూ. 113.9 కోట్లని ఇందులో స్పష్టం చేసింది. ఎఫ్‌డీ ఖాతా ఉన్న భారత పౌరులు , ట్రస్టులు, హిందు అవిభాజ్య కుటుంబాలు, సమాఖ్యాలు, భాగస్వామ్య సంస్థలు, ఈ తరహా రుణం తీసుకోవడానికి అర్హులు. ఎగవేతలు లేకుండా ఈ లోన్ ను సకాలంలో చెల్లిస్తే కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: నుంచి స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 1200 కిమీ రేంజ్..?


సాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చే మొదటి సందేహం వడ్డీ ఎంత? ఉంటుందనే.. బ్యాంకులు బట్టి అవి మనకు ఇచ్చే వడ్డీపై ఆధారపడి ఉంటుంది. ఇది ఎఫ్‌డీ మీద ఖాతాదారుడికి ఇచ్చే వడ్డీ పైన 0.75 నుండి 2 శాతం వరకు వసూలు చేస్తారు. ఎఫ్ డీ షూరిటీగా ఉండడంతో ఎగవేత ముప్పు ఉందని బ్యాంకులు ఈ తరహా రుణాలు సులభంగా ఇస్తున్నాయి.
ఎంత ఇస్తారు: 

ఎఫ్‌డీ మీద డిపాజిట్ చేసిన మొత్తంలో 85 శాతం నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొన్ని సార్లు మాత్రం నిర్దిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేసిన వారికే ఇస్తున్నారు.

చెల్లింపులు ఇలా:

ఇందులో ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది. ఎఫ్‌డీ కాలపరిమితి ముగిసిననాటికే రుణం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రుణాలతో పోలిస్తే ఇది మేలు చేస్తుంది. అంతే కాకుండా రుణం మంజూరు ప్రక్రియ సైతం వేగంగానే పూర్తవుతుంది.అలాగే ప్రాసెసింగ్ ఫీజు నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది.

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×